తెలుగు సినిమాల్లో నటించే అవకాశం లేదు: శ్రీదేవి
ఇప్పట్లో తెలుగు సినిమాల్లో నటించే ఆలోచనగానీ, అవకాశం గానీ లేదని నటి శ్రీదేవి స్పష్టం చేసింది. భర్త బోనీకపూర్ తో కలిసి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ తిరుమల వచ్చానని, స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పకొచ్చారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.... ఇప్పట్లో సినిమాల్లో నటించే అవకాశం లేదని స్పష్టం చేశారు. తెలుగు సినిమాల్లో నటించే ఆలోచన, అవకాశం గానీ లేదన్నారు. తెలుగు ప్రజలన్నా, తెలుగు సినిమాలన్నా తనకెంతో ఇష్టమని, తాను ప్రస్తుతం సినిమాల్లో నటించక పోయినా...నన్ను అభిమానించే వారు ఉండటం తన అదృష్టమన్నారు.


Click it and Unblock the Notifications











