‘వెలుగులోకి రాని చీకటి దారుణాలెన్నో’ .. నటి సుమలత షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం మాలీవుడ్ లో హేమ కమిటీ ప్రకంపనలు స్రుష్టిస్తోంది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వెలువడిన నాటి నుంచి ఇండస్ట్రీలో రోజుకో సంచలన విషయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ షాకింగ్ రిపోర్టు వెలువడిన తరువాత చాలా మంది కథానాయికలు తమకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకోవడంతో పాటు పలువురు దర్శకులు,నటీనటుల మూలాలు షేక్ అవుతున్నాయి. ఇప్పటికే పలువురిపై లైంగిక ఆరోపణల కేసులు నమోదయ్యాయి. తాజాగా నటి, మాజీ ఎంపీ సుమలత ఇండస్ట్రీలో జరుగుతోన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఇలాంటి అనుభవాలను తనతో చాలా మంది పంచుకున్నారని సుమలత షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా నటి, మాజీ ఎంపీ సుమలత మీడియాతో మాట్లాడుతూ.. తాను నటించే రోజుల్లో మలయాళ చిత్ర పరిశ్రమలో తనకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని, అలాంటి అనుభవాలు చాలా మంది మహిళలకు ఎదురైనట్లు విన్నానని, వారిలో కొందరు తమ విశేషాలను తనతో పంచుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది. అన్ని పరిశ్రమలలో పవర్ గ్రూపులు ఉన్నాయనీ, సినిమా రంగంలో మహిళలకు భద్రత కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాలన్నారు.

Actress Sumalatha speaks out on harassment in Malayalam film industry
"నా కెరీర్‌లో నేను పనిచేసిన చాలా సెట్‌లు కుటుంబంలా ఉన్నాయి. కానీ నేను మాలీవుడ్ లోని చాలా భయానక కథలు విన్నాను. చాలా మంది మహిళలు తమను లైంగికంగా వేధించారని నాకు ప్రైవేట్‌గా చెప్పారు. అవకాశాల కోసం తమకు కో ఆపరేట్ చేయాలని వారిని ఆడిగారు. వాళ్ల మాటలు వినని వారిని వేధించేవాళ్లు. నేను అలాంటి సంఘటనలను ఎప్పుడూ ఎదుర్కోలేదు, కానీ అవి సినిమా సెట్‌లలో జరుగుతాయని నేను కాదనలేను. చాలా మంది తమ బాధాకరమైన అనుభవాల గురించి నాకు చెప్పారు. నటీమణులు బస చేసే హోటల్‌ గదుల్లో మగవాళ్లు తలుపులు తట్టడం గురించి కథలు విన్నాను. ఇలాంటి ప్రవర్తనపై మనం తీవ్రంగా స్పందించాలి' అని సుమలత అన్నారు. పరిశ్రమలో మహిళలపై అఘాయిత్యాలను పరిష్కరించడానికి సరైన చట్టాలను రూపొందించడం,ఆ చట్టాలను ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు వేయడం చాలా ముఖ్యమని అన్నారు.

మలయాళ చిత్రసీమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటి రిపోర్టు సంచలన విషయాలను వెల్లడిస్తుంది. వాస్తవానికి ఫిబ్రవరి 2017లో జరిగిన ఓ నటి దారుణ హత్య, అత్యాచారం కేసులో దర్యాప్తులో భాగంగా ఈ కమిటీ ఏర్పడింది. ఇలా ఏర్పాటైన హేమ కమిటీ ఆగస్టు 18న మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై తన నివేదికను ప్రచురించింది. అయితే ఈ కమిటీ తన నివేదికను ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి సమర్పించారు. లైంగిక దోపిడీ, చట్టవిరుద్ధమైన ఆంక్షలు, వివక్ష, మాదకద్రవ్యాలు, వేతనాల్లో అసమానత మొదలైన సమస్యలు సినీ పరిశ్రమలో బహిర్గతమయ్యాయి. మలయాళ సినిమా కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటీనటుల కబంధ హస్తాల్లో చిక్కుకుందని నివేదిక పేర్కొంది.

Actress Sumalatha speaks out on harassment in Malayalam film industry

హేమ కమిటీ రిపోర్ట్ విడుదలైన నాటి నుంచి చాలా మంది మహిళా ఆర్టిస్టులు తమ లైంగిక వేధింపులు,చేదు అనుభావాలను పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలో దర్శకుడు రంజిత్,నటులు సిద్ధిక్, ముఖేష్‌తో సహా మలయాళ సినీ ప్రముఖులపై చాలా మంది ఆరోపణలు చేశారు. ఆగస్టు 22న కేరళ హైకోర్టు కమిటీ పూర్తి నివేదిక కాపీని కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో మలయాళం స్టార్ యాక్టర్ మోహన్ లాల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) కు అధ్యక్షుడుగా ఉండగా ఆ పదవికి రాజీనామా చేసారు. మోహన్ లాల్ మాత్రమే కాక అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ లోని మెంబర్స్ అందరూ కూడా రాజీనామా చేయడంతో మలయాళ సినీ పరిశ్రమలో ఈ విషయం సంచలనంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X