For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లీకైన ఆ ఫొటోల్లో ఉన్నది నా భర్తే: హీరోయిన్‌ బెడ్ రూం ఫొటోలు లీక్ (ఫొటోలు)

  By Srikanya
  |

  బెంగుళూరు: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పర్శనల్ ఫొటోలు వరస పెట్టి లీక్ అవుతున్నాయి. మీడియాలో ఈ లీక్ ఫొటోలు హల్ చల్ చేస్తూ మిగతా హీరోయిన్స్ కు కంగారు పుట్టిస్తున్నాయి. తమ స్వలాభం కోసం ఎవరన్నా ఇలా లీక్ చేస్తున్నారో లేక వేరే విధంగా లీక్ అవుతున్నాయో కానీ ఈ ఫొటోలకు, వీడియోలకు యమా డిమాండ్ ఏర్పడుతోంది.

  ఓ ప్రక్కన రాధికా ఆప్టే వీడియో లీక్ గురించి మాట్లాడుకోవటం పూర్తి కాకుండానే మరో హీరోయిన్ బెడ్ రూం ఫొటోలు బయిటకు వచ్చాయి. ఈ ఫొటోలు కన్నడ పరిశ్రమలోని హీరోయిన్ వి. ఆ హీరోయిన్ కు ఉన్న క్రేజ్ తో అక్కడ మీడియా రెచ్చిపోయి వీటిని ప్రసారం చేసి టీఆర్పీ రేటింగ్ లు పెంచేసుకుంది. అంతేకాకుండా ఆ ఫొటోల్లో ఉన్నది ఆమె భర్త కాదని ఓ పొలిటీషియన్ అని కథనం కూడా ప్రసారం చేసేసింది.

  పూర్తి వివరాల్లోకి వెళితే...తాజాగా మరో హీరోయిన్‌ సైబర్‌ దాడుల వలలో పడింది. కన్నడ హీరోయిన్‌ సోనూ గౌడ (శృతి రామకృష్ణన్‌) వ్యక్తిగత ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం దుమారం రేపింది. కొన్ని న్యూస్‌ చానెళ్లు ఆ ఫొటోలను ప్రసారం చేయడం సోనూ గౌడను ఇబ్బందిపరిచింది. ఓ వ్యక్తితో ఆమె అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న మూడు ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి.

  మరిన్న వివరాలు స్లైడ్ షోలో..

  మనస్తాపం చెందిన ఆమె

  మనస్తాపం చెందిన ఆమె

  దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సోను గౌడ మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆన్‌లైన్‌లో లీకైన ఫొటోల్లో ఉన్న వ్యక్తి తన భర్త మనోజ్‌ గౌడ అని ఆమె తెలిపింది. ఆ ఫొటోలో తనకు సన్నిహితంగా వ్యక్తినివేరే వ్యక్తిగా ప్రచారం చేయవద్దని కోరింది. భర్తతో ఉండటం కూడా తప్పా అంటోంది. అయితే భర్త ఫొటోలు జనాలకు,మీడియాకు తెలుసు కదా..వేరే వారు అని చెప్పటం ఎందుకో మరి.

  పొలిటీషన్ తో ఉన్న ఫొటోలో లీక్ అంటూ..

  పొలిటీషన్ తో ఉన్న ఫొటోలో లీక్ అంటూ..

  ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో సోనుగౌడ సన్నిహితంగా మెలుగుతున్నదని, అతనితో దిగిన ప్రైవేటు ఫొటోలు లీక్‌ అయ్యాయంటూ కొన్ని చానెళ్లు విపరీత ప్రచారం చేయడం సోనుగౌడను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆమె ఇప్పుడు తనకు డ్యామేజ్ జరిగిందని, వేరే వారితో తనకు సంభంధం అంటగట్టడం భావ్యం కాదని, ఇది తమ సంసారంలో గొడవలు రేపుతాయని చెప్తోంది.

  ఆ ఛానెల్స్ పై కేసులు

  ఆ ఛానెల్స్ పై కేసులు

  దీంతో చానెళ్లు, తన ఫొటోలు లీక్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే మీడియా వారు మాత్రం ఆ ఫొటోల్లో ఉన్నది ఆమె భర్త కాదని వాదిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటున్నా వారేమీ ఈమెపై కథనాలు ప్రసారం చేయటం మానలేదు. దాంతో సోను గౌడకుఏం చేయాలో అర్దం కావటం లేదట.

  హీరోయిన్ రాసలీలలు అంటూ..

  హీరోయిన్ రాసలీలలు అంటూ..

  హీరోయిన్ బెడ్ రూమ్ శృంగారం లీకయ్యింది అంటూ ఆ ఛానెల్స్ ఈ విషయమై విపరీతంగా కథనాలు ప్రచురించాయి. దాంతో ఆమె ఇమేజ్ కు భంగం వాటిల్లిందని భావిస్తోంది. అయితే ఆ హీరోయిన్ ఆమె బెడ్ రూమ్ లో శృంగారం లో పాల్గొంది ఎవరితోనో కాదు ఆమె భర్త తోనే . అయితే ఈ విషయం తెలియని కర్ణాటక లోని కొన్ని చానళ్ళు హీరోయిన్ రాసలీలలు అంటూ ప్రచారం చేసాయంటున్నారు ఆమె సన్నిహితులు

  ముల్లును ముల్లుతోనే..

