రాంగోపాల్ వర్మతో సుప్రిత నైట్ పార్టీ.. అందులో అతడు మాస్టర్ అంటూ!

ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం కారణంగా సామాన్యులే సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. అలాంటిది సినీ ప్రముఖుల పిల్లలు ఇంకెలాంటి రేంజ్‌కు వెళ్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇలా చాలా మంది సెన్సేషన్ అయ్యారు. అందులో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు. చాలా కాలం నుంచే సోషల్ మీడియాలో తనదైన మార్కును చూపిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో దిగిన పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

చిన్న వయసులోనే క్రేజ్:ఫేమస్ ఫిల్మ్ మేకర్ సురేష్ తేజ - సురేఖ వాణి కూతురిగా సుప్రిత చిన్న వయసులోనే సుపరిచితురాలు అయింది. టీనేజ్‌లో ఉన్నప్పుడే ఈ అమ్మడు తనదైన రీతిలో టాలెంట్లను చూపించి సత్తా చాటింది. ముఖ్యంగా యూట్యూబర్‌గా సుప్రిత యమ క్రేజ్‌ను అందుకుంది. అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. ఫలితంగా ఆమె పేరు మారుమ్రోగిపోతోంది.

Actress Surekha Vani Daughter Supritha Shares Ram Gopal Varma Pics in Instagram

యూట్యూబర్‌గా ఫేమస్:సుప్రిత 2019లోనే 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇందులో తనదైన నటన, అందంతో అలరించింది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లలో మెరిసింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో ఇలాగే కంటిన్యూ చేస్తోంది. తద్వారా యూట్యూబర్‌గా ఫేమస్ అయింది.

అమర్ మూవీతో ఎంట్రీ:అందం, అభినయంలో మెప్పిస్తోన్న సుప్రితను సినీ రంగానికి పరిచయం చేయాలని సురేఖ వాణి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఆమె ఓ స్టార్ కిడ్ చేస్తోన్న చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవబోతుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సుప్రిత.. అమర్‌దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.

Actress Surekha Vani Daughter Supritha Shares Ram Gopal Varma Pics in Instagram

అందులో యమ బిజీగా:టీనేజ్‌లో ఉన్నప్పుడే సుప్రితకు క్రేజ్ ఏర్పడడానికి సోషల్ మీడియాలో ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను కూడా వదులుతూ తన రేంజ్ పెంచుకుంటోంది.

తల్లితో చిల్.. ట్రీట్‌తో:సోషల్ మీడియాలో యమ హడావిడి చేస్తోన్న సుప్రిత.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన భారీ పరువాలను ప్రదర్శిస్తూ ఘాటు ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. అలాగే, తన తల్లితో చిల్ అవుతూ తీసుకున్న ఫొటోలు, వీడియోలనూ షేర్ చేస్తోంది. దీంతో సుప్రిత తరచూ వార్తల్లోనే నిలుస్తూ హైలైట్ అవుతోంది.

Actress Surekha Vani Daughter Supritha Shares Ram Gopal Varma Pics in Instagram

రాంగోపాల్ వర్మతోనూ:సుప్రిత తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఇది ఓ పార్టీ జరుగుతున్న సమయంలో తీసుకున్నదిగా కనిపిస్తోంది. ఇక, ఇందులో సుప్రిత అతడిపై అభిమానాన్ని, ప్రేమను చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే, ఈ పోస్టుకు ఈ చిన్నది.. రాంగోపాల్ వర్మను 'సినిమాలో మాస్టర్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X