For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో వివాదానికి తెరతీసిన సుచిత్ర: నమాజ్ అజాన్ పై వ్యాఖ్యలు, గో రక్షకులనూ ఖండించాను అంటూ...

  |

  మసీదులో పొద్దునే వినిపించే నమాజ్ తాలూకు అజాన్ పై కొంత కాలం కిందట సోనూ నిగమ్ చేసిన ట్వీట్ ఎంతటి దుమారం లేపిందో మన అందరికి తెలిసిందే. ఆ వివాదం దాదాపు దేశాం మొత్తం ఒక చర్చకు దారి తీసింది. సోనూ ని అటు, ఇటూ రెండు మతాల ప్రజలూ నిరసించారు. మతాలు సాంప్రదాయాలూ మనలో కూడా ఉన్నాయి సోనూ..! వాళ్ళు అభ్యంతరం చెప్పట్లేదు కదా..మరి అయిదు నిమిషాల కోసం భాద ఎందుకు? అంటూ ఒక అభిమాని అడిగేశాడు కూడా. ఆ వివాదం కొన్నాళ్ళకి సద్దు మణిగిందనుకోండి... అయితే ఇప్పుడు మళ్ళీ ముంబై లోని అదే ప్రాంతం నుంచి మరో వివాదాస్పద వ్యాఖ్య వచ్చింది...

  సుచిత్రా కృష్ణన్

  సుచిత్రా కృష్ణన్

  ఈసారి ఇలా మాట్లాడించి మాజీ బాలీవుడ్ నటి, గాయనీ సుచిత్రా కృష్ణమూర్తి సుచిత్ర తన ట్వీట్ ద్వారా ఏమి అన్నది అంటే "నేను ఇంటికి పొద్దున్న అంటే 4.45 నిమాషాలుకు వచ్చాను. అంత పొద్దున్నే నాకు నా చెవులో ఉండే కర్ణబేరి పగిలిపోయే లా రెండు శబ్ధలు వచ్చాయి పక్కనే ఉన్న మసీదు నుండి. ఇలా అనవసరంగా ఎక్కువ సౌండ్ పెట్టి ఎందుకు రాద్దాంతం చేస్తారో అర్ధం కాదు" అని ట్వీట్ చేసింది.

  Suchitra Azaan Controversy: Abu Azmi gives CONTROVERSIAL statement on the tweet | FilmiBeat
  తీవ్ర విమర్శలు

  తీవ్ర విమర్శలు

  సోనూ నిగమ్ ట్వీట్కు వచ్చిన స్పందన మాదిరిగానే సుచిత్రా కృష్ణమూర్తికి కూడా విమర్శల తాకిడి గట్టిగానే పడుతుంది. అయితే కొంతమంది ఆమెను సపోర్ట్ కూడా చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈమె పై సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ తీవ్ర విమర్శలు చేశాడు.

  తాగుతూ పార్టీలు చేసుకొంటు

  తాగుతూ పార్టీలు చేసుకొంటు

  "అర్ధ రాత్రులు వరకు తాగుతూ పార్టీలు చేసుకొంటు పెద్ద పెద్ద శబ్ధలు మధ్య గంతు వేస్తూ తెలియని మగాళ్లు తో తిరుగుతూ ఉండే లేడి.. సంస్కృతి పైన దేశ ఆచారాలు పైన మాట్లాడటం వింతగా ఉంది" అని ఘాటుగా స్పందించాడు ఆమె ట్వీట్ కి. దానికి సుచిత్ర కూడా పద్దతిగానే సమాధానపరిచింది.

  మతం పైన కామెంట్ చేయలేదు

  మతం పైన కామెంట్ చేయలేదు

  చూడండి "బాబు నేను ఎక్కడా అజాన్ ఆచారం పైన, మతం పైన కామెంట్ చేయలేదు. అక్కడ ఉన్న అనవసర శబ్దాన్ని గురించి మాత్రమే మాట్లాడను. మీరు కూడా కొంచం పద్దతిగా కామెంట్ చేస్తే మీ హోదా కి మీరు విలువ ఇచ్చిన వారు అవుతారు'' అని చెప్పింది.

  గోరక్షక దాడుల గురించి

  గోరక్షక దాడుల గురించి

  అంతే కాదు కొందరు గోరక్షక దాడుల గురించి ప్రస్తావించినప్పుడు... అజాన్‌తో పాటు గోరక్షకుల పేరిట జరుగుతున్న దాడుల పైన కూడా ఆమె స్పందించారు. అజాన్ గురించి ఎలాగైతే స్పందించానో.. అలాగే గోరక్షకుల పేరిట జరుగుతున్న దాడులపైనా స్పందించానని, ఆ ట్వీట్లను గమనించలేదా? అని రిప్లై ఇచ్చారు.

  ఇస్లామిక్ దేశాలులో కూడా ఇంతలా చేయరు

  ఇస్లామిక్ దేశాలులో కూడా ఇంతలా చేయరు

  సుచిత్ర కృష్ణమూర్తి ఆ తరువాత కూడా ఇండియా లోనే అజాన్ ఇంత గట్టిగా సౌండ్ పెట్టి చేస్తారు మిగతా ఇస్లామిక్ దేశాలులో కూడా ఇంతలా చేయరు అని పేర్కొంది. ఇప్పుడు ఈమె ట్వీట్ సోషల్ మీడియా లో మరో మత చర్చకు దారి తీసేలా ఉంది. కొన్ని వారాలు కిందట సోనూ నిగమ్ ట్వీట్ చేసిన ప్రాంతం దగ్గరలోనే సుచిత్ర కూడా ట్వీట్ చేయడం కొసమెరుపు ఇక్కడ.

  English summary
  A day after singer-actress Suchitra Krishnamoorthi labelled azaan on loudspeakers as ‘not civilised’, the Samajwadi Party mocked the former saying her sleep is more important than the call to prayers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X