దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సురేఖావాణి కూతురు.. తండ్రి మరణం తర్వాత..

Recommended Video

Surekha Vani's Daughter Supritha Strong Reply To Netizens Trolls || Filmibeat Telugu

నేటితరం యువతలో ట్రోల్స్ చేయడం అనే హాబీ ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియా వేగంగా విస్తరించడంతో అంతకంటే వేగంగా విచ్చలవిడిగా ట్రోల్స్ చేయడం పనిగా పెట్టుకున్నారు కొందరు నెటిజన్లు. ఓ వ్యక్తిని ఏ కారణంగా ట్రోల్ చేస్తున్నాం? ఆ వ్యక్తిపై ఈ రకమైన కామెంట్లు చేయడం సబబేనా? అని కూడా ఆలోచించకుండా తమ తమ భావాలను ఇతరులపై రుద్దేస్తున్నారు నెటిజన్లు.

సెలబ్రిటీ మహిళలే ఎక్కువగా

సెలబ్రిటీ మహిళలే ఎక్కువగా

ముఖ్యంగా నెటిజన్ల ట్రోల్స్ భారిన పడేవారు సెలబ్రిటీ మహిళలే అనడంలో ఏ మాత్రం సందేహించాల్సిన పని లేదు. అయితే కొందరు మహిళామణులు ఇలా ట్రోల్స్ చేస్తున్న వారిని ఘాటుగా మందలిస్తుండగా, మరి కొంతమంది మహిళలు మాత్రం సైలెంట్ కావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

సురేఖావాణి కూతురు సుప్రిత షేర్ చేసిన వీడియో

సురేఖావాణి కూతురు సుప్రిత షేర్ చేసిన వీడియో

ఈ కోవలోనే తాజాగా టాలీవుడ్ యాక్ట్రెస్ సురేఖావాణి కూతురు సుప్రిత షేర్ చేసిన ఓ వీడియోపై రెచ్చిపోయి కామెంట్లు పెడుతూ ఆమెను, ఆమె తల్లి సురేఖావాణిని తెగ ట్రోల్స్ చేశారు నెటిజన్లు. ఇది చూసిన సుప్రిత అలాంటి వారిపై విరుచుకుపడుతూ దిమ్మతిరిగే కౌంటర్ వేసింది.

 సురేఖ వాణి, సుప్రిత మనసును గాయం

సురేఖ వాణి, సుప్రిత మనసును గాయం

సురేఖావాణి- సురేష్ తేజ దంపతులకు ఒక్కతే కుమార్తె. ఆమె పేరే సుప్రిత. వయసు చిన్నదే అయినా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అప్‌డేట్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తమకు సంబందించిన అప్‌డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. కాగా ఇటీవలే సుప్రీత తండ్రి, సురేఖ వాణి భర్త సురేష్ తేజ అకాల మరణం వారిరువురికి కలచి వేసింది. అదే బాధలో తండ్రికి తలకొరివి పెట్టిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆవేదనను అందరితో పంచుకుంది సుప్రిత. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తమకు తోచిన కామెంట్లతో విరుచుకుపడటం సురేఖ వాణి, సుప్రిత మనసును ఇంకా గాయపరిచింది.

 సుప్రిత ఘాటు రియాక్షన్

సుప్రిత ఘాటు రియాక్షన్

దీంతో వెంటనే అదే సోషల్ మీడియా వేదికగా సుప్రిత ఘాటుగా రియాక్ట్ అయింది. ''మమ్మల్ని నెగెటివ్ కామెంట్స్ చేసేవారు అన్నీ తెలుసుకొని రియాక్ట్ అయితే మేలు. ఎదుటివారిపై ఒక వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయనేది తెలుసుకోండి. ముందు మీ లైఫ్ జాగ్రత్త.. తర్వాత ఇతరుల విషయాల్లో వేలు పెట్టండి. కేవలం మీ వైపు నుంచే చూడకుండా మా వైపు నుంచి కూడా చుడండి. మా కోణంలో ఆలోచించండి. అప్పుడు మీరు సెట్ అవుతారు'' అని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X