twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది సెక్స్ కాదు, చెప్పుతో కొడతా: హైపర్ ఆదిపై శ్రీరెడ్డి సంచలనం!

    By Bojja Kumar
    |

    Recommended Video

    అది సెక్స్ కాదు, చెప్పుతో కొడతా: హైపర్ ఆదిపై శ్రీరెడ్డి సంచలనం!

    జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అతి తక్కువ కాలంలోనే సూపర్ పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన షోలలో ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు ఓ రేంజిలో పేలుతుంటాయి. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఎక్కువగా పంచ్‌లు విసురుతుంటాడు. ఈ క్రమంలోనే ఆది ఇటీవల తన షోలో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ సంచలనం శ్రీరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని పంచ్‌లు విసిరారు. దీనిపై శ్రీరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆది మీద ఎదురు దాడికి దిగారు. ఘాటైన పదజాలంతో ఆమె ఆదిపై విరుచుకుపపడ్డారు. ఓ క్రమంలో తన కోపాన్ని ఆపుకోలేక నిన్ను బ్రతికనిచ్చేదాన్ని కాదు అంటూ వ్యాఖ్యానించారు.

    ఆది నీ మీద గౌరవం ఉంది, కానీ....

    ఆది నీ మీద గౌరవం ఉంది, కానీ....

    హైపర్ ఆదికి నేనెప్పుడూ మీకు వ్యతిరేకం కాదు. అతడి మీద ఎటువంటి కోపం లేదు. దానికి తోడు గౌరవం కూడా ఉంది. ఎందుకంటే ఆయన టాలెంటెడ్ రైటర్, యాక్టర్. అంతే కాకుండా ఎంతో మందికి అవకాశాలు ఇప్పిస్తున్నారు. అందుకే మీ మీద మంచి అభిప్రాయం ఉంది. కానీ మీరు మీ షోలలో నా లాంటి మహిళలను ఉద్దేశించి చాలా కించ పరిచే విధంగా పంచ్‌లు వేస్తున్నారు. మరి మీ మీద ఎవరైనా ఒత్తిడి చేసి ఆడైలాగ్స్ రాయించారా? లేక మీరే స్వతహాగా ఇది రాశారా? తెలియదు..... నన్ను చాలా బాధించాయి అని శ్రీరెడ్డి తెలిపారు.

     మిమ్మల్ని ఆడజాతి సహించదు

    మిమ్మల్ని ఆడజాతి సహించదు

    అంతకు ముందు మహేష్ కత్తి ఒక ప్రముఖ హీరో గురించి వ్యతిరేకంగా మాట్లాడినపుడు అతడిని టార్గెట్ చేస్తూ జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో పంచ్‌లు వేశారు. అతడిని కించ పరిచారు. అది నాకు నచ్చలేదు. మిమ్మల్ని నాగ బాబు ఇన్ ఫ్లూయెన్స్ చేస్తున్నారా? నా లాంటి ఉద్యమం చేసే ఆడవారి మీద పిచ్చి డైలాగ్స్ రాయించి దాని మీద పబ్బం గడుపుకుంటున్నారని తెలిస్తే నేను సహించను. నేనే కాదు, ఏ ఆడది కూడా మిమ్మల్ని సహించదు.... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

    జడ్జి స్థానంలో ఉండి ఇంత నీచమా?

    జడ్జి స్థానంలో ఉండి ఇంత నీచమా?

    మీ ఫ్యామిలీలో వ్యక్తులు ఎవరైనా పాలిటిక్స్‌లోకి వచ్చి ఆడవారి ఓట్లు అడగాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అనవసరంగా ఆడపిల్లల జోలికి రాకూడదని ఆ జడ్జిలను కోరుకుంటున్నాను. జడ్జిల ప్లేసులో ఉండి ఎవరైనా న్యాయం చేస్తారు. ఆ స్థానంలో ఉండి ఇలాంటి చిల్లర పంచ్‌లకు, చిల్లర వేషాలకు తావిచ్చే ఇలాంటి జడ్జిల మీద నిజంగా కొంచెం కూడా జాలి గానీ, గౌరవం కానీ లేదు. ఆ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి మీద, మల్లెమాల సంస్థ మీద చాలా గౌరవం ఉంది. ఇలాంటి శృతి మించిన కామెడీ చేసినపుడు కంట్రోల్ చేసే అవసరం వారిపై ఎంతైనా ఉంది.... అని శ్రీరెడ్డి సూచించారు.

    పోరాటంలో భాగంగా స్ట్రిప్ చేశాం

    పోరాటంలో భాగంగా స్ట్రిప్ చేశాం

    విచ్చలవిడి కామెడీకి మేము ఎంత మాత్రం ఒప్పుకోమని ఇప్పటికే చాలా మంది జబర్దస్త్ కార్యక్రమం మీద చాలా కంప్లయింట్స్ చేస్తున్నారు. నేనెప్పుడూ దాని గురించి మాట్లాడలేదు. కానీ అమ్మాయిలు ఎవరైతే సమస్యలపై పోరాడుతున్నారో, అందులో భాగంగా స్ట్రిప్(బట్టలు విప్పడం) చేస్తే మీరు గౌరవం ఇవ్వకుండా, దాని మీద పంచ్ లు వేస్తున్నపుడు చూస్తూ ఊరుకోవడం అంత మంచి పద్దతి కాదు... అని శ్రీరెడ్డి అన్నారు.

    నిన్న మామూలుగా కొట్టను ఆది....

    నిన్న మామూలుగా కొట్టను ఆది....

    పిచ్చి వేషాలు వేసే ఆదికి, దానికి వెర్రి నవ్వులు నవ్వే వారికి కూడా ఒకటే చెప్పాలనుకున్నాను. మీరు పెయిడ్ ఆర్టిస్టులు అనుకుంటున్నారా? అనే పంచులో నన్ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. జబర్దస్త్ లో కులం గురించి మాట్లాడారని, అవమానాలు చేశారని మిమ్మల్ని రోడ్ల మీద తరిమి తరిమి కొట్టారు మీకు జ్ఞాపకం ఉందా? మీరు శృతి మించి కామెడీ చేస్తే ఎవరో వచ్చి కొట్టే వరకు నేనైతే వెయిట్ చేయను. నా చేతికి ఉన్న దురద అందరికీ తెలిసిందే. మామూలుగా కొట్టను ఆది. నా చెప్పుతో కొడితే కూడా తక్కువ అవుతుందేమో? ఆడవాళ్లు రెస్పెక్ట్ ఇవ్వండ్రా మహానుభావా అని అడుక్కుంటున్న సమయంలో మీరు జబర్దస్త్ లాంటి షోలలో ఆడ పిల్లలను కించ పరిచే కామెంట్స్ చేస్తున్నారు.... అని శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    తాట ఒలుస్తా, జాగ్రత్తగా ఉండండి

    తాట ఒలుస్తా, జాగ్రత్తగా ఉండండి

    మర్యాదగా ఉన్నంత వరకు మర్యాదగా ఉండండి. నలుగురు పొట్టనింపడానికి మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని అభినందిస్తాను. అంతే కానీ ఆడ పిల్లలను ఎక్కడైనా కించ పరిచినట్లు కానీ, వారిపై పిచ్చి జోక్స్ వేసినా, అల్లరి చేసే విధంగా మాట్లాడినా ఊరుకోను. చాలా మంది చూసే కార్యక్రమం కాబట్టి వారిని ఎగదేసే విధంగా మీరు తీరు ఉంటే తాట మామూలుగా ఒలవను, చాలా జాగ్రత్తగా ఉండండి.... అంటూ శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

    అది సెక్స్ కాదు, సెక్సీగా చూపించడానికి కాదు

    అది సెక్స్ కాదు, సెక్సీగా చూపించడానికి కాదు

    పోరాట దీక్షను చాలా అవమానించినట్లు మాట్లాడావు. నీకొచ్చిన దురద ఏమిటి? నీతో ఇవి రాయించింది ఎవరు? అంత దాకా వస్తే ఎవరినీ వదిలేది లేదు. షర్ట్ ఇప్పరా... ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది అని ఒక మాట అన్నావు. మేము విప్పింది, చూపించింది ఒక నిరసన,... అదిది సెక్స్ కాదు... సెక్సీగా చూపించడానికి కాదు. దానికి గౌరవం ఇవ్వలేని నువ్వు..... ఏం పుట్టుక పుట్టావో నాకు తెలుసు అంటూ శ్రీరె్డి ఫైర్ అయ్యారు.

    నిన్న బ్రతికనిచ్చేదాన్ని కాదు

    నిన్న బ్రతికనిచ్చేదాన్ని కాదు

    నువ్వు కూడా ఒక అమ్మకు పుట్టావనే విషయం మరిచిపోవద్దు. ఆడది ఒక చెల్లిగా, తల్లిగా, భార్యగా ఇన్ని రకాల బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఒక ఆడదాని గురించి మాట్లాడేపుడు ఇలాగేనా మాట్లాడేది. జబర్దస్త్ లాంటి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని నీ ఇష్టారాజ్యంగా పిచ్చి పిచ్చి చేష్టలతో పిచ్చి పిచ్చి జోక్స్ వేస్తే నా ఒక్క చెప్పే కాదు వంద చెప్పులు పడతాయి జాగ్రత్త. షోను చూస్తున్నాం కదా, ఎంకరేజ్ చేస్తున్నాం కదా అని నీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఎవరూ ఊరుకోరు. నాకున్న కోపానికి నువ్వు నా ఎదురుగా ఉంటే.... ఇంకోలా ఉండేది. నిన్ను ఈ భూమి మీద బ్రతకనిచ్చేదాన్ని కాదు.... అని శ్రీరెడ్డి అన్నారు.

    English summary
    Tollywood Actress Sri Reddy Sensational Comments On Hyper Aadi Jabardasth Skits. "Don't Denigrate women in your Jabardasth comedy Skits" She warns Hyper Aadi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X