ఆ విషయంలో హీరోలు కూడా జీరోలే.. తాగితే బెడ్ మీద రచ్చ రచ్చే.. శ్రీరెడ్డి వెరైటీ జ్యూస్
శ్రీరెడ్డి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. టాలీవుడ్‌ను తన కామెంట్లు, ఆరోపణలతో ఓ ఊపు ఊపేసింది. టాలీవుడ్ అగ్ర కుటుంబాలు, హీరోల మీద శ్రీ రెడ్డి చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలతో శ్రీరెడ్డి బాగానే ఫేమస్ అయింది. అయితే ఆ తరువాత మళ్లీ చెన్నైకి వెళ్లి సెటిలైంది. అక్కడే ఉంటూ సోషల్ మీడియా ద్వారా నానా రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియాలో అలా..
శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో చేసే హల్చల్ గురించి అందరికీ తెలిసిందే. మెగా హీరోలు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై శ్రీ రెడ్డి చేసే కామెంట్లు ఎక్కువగా సెన్సేషన్ అవుతుంటాయి. నందమూరి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ శ్రీ రెడ్డి పోస్ట్‌లు పెడుతుంటూ ఉంటుంది.

కాంట్రవర్సీకి కేరాఫ్..
శ్రీ రెడ్డి అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటుంది. శ్రీ రెడ్డి చేసే పోస్ట్‌లు, అందాల ఆరబోతలు అన్నీ కూడా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఆమె చేసే భారీ అందాల ప్రదర్శన చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆమె షేర్ చేసే బాత్రూం సెల్ఫీలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి.

తాజాగా అలాంటి వీడియో..
తాజాగా శ్రీ రెడ్డి ఓ వీడియోను షేర్ చేసింది. మామూలుగా అయితే శ్రీ రెడ్డి తన యూట్యూబ్ చానెల్‌లో వంటల ప్రోగ్రాంలు, కూరగాయలు పండించడం వంటి వీడియోలను చేసుకుంటూ ఉండేది. మధ్య మధ్యలో అలా టాలీవుడ్‌పై విరుచుకుపడుతూ ఉంటుంది. అలాంటి శ్రీ రెడ్డి తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.

వాటి కోసం ఓ జ్యూస్..
మీ భర్త మిమ్మల్ని సుఖపెట్టడం లేదా? బుస్ మని లేవడం లేదా?వెంటనే పడిపోతోందా? అంటూ శ్రీ రెడ్డి పచ్చి బూతులను వదిలింది. హీరోలైనా సరే ఆ విషయంలో జీరోలు.. వారికి కూడా అదే సమస్య ఉంటుందని శ్రీ రెడ్డి పరోక్షంగా దారుణమైన కామెంట్లుచేసింది.

వెరైటీ జ్యూస్..
అరటి పళ్లు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, పాలు, బూస్ట్ ఇలా అన్నింటిని కలిపి చేసిన ఓ జ్యూస్ తాగితే బెడ్రూంలో రెచ్చిపోతారంటా. అది ఎవ్వరైనా సరే తాగొచ్చు అని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. ఒకసారి అది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలపండని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది


Click it and Unblock the Notifications











