»   » పవన్ కళ్యాణ్, బన్నీ, రానా, చంద్రబాబు.... ప్రాణాలు కాపాడింది నేనే: నటి శ్రీనిజ సంచలనం

పవన్ కళ్యాణ్, బన్నీ, రానా, చంద్రబాబు.... ప్రాణాలు కాపాడింది నేనే: నటి శ్రీనిజ సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పట్లో కేఏ పాల్ పలు ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు విని చాలా మంది నవ్వుకున్నారు. తాజాగా కేఏ పాల్ మాదిరిగానే తెలుగు నటి శ్రీనిజ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఈ ఇంటర్వ్యూ చూసిన చాలా మంది ఆమె చెప్పిన విషయాలు విని షాకవుతున్నారు. కొందరు ఆమె మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తనకు దైవ శక్తులు ఉన్నాయని..... తెలుగు స్టార్స్ పవన్ కళ్యాణ్, రానా, బన్నీ ప్రాణాలు కాపాడింది తానే అని, అలిపిరిలో చంద్రబాబు బ్రతికి బట్టకట్టడానికి నేను చేసిన ప్రేయరే కారణమని, వారికి పొంచిన ఉన్న మరణాన్ని తాను ముందు పసిగట్టి కాపాడాను అని ఆమె చెప్పడం గమనార్హం.

ఎవరీ శ్రీనిజ

ఎవరీ శ్రీనిజ

శ్రీనిజ...అనేది ప్రస్తుతం ఆమె పేరు. గతంలో సౌమ్య, జయ పేర్లతో కూడా చలామణి అయింది. తర్వాత శ్రీనిజగా పేరు మార్చుకున్నారు. ఆమెది భీమవరం. చిన్న తనంలో డాన్స్ నేర్చుకునే సమయంలో రాజా రవీంద్ర మా సీనియర్, ఆయన్ను చూసి సినిమాల్లోకి రావాలనుకున్నాను అని ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

పూరి డైరెక్షన్లో చిటపట చినుకులు

పూరి డైరెక్షన్లో చిటపట చినుకులు

పూరి జగన్నాథ్ గారు మేము ఒకే కాంపౌండ్ లో ఉండే వారం. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో కాదంబరి కిరణ్ గారితో కలిసి ‘చిట పట చినుకులు' అనే సీరియల్ చేసాను. అప్పట్లో పూరికి గారికి ఓ లవ్ స్టోరీ కూడా ఉండేది అని శ్రీనిజ చెప్పుకొచ్చారు. తర్వాత అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ద్వారా తాను సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు.

నాకు దైవ శక్తులున్నాయి

నాకు దైవ శక్తులున్నాయి

భగవంతుడు కలియుగంలో కూడా కొందరికి విపరీతంగా పవర్స్ ఇస్తాడు. అందుకు మన మనసు ప్లెయిన్ గా ఉండాలి. అలా శక్తులు పొందిన వారిలో నేను కొరిని అని శ్రీనిజ చెప్పుకొచ్చారు.

వారు చనిపోయే ముందు కనిపించారు

వారు చనిపోయే ముందు కనిపించారు

నందమూరి తారక రామారావు గారు చనిపోవడానికి వారం ముందే ఆయన మరణం నాకు కనిపించింది. వైఎస్ ఆర్ చనిపోయే ముందు కలలో కనిపించారు... అని శ్రీనిజ తెలిపారు.

చంద్రబాబును కాపాడాను

చంద్రబాబును కాపాడాను

చంద్రబాబు నాయుడు అలిపిరి దాడి నాకు ముందే కలలో కనిపించింది. అది ఆపే శక్తి ఎలా అని కూడా ఆ భగవంతుడు చెప్పాడు. నేను ట్రై చేసాను... సక్సెస్ ఫుల్ గా జరిగింది. దాని వల్లే ఆయన బ్రతికి బయటపడ్డారని తెలిపారు.

పవన్ చనిపోతారని కనిపించింది

పవన్ చనిపోతారని కనిపించింది

పవన్ కళ్యాణ్ గారి మూవీ ‘గబ్బర్ సింగ్' రిలీజ్ కు 7 డేస్ ముందు ఆయన చనిపోతారని కనిపించింది. అపుడు నేను ఏ విధంగా ప్రేయర్ చేయాలో భగవంతుడు చెప్పాడు. నేను అలా చేయడం వల్లే ఆయన బ్రతికారని శ్రీనిజ తెలిపారు.

