తక్కువ సమయంలో ఎక్కువ క్లోజ్ అయ్యాను.. మై డియర్ హీరో.. శ్రావణి వీడియో వైరల్
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు తిరుగుతున్నాయి. దేవరాజ్ రెడ్డి, సాయి మధ్య ఈ కేసు తిరుగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఆడియోలు లీక్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. టిక్‌టాక్ ద్వారా పరిచయమైన దేవరాజ్‌రెడ్డి కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సాయి అనే వ్యక్తి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ రెడ్డి ఆరోపిస్తున్నాడు.

సాయి వల్లే ఆత్మహత్య..
తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కొడుతున్నారంటూ, శ్రావణి దేవరాజ్‌తో మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు కూడా బయటకు వచ్చాయి. ఇందులో తన చావుకు సాయి కారణమని శ్రావణి చివరిసారిగా మాట్లాడిన మాటలు బయటపడ్డాయి. ఈ క్రమంలో గతంలోనూ దేవరాజ్‌ను, సాయి రక్తం వచ్చేలా కొట్టినట్లుగా సాక్ష్యాలు దిరికాయట. తాజాగా శ్రావణి సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది.

నా ఫేవరేట్ హీరో నువ్వే..
హాయ్ హీరో.. నా ఫేవరేట్ హీరో దేవరాజ్ రెడ్డి, హాయ్ ఎక్కడున్నావ్.. ఏం చేస్తున్నావ్.. మనం డైలీ ఇలాగే మాట్లాడుకుంటాం కదా.. కానీ నీ గురించి ఈ రోజు కొన్ని విషయాలు చెబుతాను.. ఎప్పుడూ చెప్పలేదు.. విను జాగ్రత్త..సాంగ్స్ వింటూ పక్కన డిస్టర్బ్ డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా విను అంటూ మనసులోని మాట చెప్పింది శ్రావణి.

సారీ చెప్పలేదు..
నాకు మాట్లాడటం రాదు..నేను నిన్ను చాలా సార్లు హర్ట్ చేశాను.. నేను ఇంత వరకు ఎవ్వరికీ సారీ చెప్పలేదు.. నీకు చెబుతున్నా.. సారీ హర్ట్ చేసినందుకు.. కానీ నువ్ ఎప్పుడూ కూడా నన్ను ఏమీ అనలేదు.. నువ్ ఆలోచించేది కరెక్ట్.. నీ గోల్స్ రీచ్ అవుతావ్.. టెన్షన్ పడకు.. ఆరు నెలల తరువాత అన్నావ్ కదా..అంతకు ముందే అయిపోవచ్చు నీ మనసు మంచిది అని దేవరాజ్ గురించి శ్రావణి తెలిపింది.
Recommended Video

మై డియర్ హీరో..
ఎవరి గురించి నువ్ నెగెటివ్ అనుకోవు..నీ పని నువ్ చేసుకుంటావ్.. మమ్మీని, చెల్లిని చూసుకోవాలనుకుంటావ్.. అది నాకు చాలా నచ్చుతుంది.. అలానే మీ మమ్మీని, చెల్లిని జాగ్రత్తగా చూసుకో.. ఇలాగే హ్యాపీగా ఉండు.. అప్పుడప్పుడూ నాతో కూడా మాట్లాడు.. ఎప్పుడూ నన్ను తిట్టకు.. సరేనా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు మై డియర్ హీరో.. గుడ్ నైట్.. నువ్ ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి.. ఎన్నో బర్త్ డేలు జరుపుకోవాలి..ఎక్కడున్నా ఎలా ఉన్నా నీ బర్త్ డేకు విష్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ కూడా అంటూ శ్రావణి ముగించింది.


Click it and Unblock the Notifications











