twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోసపోయిన తెలుగు హీరోయిన్.. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కక తప్పలేదు

    |

    రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీ సరికొత్త మోసాలకు తావిస్తోంది. సాధారణ జనంతో పాటు సెలెబ్రిటీలు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ ఓ వైపు నుంచి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. సైబర్ నేరగాళ్ల మ్యాజిక్కులకు మెల్ట్ అయిపోతున్నారు జనం. తాజాగా తెలుగు హీరోయిన్ సోనాక్షి వర్మ కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడి చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే..

    సోషల్ మీడియాలో యాక్టీవ్.. కొంప కొల్లేరు

    సోషల్ మీడియాలో యాక్టీవ్.. కొంప కొల్లేరు

    నేటితరం యంగ్ హీరోయిన్స్ అంతా సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటున్నారు. ఈ కోవలోనే తెలుగు భామ సోనాక్షి వర్మ కూడా సోషల్ మీడియా ప్లేట్ ఫార్మ్స్ ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి వాటిలో చాలా అప్‌డేట్ గా ఉండేది. అయితే సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఆ చురుకుదనమే ఆమె కొంప కొల్లేరు చేసింది. ఒక సైబర్ నేరగాడు ఆమెను చీటింగ్ చేశాడు.

    గుర్తు తెలియని వ్యక్తి రిక్వెస్ట్..

    గుర్తు తెలియని వ్యక్తి రిక్వెస్ట్..

    కొద్దీ రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి సోనాక్షి వర్మకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. మెరిన్ కిరాక్ పేరుతో వచ్చిన ఆ రిక్వెస్ట్ కి రెస్పాండ్ అయిన సోనాక్షి అతన్ని ఫ్రెండ్ గా యాక్సప్ట్ చేసింది. ఆ తర్వాత అతనితో చాటింగ్ చేయడం, ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేసింది.

    ఖరీదైన గిఫ్ట్ అంటూ మోసం

    ఖరీదైన గిఫ్ట్ అంటూ మోసం

    మెరిన్ కిరాక్ పేరుతో వచ్చిన ఆ రిక్వెస్ట్ పెట్టింది ఓ నైజీరియన్ వ్యక్తి. సోనాక్షి వర్మను మెల్లగా ముగ్గులోకి దించిన ఆ యువకుడు ఆమెను బాగా నమ్మించాడు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. పైగా నీకు ఖరీదైన గిఫ్ట్ ఇస్తానంటూ మాయ మాటలు చెప్పి అమ్మడిని బురిడీ కొట్టించాడు. తమ ఫ్రెండ్ షిప్ కు గుర్తుగా ఓ గిఫ్ట్ పంపుతున్నానని, అది ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్ లోని మీ ఇంటికి వస్తుందని ఆమెతో చెప్పాడు.

    గిఫ్ట్ వచ్చిందంటూ ఫోన్

    గిఫ్ట్ వచ్చిందంటూ ఫోన్

    ఆ తర్వాత కొన్ని రోజులకు మెరిన్ కిరాక్ పేరుతో మీకు ఓ గిఫ్ట్ వచ్చిందంటూ సోనాక్షి వర్మకు ఫోన్ వచ్చింది. అయితే ఖరీడైయాన్ గిఫ్ట్ కాబట్టి ఆ గిఫ్ట్ కొరియర్ చార్జీల నిమిత్తం 85 వేలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని చెప్పడంతో ఆమె వెంటనే ఆ డబ్బు ఆరెంజ్ చేసి సదరు బ్యాంకు ఖాతాలో జమ చేసింది.

    చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి

    చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి

    అయితే ఎన్ని రోజులు వేచి చూసినా ఆ గిఫ్ట్ మాత్రం ఇంటికి రాకపోవడంతో అతనికి ఫోన్ చేసింది సోనాక్షి. కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయానని తెలుసుకొని పోలీస్ మెట్లెక్కింది హీరోయిన్. తాను మోసపోయిన విధానాన్ని పేర్కొంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? మీరే చెప్పండి.

    English summary
    Actress Sonakshi Varma fell prey to cybercrime cheaters and lost Rs 85 Thousand. The actress approached the police and filed a complaint in Hyderabad Cybercrime police station on Wednesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X