కేజీ బంగారం చోరి కేసులో సినీ నటి అరెస్ట్.. నమ్మిచ్చి జిత్తుల మారి వేషాలతో బురిడీ!

తెలుగు సినిమా పరిశ్రమలో మరో సంచలన సంఘటన చోటు చేసుకొన్నది. ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో దొంగతనం చేసిన కేసులో విశాఖ పోలీసులు సినీ నటిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ఎవరా సినీ నటి? ఏమా దొంగతనం అనే వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా పరిశ్రమలో వర్థమాన తార సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో చోరీకి పాల్పడినట్టు ఫిర్యాదు అందడంతో సౌమ్య శెట్టిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అదుపులో ఉన్న ఆమెను విశాఖ క్రైమ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Sowmya Shetty

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ప్రసాద్ కూతురుతో పరిచయం పెంచుకొని వారి ఇంటికి తరచూ వెళ్తుండేది. ప్లాన్ చేసుకొన్న ఆమె కిలో బంగారం చోరీకి చేసింది. ఆ తర్వాత విశాఖ నుంచి గోవాకు మకాం మార్చింది. బంగారం చోరికి గురైందనే వార్త తెలుసుకొన్న ఇంటి సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మేము దర్యాప్తు చేసి ఆమెను అరెస్ట్ చేశాం. సౌమ్యశెట్ట ినుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకొన్నాం. కేసు నమోదు చేసి విచారిస్తున్నాం అని చెప్పారు.

Sowmya Shetty

సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లిన ప్రసాద్ కూతురుతో సౌమ్య శెట్టికి పరిచయం జరిగింది. దాంతో అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చేదని చెప్పారు. ఓ రోజు వాష్ రూమ్‌కు వెళ్తే తాళం వేసుకొనే ఆచారం మా ఇంటిలో ఉందని చెప్పడంతో ప్రసాద్ కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. అదే అదను చూసి ఆమె బంగారం చోరికి పాల్పడింది. పెళ్లికి వెళ్దామని నగల కోసం వెతకగా కనిపించకపోవడంతో ఆరా తీశారు. సౌమ్య శెట్టి దొంగిలించిందని తెలిసిన తర్వాత ఆమెపై మాకు ఫిర్యాదు చేశారు అని క్రైమ్ పోలీసులు చెప్పారు.

సౌమ్య శెట్టి తెలుగు సినిమా రంగంలో కొన్ని సినిమాల్లో నటించినట్టు తెలుస్తున్నది. యువర్స్ లవింగ్లీ, ది ట్రిప్ సినిమాలో నటించారు. మరికొన్ని సినిమాలు షార్ట్ ఫిలింస్‌లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X