నాగార్జున గేటు దాటనివ్వలేదు.. ఉదయ్ కిరణ్ సూసైడ్ ముందు ఒక్కసారి ఆ మాట అనుకుని ఉంటే!

Recommended Video

Actress Sudha Gets Emotional Talking About Uday Kiran

టాలీవుడ్ లో హీరోయిన్ కో, హీరోకు ఎవరైనా తల్లిపాత్రలో నటించాలి అంటే దర్శకనిర్మాతల మదిలో మొదట మెదిలే పేరు సుధ. దశాబ్దాల కాలం నుంచి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా చెరగని ముద్ర వేస్తున్నారు. ఇప్పటికి పలు చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుధ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఉదయ్ కిరణ్ తో ఆమెకు ఉన్నా సాన్నిహిత్యం గురించి సుధ వివరించారు. పలు చిత్రాల్లో సుధ ఉదయ్ కిరణ్ కు తల్లిగా నటించిన సంగతితెలిసిందే.

తమిళ మహిళని

తమిళ మహిళని

తాను స్వతహాగా తమిళ మహిళని అని, తమిళనాడులోని శ్రీరంగంలో పుట్టి పెరిగానని సుధ అన్నారు. తనని సినిమాల్లోకి బాలచందర్ గారు పరిచయం చేసినప్పటికీ గుర్తింపు వచ్చింది మాత్రం తెలుగు చిత్రాల ద్వారానే అని అన్నారు. ఎక్కువగా తెలుగు చిత్రాలు చేయడం వలన తెలుగింటి ఆడపడుచు అయిపోయానని సుధ తెలిపారు.

తెలుగులో నచ్చిన చిత్రాలు

తెలుగులో నచ్చిన చిత్రాలు

తనకు తెలుగులో బాగా నచ్చిన చిత్రాలు గ్యాంగ్ లీడర్, ఆమె. అతడు చిత్రాలు నచ్చుతాయని అన్నారు. ఆ చిత్రాల్లో సుధ కీలక పాత్రల్లో నటించారు.

 ఉదయ్ కిరణ్‌ని దత్తత తీసుకోవాలని

ఉదయ్ కిరణ్‌ని దత్తత తీసుకోవాలని

తాను ఎక్కువగా ఉదయ్ కిరణ్ కు తల్లిగా నటించానని సుధ అన్నారు. 9 చిత్రాలలో తామిద్దరం తల్లి కొడుకులుగా నటించామని సుధ తెలిపారు. అందువలనే ఉదయ్ కిరణ్ తన కుటుంబంతో కంటే తనతో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉండేవాడని తెలుపారు. ఆ సాన్నిహిత్యం వలనే ఉదయ్ కిరణ్ ని దత్తత తీసుకోవాలనే ఆలోచన కూడా వచ్చినట్లు ఆమె తెలిపారు.

 నాగార్జున గేటు దాటనివ్వలేదు

నాగార్జున గేటు దాటనివ్వలేదు

ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్న సమయంలో తాను ఒక లైలా కోసం చిత్ర షూటింగ్ లో అన్న పూర్ణ స్టూడియోలో ఉన్నానని అన్నారు. సూసైడ్ వార్త తనకు తెలిస్తే షూటింగ్ నుంచి వెళ్లిపోతానని నాగార్జున తన మేనేజర్ కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని అన్నారు. సుధ ఎమోషనల్ అయి వెళ్ళిపోతానంటుంది. గేటు దాటి వెళ్లనివ్వకండి అని చెప్పారట. మధ్యాహ్నానికి కానీ నాకు వార్త తెలియలేదు అని సుధ అన్నారు.

 ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకునే ముందు

ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకునే ముందు

ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించి ఉండాల్సింది. నేను ఎందుకు చావాలి అనుకుని ఉంటె ఈ రోజు ఆ అబ్బాయి బ్రతికి ఉండేవాడని సుధ అన్నారు.

పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను

పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను

తన కుటుంబం గురించి మాట్లాడితే వాళ్ళకి పైవసి ఉండదని అన్నారు. అందువలనే కుటుంబం గురించి ఎక్కడా మాట్లాడానని సుధ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X