  ముల్లును ముల్లుతోనే..

  టివి లో ఆమె రాసలీలలు అంటూ భారీ ఎత్తున ప్రచారం కావడంతో ఇక సైలెంట్ గా ఉంటే లాభం లేదని భావించిన ఆ హీరోయిన్ మీడియా ముందుకు వచ్చి నేను నా భర్త తో సన్నిహితంగా ఉన్న సమయంలో ఎవరో కావాలనే ఈ ఫోటో లని తీసి ఇలా రచ్చ రచ్చ చేస్తున్నారని వాపోయింది పాపం . తన భర్తతో శృంగారంలో పాల్గొన్న సమయంలో ఎవరో ఫోటోలు తీసి నెట్ లో పెట్టారు అది ఇప్పుడు కర్ణాటకలో సంచలనం రేపుతోంది .

  ఇంకో హీరోయిన్ ఇలా అంది

  ఇంకో హీరోయిన్ ఇలా అంది

  తాజాగా ఈ నగ్న సన్నివేశం లీక్‌ అవడంపై రాధికా ఆప్టే మాట్లాడారు. ‘ఇది జరిగినప్పుడు నేనేమీ స్పందించలేదు. నిజంగా చెప్పాలంటే.. ఏ చిత్రంలోని నగ్న సన్నివేశాలైనా అంతర్జాలంలో దొరుకుతున్నాయి. నేను ఈ సినిమాలో నటించాను. ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూడాలని కోరుకుంటున్నా. నేను ఈ సినిమా చేయాలి కానీ దీన్ని బహిరంగంగా ప్రదర్శించకూడదు అని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుంటే అర్థం లేదు కదా?' అని రాధికా ఆప్టే సమాధానం ఇచ్చారు.

  పోలీస్ ఇన్విస్టిగేషన్

  పోలీస్ ఇన్విస్టిగేషన్

  బెస్ట్ యాక్టర్ అనే మళయాళి చిత్రంలో చేసిన సోనూ రీసెంట్ గా ఈ విషయమై పోలీస్ కంప్లైంట్ సైతం ఇచ్చింది. ప్రస్తుతం ఇన్విస్టిగేషన్ జరుగుతోంది. అసలు ఎవరు ఆమె పర్శనల్ ఫొటోలు లీక్ చేసారు అనే దిశగా ఈ ఇన్విస్టిగేషన్ జరుగుతోంది. త్వరలోనే అసలు నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటామనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు

  పెళ్లైనా ఆఫర్సే ఆపర్స్

  పెళ్లైనా ఆఫర్సే ఆపర్స్

  2008లో 'ఇంతి నిన్న ప్రీతియా' అనే కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సోనూ గౌడ కన్నడంతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఇటీవల పెళ్లయిన తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తున్నది. ప్రస్తుతం​ ఆమె పలు కన్నడ, తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

  రియల్ ఫొటోలో అదే కంగారు

  రియల్ ఫొటోలో అదే కంగారు

  నిజానికి ఈ ఫొటోలు బయిటకు రాగానే అందరూ ఫేక్ ఫొటోలు అనుకున్నారు . కానీ తర్వాత అవి రియల్ ఫొటోలు అని తేలింది. ఈ విషయమై సోనూ హడావిడి చెయ్యకపోతే ఇప్పటికీ ఫేక్ అనుకుందరు, అసలు గొడవే లేకపోను అని మీడియాలో కొందరంటున్నారు. హీరోయిన్స్ వ్యక్తిగత జీవితాల్లో ఇవన్నీ మామూలు అయిపోయాయని, ఇలాంటి వాటి విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని సీనియర్స్ సలహా ఇస్తున్నారట.

  మాకూ జరిగితే పరిస్దితి ఏమిటి

  మాకూ జరిగితే పరిస్దితి ఏమిటి

  సోనూగౌడ వ్యవహారం ఇప్పుడు మిగతా హీరోయిన్స్ ని సైతం వణికిస్తోంది. రేపు తమకూ ఇలాంటి సంఘటన జరిగితే పరిస్దితి ఏమిటి..ఈ విషయమై నిజా నిజాలు బయిటకు రావాల్సిందే. ఇలాంటి పనులు చేసే వారిని కఠినంగా శిక్షించాల్సిందే అని అందరూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఈ విషయమై సోనూ చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. తనకు పరిచయం లేని హీరోయిన్స్ సైతం ఆమెకు ఫోన్ చేసి ధైర్యం చెప్తున్నారట.

  English summary
  South Indian actress Sonu Gowda, aka Shruthi Ramakrishna, is the latest actor to fall prey to a cyber-attack. The private photos of the actor, which were making the rounds online, were recently aired on some news channels, putting her in a very stressful situation.At least three intimate pictures of Sonu with an unidentified man have been leaked online.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X