అల్లు అర్జున్, రానా

అల్లు అర్జున్, రానా

అల్లు అర్జున్ గారు 2009లో ఆర్య 2 జరిగేటప్పుడు ఆయనకు ప్రాణం మాత్రం ఉంది చాలా డేంజర్ జరిగిందని చెప్పారు. అది నేను ఎవరినీ అడగలేదు. ఆది ఎలా ఆపాలో చెప్పారు. నేను చేసాను.
నెక్ట్స్ రానా... రామానాయుడు చనిపోయే ముందు వన్ వీక్ ముందు కనిపించారు. దేవుడు ఒక ఆఫర్ ఇచ్చారు. రామానాయుడు గారు చనిపోతే బెస్టా... రానా? అని. కానీ రానా మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉందని చెప్పారు. అన్నీ చూసిన రామానాయుడుగారు ఇపుడు కాలం చేసినా పెద్దగా బాధ అనిపించదు. రానాకి పాపం చిన్న వయసు ఎటు వంటి జీవితం ఇంకా చూడలేదు. నా నుండి ఏదైనా రిక్వెస్ట్ తీసుకుంటే రానా ఉండాలని రిక్వెస్ట్ ఇచ్చాను. దేవుడు నా మాట మన్నించి మరణం రామానాయుడు వైపు డైవర్ట్ చేసారు.. అని శ్రీనిజ తెలిపారు.

దాసరి గురించి

దాసరి గురించి

మొన్న దాసరి గారికి కూడా ఇలా అవుతుందని చెప్పారు. ఆయన ఎంతో మందికి సహాయం చేసారు. ఆయన లాంటి పెద్ద వారు మనకు అవసరం. జయలలితగారు ఎంత బాధ పడ్డారంటే నరకయాతన అనుభవించారు. ఆమెను బెడ్ మీద ఉంచి ప్రాణాన్ని ఏ విధంగా తీయాలో ఆ విధంగా తీసి తీసి చంపేసారు. ఆమె చనిపోయిన వెంటనే నా దగ్గరికి రావడం నాతో మాట్లాడటం.... జరిగింది. ఆమె చెప్పిన మాటలు విని నేను వన్ వీక్ ఏడ్చాను. ఏదో భగవంతుడు నాకు ఇలా శక్తులు ఇవ్వబట్టే నాకు ఇలా అందరూ కలలో కనిపిస్తారు అని శ్రీనిజ తెలిపారు.

ప్రభాస్‌ను కాశీకి తీసుకురమ్మన్నారు

ప్రభాస్‌ను కాశీకి తీసుకురమ్మన్నారు

ప్రభాస్ ను తీసుకుని కార్తీక పౌర్ణమి రోజున వారణాసికి రమ్మని ఈశ్వరుడు చెప్పడం జరిగింది. ప్రభాస్ ను కార్తీక పౌర్ణమి రోజున నన్ను ఎందుకు తీసుకుని రమ్మన్నారో అర్థం కాలేదు. అప్పుడే బాహుబలి మొదలైంది. 2011లో కార్తీక మాసానికి ఒక వన్ వీక్ తర్వాత మూవీ వచ్చింది. చూస్తే అందులో ఈశ్వరుడి లింగం ప్రభాస్ భుజం మీద పెట్టుకోవడం జరిగింది. ఆయన జీసెస్ కన్వర్టెడ్ అని తెలిసింది. అయినా కూడా ఎందుకు ఆయన్ను తీసుకుని రమ్మన్నారో నాకు తెలియదు... అని శ్రీనిజ వింత కామెంట్స్ చేసారు.

ఎందుకు బ్రతకాలి దేవుడిని అని అడిగాను

ఎందుకు బ్రతకాలి దేవుడిని అని అడిగాను

2011లో పాపను తీసుకుని కాశీ వెళ్లాను. 2 రోజులు ఉన్నాను. దేవుడు నన్ను ఎందుకొచ్చావు అని అడిగాడు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి తల్లి లేదు, భర్త లేడు ఎందుకు బ్రతకాలి అన్నాడు. నువ్వు చనిపోవడం అవసరం లేదు. నీకు బ్రతకడానికి సరిపోయే అన్ని రెడీ చేసి పెడతాను, హైదరాబాద్ వెళ్లు చెప్పాడు.... అని శ్రీనిజ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Srinija Photo Credits : telugu popular TV

English summary
Tollywood actress Srinija Says I Saved Allu Arjun and Pawan Kalyan Life. Cheout full details here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu