twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ భర్త, కొడుకు ఒంటరి కాలేదా? ఎన్టీఆర్‌తో కాపురం ఎలా చేశావ్?... లక్ష్మీ పార్వతిపై శ్రీరెడ్డి సంచలనం!

    |

    నటి శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళనాడులో సెటిలైన సంగతి తెలిసిందే. చెన్నైలోనే ఉంటూ తమిళ సినిమాలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆమె ఓ వెబ్ ఛానల్ ఇంట్వ్యూలో మాట్లాడుతూ తను చేస్తున్న సినిమాల గురించి వెల్లడించారు.

    ప్రస్తుతం 'రెడ్డి డైరీ' అనే సినిమా చేస్తున్నాను. అయితే ఇది నా బయోపిక్ కాదు. ఇందులో సీబీఐ పాత్రలో నటిస్తున్నాను. దేవుడి దయ వల్ల లారెన్స్ గారి సినిమా చేస్తున్నాను. ఆయన అందరికీ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. లారెన్స్ నడిగర్ సంఘంలో ఉంటే చాలా మందికి న్యాయం జరుగుతుందని తెలిపారు. త్వరలో 'లక్ష్మీస్ వీరగ్రంధం' చేయబోతున్నట్లు తెలిపారు.

    లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి

    లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గురించి స్పందిస్తూ... ఎవరిలో అయినా నెగెటివ్, పాజిటివ్ రెండూ ఉంటాయి. ఎవరికి వారు తాము మంచివారం అనే ఫీలింగులో ఉంటారు. వారు చేసే ఏ పని కూడా పాపపు పని అనుకోరు. లక్ష్మి పార్వతిగారు కూడా ఆవిడవైపు నుంచి మంచి అనేలా సినిమా చేయించుకుంటున్నారు. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆవిడలోని నెగెటివ్స్ చూపించాలనుకుంటున్నారు. ఈ రెండు సినిమాలను కూడా తప్పు అని నేను అనను. కేతిరెడ్డిగారు నిజంగా జరిగిన విషయం అది నెగెటివ్ అయినా సరే చూపిస్తూ సినిమా చేస్తే చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను నటిని. అందులో తప్పు ఒప్పులతో నాకు సంబంధం, నటించడం నా వృత్తి అని శ్రీరెడ్డి తెలిపారు.

    ఆర్జీవీ ఫేమస్ అయితే నమ్ముతారా?

    ఆర్జీవీ ఫేమస్ అయితే నమ్ముతారా?

    బాలయ్యగారు తాను చేస్తున్న సినిమా గురించి ఒకటే చెప్పారు. మా నాన్నగారిని మా యాంగిల్ లో ఎలా చూశామో, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది సినిమా రూపంలో చూపించాలను కుంటున్నట్లు తెలిపారు. కొన్ని విషయాలు టచ్ చేయడం లేదని క్లియర్‌గా చెప్పారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో ఆవిడ కోణంలో రైట్ అనిపించింది ఆవిడ చూపించుకుంటున్నారు. అందులో రియల్టీ ఉండొచ్చు ఉండక పోవచ్చు. ఆర్జీవీగారు ఫేమస్ అయినంత మాత్రాన ఆయన ఏది చూపిస్తే అది జనం నమ్ముతారా? ఏం జరిగిందో జనాలకు తెలియదా? అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.

    అది ఫెయిల్ అవ్వాలి, ఇది హిట్టవాలి అనను

    అది ఫెయిల్ అవ్వాలి, ఇది హిట్టవాలి అనను

    ‘యాత్ర' చూసినపుడు ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. మహానాయకుడి కథ అన్నపుడు కొన్ని ఎక్స్‌పెక్టేషన్లు ఉంటాయి. ఆర్జీవి గారి సినిమా ఫెయిలైపోవాలి, ఇది సక్సెస్ అయిపోవాలి అని నేనేమీ చెప్పను. రియాల్టీ ఉంటే సక్సెస్ అవుతుంది. జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే హిట్టవుతుంది. అది లక్ష్మీస్ ఎన్టీఆర్ అయినా మహా నాయకుడైనా అంతే... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

    నువ్వు సరైన భార్య? సరైన తల్లివి ఎలా?

