RGV: ఆర్జీవీ కూడా ఏడుస్తాడా బాసూ... అదేంటి అలా ఏడ్పించేసింది?
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎలా ఉంటాడో అందరికి తెలిసిందే. ఆయన ఏది చేసిన ప్రత్యేకంగా ఉంటుంది. అప్పట్లో తన సినిమాలతో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ప్రస్తుతం వివాదాస్పద సినిమాలు తెరకెక్కిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఆర్జీవీని ఓ ఫోటో ఏడిపించేసింది. అదేంటి ఆర్జీవీ ఏడవటం ఏంటి అనుకుంటున్నారా... నిజమే తనను ఓ ఫోటో ఏడిపించిందంటూ ఆర్జీవీ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టు పెట్టాడు. అసలు ఆర్జీవీని ఎవరు ఏడిపించారు.. ఎందుకు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆర్జీవీ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించాడు. అక్కినేని నాగార్జునతో శివ సినిమా తీసి.. సంచలనం సృష్టించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా అంటే చాలా మందికి ఇష్టం. ఆ తర్వాత క్షణ క్షణం, సర్కార్, మనీ సినిమాలు తీసి.. సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి.. అక్కడ కూడా తన మార్కు చూపించాడు ఆర్జీవీ.

ఇక అలాంటి సినిమాలు తీసిన ఆర్జీవీ... ఇప్పుడు వివాదాస్పద చిత్రాలు తీస్తూ బిజీగా మారారు. ఆ మధ్య బోల్డ్ సినిమాలు తీసిన ఆర్జీవీ.. ఇటీవల పొలిటికల్ జోనర్ చిత్రాలు తెరకెక్కిస్తూ... వార్తల్లో నిలుస్తున్నారు. లక్ష్మిస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడపబిడ్డలు, కొండ, వంగవీటి వంటి పొలిటికల్ సినిమాలు తీసిన వర్మ.. ఇప్పుడు వ్యూహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా పడుతూ వస్తుంది.
ఈ సినిమా వైఎస్ జగన్మోమోహన్ బయోపిక్ గా తెరకెక్కుతుందని... అందులో టీడీపీ నేతలను అవమానించేలా చిత్రీకరించారంటూ టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసుపై కోర్టు వాదనలు జరుపుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే... ఆర్జీవీ సినిమాలు తీస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే.
వర్మ ఏ పోస్టు పెట్టిన సంచలనంగా మారుతుంది. తాజాగా తన అభిమాన హీరోయిన్ దివంగత నటి శ్రీదేవి ఫోటో తనను ఏడిపించిందని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో రాసుకువచ్చారు. ప్రస్తుతం వర్మ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ వర్మ షేర్ చేసిన శ్రీదేవి ఫోటో ఏంటీ స్పెషల్ ఎఁంటంటే... అది శ్రీదేవి ఏఐ ఫోటో. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా దానిని క్రియేట్ చేశారు.
అసలే శ్రీదేవికి రామ్ గోపాల్ వర్మ వీరాభిమాని. ఆమెను ఎంతగా ఆరాధించాడో ఎన్నో సార్లు ఆయనే స్వయంగా చెప్పుకువచ్చాడు. ఇక శ్రీదేవితో కలిసి రెండు సినిమాలు తీసిన ఆయన... వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందనే విషయం తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా శ్రీదేవి ఫోటోను అభిమానులుఎడిట్ చేశారు. ఇక ఆ ఫోటోను చూసిన ఆర్జీవీ... తన సోషళ్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ... శ్రీదేవి నన్ను ఏడిపించింది అంటూ రాసుకొచ్చారు. ఆ ఫోటోలో శ్రీదేవి ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్జీవి పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.


Click it and Unblock the Notifications











