స్నేహ తాళి కట్టించుకునే శుభవేళ అదే...
తాళి కట్టు శుభవేళ...మెడలో కళ్యాణ మాల అంటూ హీరోయిన్ స్నేహ పాడుకునే సమయం ఆసన్నమైంది. గత కొంత కాలంగా తన తోటి నటుడు ప్రసన్నతో స్నేహ లవ్వాయణం కొనసాగిస్తోంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఇద్దరూ త్వరలో ఏకం కాబోతున్నారు. మే 11వ తేదీన వీరి పెళ్లి ముమూర్తం ఖరారైంది. చెన్నయ్ లోని వానగరంలోనే శ్రీవారు వెంకటాచలపలి కళ్యాణ మంటపంలో వీరి పెళ్లి జరుగనుంది. పెళ్లి పనులు ప్రారంభం అయినట్లు ప్రసన్న ప్రకటించారు. పెళ్లి తర్వాత స్నేహ నటిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు...ఆమెకు ఇష్టం ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు, లేక పోతే నటనకు స్వస్థి చెప్పవచ్చు అంటూ సమాధానం ఇచ్చాడు.
అచ్చముండు, అచ్చముండు సినిమాలో కలిసి నటించినప్పుడు స్నేహ, ప్రసన్న మధ్య ఏర్పడిన పరిచయం ఆపై ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిన విషయం తెలిసిందే. చాలా కాలం పాటు రహస్యంగా ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట తమది కేవలం స్నేహమే అని చెప్పకొచ్చింది. ఇద్దరి మధ్య ఎఫైర్ కొనసాగుతోందని మీడియాలో వార్తలు గుప్పుమనడంతో ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు, త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











