నీ చరిత్ర ఎవ్వరికి తెలియదు.. అంత గొప్పవాడివా? బండ్ల గణేష్‌పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో గందరగోళానికి కారణమైన సంగతి తెలిసిందే. పవన్‌పై కామెంట్స్ చేయడంతో ప్రకాశ్ రాజ్‌పై నాగబాబు, నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో నిర్మాత బండ్ల గణేష్‌ను ఉద్దేశించి ఆమె ఏమన్నారంటే...

నీకెందుకు పాలిటిక్స్

నీకెందుకు పాలిటిక్స్

బండ్ల గణేష్ నీకు ఎందుకయ్యా రాజకీయాలు. సినిమాలేదో చేసుకోవచ్చు కదా. ఓ సారి రాజకీయ సన్యాసం అంటూవు. మరోసారి పాలిటిక్స్ గురించి మాట్లాడుతావు. నోరు తెరిచి ఏదో వాగుతుంటావు. రకరకాల వివాదాలతో వార్తల్లో ఉంటావు అని శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది.

సచిన్ జోషితో గొడవలు తెలియవా?

సచిన్ జోషితో గొడవలు తెలియవా?

నటుడు, నిర్మాత సచిన్ జోషితో గొడవలు, ఆయనతో జరిపిన మంతనాలు? ఏంటీ నీ చరిత్ర. ప్రకాశ్ రాజ్‌ను విమర్శించేంత గొప్పవాడివా? ప్రకాశ్ రాజ్ అంతా గొప్ప యాక్టర్‌వా? నీవే యాక్టర్ అయితే ఇప్పటికే గొప్ప కమెడియన్ అయి ఉండేవాడివి. కనీసం రాజకీయాలపై అవగాహన ఉంటే అలాగైనా ఎదిగే వాడివి కదా అంటూ బండ్ల గణేష్‌ను శ్రీరెడ్డి టార్గెట్ చేసింది.

అందరూ అడ్డమైన బూతులు తిడుతూ..

అందరూ అడ్డమైన బూతులు తిడుతూ..

పవన్ కల్యాణ్‌ను కేవలం ప్రకాశ్ రాజ్ మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, కార్యకర్తలే అడ్డమైన బూతులు తిడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన మాటలే.. రేపు ఉండవు. జనసేన కార్యకర్తలే ఫుల్ అండ్ ఫుల్‌గా తిడుతున్నారు. ఎందుకంటే ఆయన ఈ రోజు ఓ పార్టీకి సపోర్ట్ ఇస్తే మరోరోజు మరో పార్టీకి మద్దతిస్తాడు అంటూ శ్రీరెడ్డి వీడియోలో ఘాటుగా స్పందించింది.

బండ్ల గణేష్ అడ్డమైన కామెంట్లు చేయకు..

బండ్ల గణేష్ అడ్డమైన కామెంట్లు చేయకు..

బండ్ల గణేష్ మీరు అడ్డమైన కామెంట్లు చేయకండి. మీరు కంపు నోరు వేసుకొని మాట్లాడవద్దు. మీ మాటలు వినలేక చస్తున్నాం. నాగబాబు కూడా ప్రకాశ్ రాజ్‌ను విమర్శించ వద్దు. మీ ఇద్దరికి ప్రకాశ్ రాజ్‌ను విమర్శించే స్థాయి లేదు అంటూ శ్రీరెడ్డి తన వీడియోలో కామెంట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X