దారుణమైన పరిస్థితిలో శ్రీరెడ్డి... పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నవారిపై ఫైర్!

By Bojja Kumar

కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి ఇటు సినిమా అవకాశాలు లేక, అంటు ఇండస్ట్రీ నుండి సపోర్టు లేక సతమతం అవుతోంది. తాజాగా లైవ్ వీడియో పోస్టు చేసిన ఆమె తన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని వెల్లడించారు. చాలా మంది నేను అందరినీ బెదరించి డబ్బు తీసుకున్నాను, నా వద్ద చాలా డబ్బులు మూలుగుతూ ఉన్నాయని భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. కావాలంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అని ఆమె తెలిపారు.

Recommended Video

Sri Reddy Sensational Comments On MAA Over Chicago Issue
 వారంలో ఇల్లు ఖాళీ చేయాలి

వారంలో ఇల్లు ఖాళీ చేయాలి

ఇపుడు నేను ఉంటున్న ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. మరో వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలి. ఇంకా వేరే ఇల్లు సెట్ కాలేదు. అందుకే ఈ మధ్య యాక్టివ్‌గా లేను. నేను పబ్లిసిటీ కోసం ఇదంతా చేయడం లేదు, కాస్టింగ్ కౌచ్ మీద నేను చేస్తున్న పోరాటంలో భాగంగానే ఇదంతా చేస్తున్నాను అని శ్రీరెడ్డి తెలిపారు.

మీ వల్లే వ్యభిచారం చేస్తున్నారు

మీ వల్లే వ్యభిచారం చేస్తున్నారు

ఇండస్ట్రీలోని తెలుగు హీరోయిన్లు అవకాశాలు లేక, కడుపుకు తినలేని పరిస్థితిల్లో అమెరికా లాంటి దేశాలకు వెళ్లి ప్రాసిస్టూషన్ చేసుకోవాల్సిన పరిస్థితి టాలీవుడ్ పట్టించింది. ఎంతో మంది ఉన్నా వీరికి మాత్రం అవకాశం ఇవ్వకుండా నార్త్ ఇండియన్స్‌ను తీసుకొస్తున్నారు. వారికి తెల్లతోలుతో పాటు సెక్సువల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. అందుకే వారికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని శ్రీరెడ్డి తెలిపారు.

వ్యభిచారం లీగల్ చేయాలన్నది అందుకే

వ్యభిచారం లీగల్ చేయాలన్నది అందుకే

ఎంతో మంది తెలుగు అమ్మాయిలు సినిమా అవకాశాలు లేక యూఎస్ఏ లాంటి ప్రాంతాలకు వెళ్లి వ్యభిచారం చేస్తున్నారు. అందుకే ప్రాసిస్ట్యూషన్ లీగల్ చేయాలని నేను గతంలో అన్నారు. మా అసోసియేషన్లో కూడా పింపింగ్ చేసే వారు చాలా మంది ఉన్నారు. కానీ నేనుదాన్ని లీగల్ చేయాలి అన్నందుకు చాలా రాద్దాంతం చేశారే తప్ప నేను అలా అనడం వెనక ఉద్దేశ్యం ఏమిటనేది ఎవరూ అర్థం చేసుకోలేదు అని శ్రీరెడ్డి తెలిపారు.

మీడియా నన్ను ఎందుకు పక్కన పెట్టింది?

మీడియా నన్ను ఎందుకు పక్కన పెట్టింది?

మీడియా వారు నన్ను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాలేదు. పొరపాటును ఒక తప్పు చేశాను, దానికి క్షమాపణ కూడా చెప్పాను. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి, అర్దనగ్నంగా పోరాటం చేసి, ఈ సమస్యను ఇంత హైప్ తెచ్చింది నేను. ఒక్క రూపాయి తీసుకోకుండా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. కానీ కాజ్ రేజ్ చేసిన, దాని కోసం కృషి చేసిన నాలాంటి వారిని మీడియా గుర్తించడం లేదు అని శ్రీరెడ్డి వాపోయారు.

పవన్ కళ్యాణ్ దేవుడా?

పవన్ కళ్యాణ్ దేవుడా?

నేను కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతుంటే... అవన్నీ చేసిన వారు కొందరు మూతులకు నల్లగుడ్డలు కట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనకూడదని చెప్పి, ఆయన దేవుడు అని చెప్పి ఒక మూస కొట్టుడులో బ్రతుకుతున్నారు. ఇలాంటివి ఇప్పటికైనా మానేసి సమస్య పరిష్కారానికి కృషి చేయండి అని శ్రీరెడ్డి అన్నారు.

తమ్మారెడ్డి మీద ఫైర్

తమ్మారెడ్డి మీద ఫైర్

తమ్మారెడ్డి గారూ... మీకు పవన్ కళ్యాణ్ అంటే పర్సనల్ గా ఇష్టం ఉండొచ్చు, మీకు ఆయన పార్టీలోకి వెళ్లే ఉద్దేశ్యం ఉండొచ్చు. కానీ టాలీవుడ్ అమ్మాయిలు అమెరికా వెళ్లి పరువు తీసుకొచ్చారు అనే కన్నా వారు ఎందుకు వెళ్లారు? ఏం చేస్తే వారు ఇలా చేయకుండా వెళతారు? అనే విషయం ఆలోచిస్తే బావుంటుంది శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

అందుకే వారి పేర్లు ప్రాణాలకు తెగించి చెప్పాను

అందుకే వారి పేర్లు ప్రాణాలకు తెగించి చెప్పాను

అందరి పేర్లు ఎందుకు బయట పెట్టారు అని కొందరు అంటున్నారు. అందుకు కారణం ఉంది. నేను కాస్టింగ్ కౌచ్ గురించి, వ్యభిచారం గురించి మాట్లాడుతుంటే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వారు నేను తప్పు మాట్లాడుతున్నాను అని కలరింగ్ ఇస్తున్నారు. వారి గురించి కూడా ఈ లోకానికి తెలియాలి అనే ప్రాణాలకు తెగించి అందరి పేర్లు బయట పెట్టాను అని శ్రీరెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X