నటి స్నేహ వైరల్ వీడియో: భర్త పర్యవేక్షణలో.. చాలా కష్టపడుతోంది..
Recommended Video

సౌందర్య తర్వాత తెలుగు ప్రేక్షకులకు మళ్లీ అంతలా కనెక్ట్ అయిన హీరోయిన్ స్నేహ. తెలుగులో స్నేహ చేసిన పాత్రలు.. ఆమె హోమ్లీ లుక్.. ఇక్కడ చాలామంది అభిమానులనే సంపాదించి పెట్టాయి. పెళ్లి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన స్నేహ.. కాస్త ఒళ్లు చేసినట్టు కనిపించారు. దీంతో మళ్లీ ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేశారు స్నేహ.
జిమ్ వర్కౌట్స్:
స్నేహ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్త ప్రసన్న పక్కనే ఉండి వర్కౌట్స్ చేయిస్తుంటే.. స్నేహ చాలానే కష్టపడుతున్నారు. జిమ్ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్నేహ.. 'కొత్త జర్నీ మొదలైంది.. చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరం ఉంది' అని ఓ సరదా కామెంట్ చేయడం విశేషం.

చెర్రీతో సినిమా..:
త్వరలోనే రాంచరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఒక సినిమా మొదలుకానుంది. ఇందులో స్నేహ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఫిలింనగర్‌లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. రాంచరణ్‌కు స్నేహ వదినగా నటించనున్నారట.

ఆ సినిమా కోసమేనా
కన్నడలోనూ స్నేహ ప్రధాన పాత్రలో 'మునిరత్న కురుక్షేత్ర' అనే సినిమా మొదలుకానుంది. ఈ సినిమా కోసమే స్నేహ వర్కౌట్స్ మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. బాహుబలి తరహాలో అత్యంత భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

తెలుగు ప్రేక్షకులను మెప్పించింది..:
తెలుగులో స్నేహ సినిమాల విషయానికొస్తే.. 'తొలవలపు' చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'ప్రియమైన నీకు', ‘హనుమాన్ జంక్షన్', ‘వెంకీ', ‘సంక్రాంతి', ‘శ్రీరామదాసు', ‘అమరావతి', ‘రాజన్న', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.


Click it and Unblock the Notifications











