twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నానిపై శ్రీ రెడ్డి పోస్ట్.. వీడియో రూపంలో.. అదీ నాచురల్ స్టార్ వాయిస్‌తో

    |

    సాధారణంగానే శ్రీ రెడ్డి విమర్శ ఘాటుగా ఉంటుంది. ఆమె మెసేజ్ టైప్ చేసిందంటే.. అబ్బో! ఆ పదజాలం కాముడు కూడా చూసుండదేమో. అలాంటిది ఈ సెక్సీ లేడీ ఓ వీడియోతో ముందుకొస్తే ఇంకేమన్నా ఉంటుందా? సంచలమే ఇక. చుపించాల్సినవన్నీ చూపించి, తాను టార్గెట్ చేసిన వారిని ఓ ఆట ఆడేసుకొని పోతుంటుంది శ్రీ రెడ్డి. అయితే ఈ సారి మాత్రం చూపించడంలో కాస్త డోస్ తగ్గించి నానిపై కౌంటర్ వీడియో తయారు చేసింది శ్రీ రెడ్డి.

    ఇండస్ట్రీలోని చాలా మంది

    ఇండస్ట్రీలోని చాలా మంది

    టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పేరుతో తనను మోసం చేశారని నానా హంగామా చేసి నడి రోడ్డుపైనే బట్టలిప్పేసిన శ్రీ రెడ్డి.. ఇండస్ట్రీలోని చాలా మందిని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె పోరాటంతో నిజమెంత అనే దానిపై భిన్న స్వరాలు వినిపించడంతో ఆమెను తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు.

    నానిపై కూడా అప్పట్లో

    నానిపై కూడా అప్పట్లో

    తాను చేసిన పోరాటంతో దగ్గుబాటి వారసుడితో పాటు నాచురల్ స్టార్ నానిని కూడా లాగేసి అప్పట్లో నానా రచ్చ చేసింది శ్రీ రెడ్డి. అయితే ఆమె చేస్తున్న ఆరోపణల్లో నమ్మశక్యమైన అంశాలు కనిపించక పోవడంతో టాలీవుడ్ చిత్రసీమ ఆమెను పక్కన పెట్టేసింది. దీంతో కోలీవుడ్ కి మకాం మార్చిన శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆ రచ్చ కొనసాగిస్తూనే ఉంది.

    వీడియో రూపంలో

    ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టి అందరి దృష్టి తనపై పడేలా చేసుకునే శ్రీ రెడ్డి తాజాగా ఓ టిక్ టాక్ వీడియో పోస్ట్ చేసింది. తన నడుమును చూపిస్తూ.. ''ఇలా నడుములు గిడుములు పట్టుకోవడం మా ఇంటావంటా లేవు'' బ్యాక్ గ్రౌండ్‌లో నాని డైలాగ్‌కి 'నీలో ఉన్న నటరాజు.. నాలో ఉన్న నటరాజుని టచ్ చేస్తున్నాడని' తన ఎక్స్‌ప్రెషన్ మిక్స్ చేసి ఆ వీడియో రూపొందించింది శ్రీ రెడ్డి.

    నాని నీకే అంకితం అంటూ

    నాని నీకే అంకితం అంటూ

    సరే ఏదో తన సరదా కోసం ఈ వీడియో పోస్ట్ చేసుకుందేమో అనుకుంటే దీనిని నానికి అంకితమిస్తున్నట్లుగా పేర్కొని షాకిచ్చింది శ్రీ రెడ్డి. దీంతో ఈ వీడియో, శ్రీ రెడ్డి పెడుతున్న పోస్టులు చూసిన నెటిజన్లు.. ఎలాగోలా మరోసారి తన పోరాటాన్ని పట్టాలెక్కించాలని శ్రీ రెడ్డి చూస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    Read more about: sri reddy nani
    English summary
    Actress Sri Reddy again fired on Nani. She shared a video using nani voice. This video is viral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X