హీరోయిన్ చేస్తానంటూ దర్శకుడి మోసం!!

అతను తమళ పరిశ్రమలో పలు చిత్రాలకు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసాడు. అలాగే శౌర్య చౌహాన్ అంత అనుభవమున్నాఅతన వేషమిప్పిస్తాననటంతో ఆశపడి మోసానికి బలవబోయింది. మొన్న ఆదివారం హిందీ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మొదట కుమరప్పన్ తెలివిగా శౌర్య చౌహాన్ పి.ఆర్ .వొ అలోక్ ని కలసాడు. తన పేరు రవి అనీ తాను మున్నాభాయ్ ఎంబిబిఎస్ తీసిన రాజ్ హిర్వాణీ వద్ద పనిచేసానని...తాజాగా తాను తమిళ టాప్ హీరో ఆర్య తో ఓ సినిమా తీస్తున్నానని చెప్పాడు. అంతేగాక ఆమెను హీరోయిన్ గాతీసుకోవాలని ఇంతదూరం వచ్చానని చెప్పుకొచ్చాడు. సర్లే వచ్చిన ఆఫర్ ఎందుకు పోగొట్టుకోవటం అని ఆమె అతన్ని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో శనివారం కలసింది.
అక్కడ ఆమెతో భారీగా ఖర్చు పెట్టించిన అతను తనకు బాలీవుడ్ లో చాలా పరిచయాలు ఉన్నాయని,హృతిక్ రోషన్ హెయిర్ డ్రెస్సర్ మైకల్ తన గర్ల్ ప్రెండ్ అని చెప్పుకొచ్చాడు. అంతేగాక తన క్రెండిట్ కార్డు మిస్సయిందనీ,డబ్బు అప్పు ఇవ్వమని,బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ ఇస్తే తిరిగి పే చేస్తానని కోరాడు. అంతేగాక బౌండ్ స్క్రిప్టు తో అతను కలవంటం,ఆమె క్యారెక్టర్ వివరించటం ఆమెను నమ్మేలా చేసాయి.
అనుమానం వచ్చినా ఏమో అని ఆమె ఓ పదివేలు ఇచ్చింది.అయితే అది తీసుకుని జంప్ అయ్యాడు. దాంతో అనుమానం వచ్చినామే అతన్ని పోలీసులకు పట్టించటానికి మళ్ళీ పోన్ చేసి అదే హోటల్ కి రప్పించింది. ఇదే విషయమాన్ని నిన్న మీడియా తో ఆమె పంచుకుంటూ..తనలాంటే మరికొంతమంది మోసపోకూడదనే ఈ పని చేసానంది.


Click it and Unblock the Notifications











