Supritha: కాంగ్రెస్ గెలవగానే ప్లేట్ ఫిరాయించిన తల్లీకూతుళ్లు... కారును వదిలేసి రేవంత్ రెడ్డితో ఇలా!
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక కొత్త ప్రభుత్వం కొలువు కానుంది. ఇక అప్పటి వరకు బీఆర్ఎస్ జపం చేసిన వాళ్లంతా ఒక్కసారిగా ప్లేట్ ఫిరాస్తున్నారు. అందులో సురేఖా వాణి సుప్రితా నాయుడు కూడా ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో డైరెక్టుగా కారు గుర్తుకు ఓటు వేయండి అని సపోర్ట్ చేసిన వీళ్లు... ఒక్కసారిగా మాస్ జంపింగ్ చేసేశారు. సడెన్ గా రేవంత్ రెడ్డితో ఆ ఫోటో పెట్టి షాక్ ఇచ్చారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నటి సురేఖ వాణి గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి మంచి పేరును తెచ్చుకుంది. ఈమె నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇక తన కుమార్తె సుప్రీతా నాయుడు గురించి కూడా ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ కాకపోయిన ఈ భామ సోషల్ మీడియాలో అందాల రచ్చ అంతా ఇంతా కాదు.. తల్లితో కలసి సుప్రిత సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది.

తల్లీకూతుళ్లు ఇద్దరూ తమ అందాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. అంతే కాదు వాళ్లు డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ.. అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు పొట్టి బట్టల్లో బోల్డ్ గా కనిపిస్తూ తల్లి కూతుళ్లు ఎక్స్ పోజింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేఖ వాణి కూడా కూతురికి ఏమాత్రం తగ్గకుండా నాలుగు పదుల వయసులోనూ హాట్ షో చేస్తూ ఉంటుంది.
మోకాళ్ళపైకి ఉన్న బట్టల్లో దర్శనం ఇచ్చి.. కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు.. తన తల్లికి ఎప్పటికైనా సెకండ్ మ్యారేజ్ చేస్తానని సుప్రీత ఇప్పటికే చెప్పుకువచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ కు గురవుతూ ఉంటారు. తాజాగా సురేఖ వాణి, సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి కారణం ఆమె కొన్ని రోజుల క్రితం షేర్ చేసిన వీడియో డిలీట్ చేయడం చర్చనీయం అయింది.

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కోసం సోషల్ మీడియాలో క్యాంపైన్ చేసిన తారాల్లో సుప్రిత ఒకరు. సురేఖ వాణి కూతురు సుప్రీత తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా బీఆర్ఎస్ కి మద్దతు తెలిపింది. ముఖ్యంగా సుప్రీతా కారు ముందు నిలబడి బీఆర్ఎస్ ని గెలిపించండి అని వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. అయితే రాజకీయ నాయకుల కంటే తొందరగా వీరు ఫ్లేట్ ఫిరాయించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. ఇక కాంగ్రెస్ గెలవడంతో.. సుప్రిత వెంటనే ఆ కారు వీడియోను డిలీట్ చేసింది. వెంటనే తన తల్లి సురేఖ వాణితో కలసి రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ స్టోరీగా పెట్టేసుకుంది. ఇది చూసిన నెటిజన్స్.. వారిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. తల్లీ కూతుళ్లు మాస్ జంపింగ్ చేశారని కామెంట్స్ పెడుతున్నారు. బీఆర్ఎస్ వీడియో డిలీట్ చేసి రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోని షేర్ చేయడంపై మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











