శ్రీరెడ్డి క్షమాపణ: పవన్ కళ్యాణ్ శత్రువు ఇలా చేయించాడట, ఎవరా శత్రువు? ఎవరా సోగ్గాడు?

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన తల్లిని బూతులు తిడుతూ మిడిల్ ఫింగర్ చూపిస్తూ అత్యంత హేయంగా ప్రవర్తించిన శ్రీరెడ్డి.... ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాస్త తగ్గింది. అటు ఇండస్ట్రీ నుండి, ఇటు అభిమానుల నుండి, సినీ ప్రేక్షకులు, సామాన్య జనం నుండి ఇలాంటి ప్రవర్తనపై తీవ్ర ఖండన రావడంతో ఆమె తన ఫేస్ బుక్ పేజీ ద్వారా పవన్ కళ్యాణ్, అతడి తల్లికి క్షమాపణలు చెబుతూ ఓ పోస్టు చేశారు.

Recommended Video

Sri Reddy Issue:Sri Reddy Tweets To Jeevitha rajashekar

మీ శత్రువే నాతో ఇలా చేయించాడు

నేను చేసిన పనికి, మాట్లాడిన మాటలకుగాను పవన్ కళ్యాణ్, ఆయన తల్లిగారికి బహరంగ క్షమాపణలు చెబుతున్నాను. ఈ పని చేయడం కారణంగా అనవసరంగా చాలా మందితో బ్లేమ్ కావాల్సి వచ్చింది. మీ శత్రువే మేము ఇలా చేసేలా చేశాడు. మంచి అడ్వైజర్ ముసుగులో మాతో బలవంతంగా ఇలా చేయించాడు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. నేను ఎవరో ఇచ్చే బిర్యానీ పొట్లాల కోసం పని చేయడం లేదు. మీరు...మీ అభిమానులు నిజాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. నా వైపు నుండి తప్పు ఉంది కాబట్టి ట్రోలింగును నేను ఫేస్ చేస్తాను అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించారు.

మీకు దమ్ముంటే నన్ను చంపేయండి

కాస్టింగ్ కౌచ్, సినిమాల్లో తెలుగు వారికి అవకాశాలు అంశంపై నేను చేస్తున్న పోరాటాన్ని నిర్వీర్యం చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో.... వారికి దమ్ముంటే ముందు నన్ను చంపండి, ఆ తర్వాత ఆ ప్రయత్నాలు చేయండి అని శ్రీరెడ్డి తెలిపారు.

సెక్స్ కోసం బలవంతం చేసిన వారంతా సిద్ధంకండి

మా వాళ్లను ఎవరైతే సెక్స్ కోసం బలవంతం చేశారో? ఎవరైతే ఇబ్బందులకు గురి చేశారో.... వారంతా మీ టోకెన్ తీసుకుని సిద్ధంగా ఉండండి అంటూ శ్రీరెడ్డి బుధవారం వార్నింగ్ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలను బట్టి మరింత మంది వివరాలు ఆమె బయట పెట్టబోతోందని తెలుస్తోంది.

గాయత్రి గుప్తా బండారం బయట పెడతా

‘అభిరామ్ ఫోటోలతో నేను గేమ్ ప్లే చేయడానికి ప్రయత్నించాను అని గాయత్రి గుప్తా చెబుతోంది. అవును నిజమే.... అతడు అతడి గేమ్ ఆడాడు, నేను నా వైపు నుండి గేమ్ ఆడదామని అనుకున్నాను. ఇందులో తప్పేముంది? పిచ్చి గాయత్రీ.... ఇపుడు నా సమయం వచ్చింది. మీడియా ముందు నీ బండారం బయట పెడతాను. నీ టోకెన్ తీసుకుని సిద్దంగా ఉండు అని... శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

జీవిత మేడమ్‌తో న్యాయ పోరాటమే

మన శత్రువులు బలంగా తయారైనపుడు... మనం కూడా మరింత బలంగా ముందుకు సాగాలి. థాంక్యూ జీవిత మేడమ్. మేము సిద్ధం. న్యాయ పోరాటం చేద్దాం అంటూ శ్రీరెడ్డి సవాల్ చేశారు.

సింగిల్ హ్యాండ్ సోగ్గాడా.... శ్రీరెడ్డి కామెంట్స్ ఎవరిపై?

సింగిల్ హ్యాండ్ సోగ్గాడా... అంటూ శ్రీరెడ్డి ఓ పోస్టు చేశారు. అమ్మాయిలను ఏడిపించిన ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి నేను పెట్టిన పోస్టుతో నన్ను సంప్రదించాడు. వెంటనే దాన్ని తీసేయమని, నాకు ఇంజనీరింగ్ చదివే కూతురు ఉంది అని ప్రాదేయపడ్డాడు. ఇక అతడికి నా పవర్ ఏమిటో చూపిస్తాను. నీ రాస లీలలు బయట పెడతాను. ఈ సారి నేను వేసే దెబ్బకు ఇక నువ్వు లెగవు.... అంటూ శ్రీరెడ్డి తాజాగా ఓ పోస్టు పెట్టింది. మరి ఈ పోస్టు ఆమె ఎవరిని ఉద్దేశించి చేసింది అనేది హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X