    నువ్వు సరైన భార్య? సరైన తల్లివి ఎలా?

    ఎన్టీఆర్ గారు 1923లో జన్మించారు. వీరగందం సుబ్బారావుగారు 1937లో పుట్టారు. లక్ష్మి పార్వతిగారు ఏమైనా అంటే.. ఆయనకు నాకు పదిహేడేళ్లు తేడా, నేను హ్యాపీగా ఉండలేక పోయాను, కాపురం చేయలేక పోయాను అంటారు. మరి ఎన్టీఆర్ విషయంలో ఎవరూ ఆమెను ఈ విషయం అడగలేదా? వీరగ్రంధం సుబ్బారావుగారి కంటే ఎన్టీఆర్ వయసులో చాలా పెద్దవారు. అంతకన్న ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ ఉన్న వ్యక్తితో మీకు ఎన్ని డిఫరెన్సెస్ రావాలి? ఆయనకు భార్య లేదు.. ఒంటరి వాడైనందునే వండి పెట్టాను, దగ్గరుండి చూసుకున్నాను, ప్రేమించాను అని ఆమె అంటున్నారు. మీ ఆయన్ని నువ్వు వదిలేసినపుడు మీ ఆయన ఒంటరి కాలేదా? 16 ఏళ్ల కొడుకును వదిలేసి వచ్చినపుడు ఆ పిల్లాడు ఒంటరివాడు కాదా? నువ్వు ఏ విధంగా సరైన భార్య? ఏ విధంగా సరైన తల్లివి? ఈ నెగెటివ్ షేడ్స్ కేతిరెడ్డిగారు చూపించబోతున్నారని శ్రీరెడ్డి తెలిపారు.

    ఆ విషయాలు కూడా చూపాలి

    ఆ విషయాలు కూడా చూపాలి

    అంతే కాకుండా ఎన్టీఆర్ మరణించిన సమయంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయన చనిపోయిన వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్లలేదు. బంగారం, డబ్బులు దాంటిచేశారు అంటుంటారు. అందులో రియాల్టీ ఉంటే అది కూడా చూపిస్తే బెటర్‌గా ఉంటుంది. నువ్వు నీలో ఉన్న పాజిటివ్‌గా ఉన్న షేడ్స్ చూపించినపుడు... నెగెటివ్ షేడ్స్ కూడా చూపించాలని శ్రీరెడ్డి డిమాండ్ చేశారు.

    పార్టీలతో సంబంధం లేదు

    పార్టీలతో సంబంధం లేదు

    శ్రీరెడ్డి జీవితం తీసుకున్నా శ్రీరెడ్డి జీవితంలో నెగెటివ్ షేడ్ష్ ఉండాలి. శ్రీరెడ్డి వాటి యాక్టెప్ట్ చేస్తుంది కూడా. నువ్వు మనిషివైతే యాక్సెప్ట్ చేయ్. నా జీవితంలోని నెగెటివ్ షేడ్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను. లక్ష్మీస్ వీరగ్రంథం నేను యాక్సెప్ట్ చేయడానికి లక్ష్మీ పార్వతి గారి మీద ఇష్టం లేక పోవడమో.. వైఎస్ఆర్ సీపీకి వ్యతిరేకమనో కాదు... నాకు వైఎస్ఆర్ సీపీ అంటే అభిమానం ఉంది. అలాగే టీడీపీ అంటే వీరాభిమానం ఉంది. లక్ష్మీస్ వీరగ్రంధం చేస్తున్నానంటే అది నా కెరీర్ కు సంబంధించిన అంశం. నటిగా నేను చేస్తున్నాను అని శ్రీరెడ్డి స్పష్టం చేశారు.

    English summary
    Actress Sri Reddy Shocking Comments On Lakshmi Parvathi. Lakshmi Parvathi was married to a harikatha artist Veeragandham Venkata Subba Rao. Later, she was separated from him and started living together with N. T. Rama Rao who officially married her in 1991.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X