యాక్టర్ సురేఖావాణికి పెను విషాదం.. భర్త ఆకస్మిక మృతి.. ఏం జరిగిందంటే!

Recommended Video

Actress Surekha Vani Husband Suresh Tej Passed Away || Filmibeat Telugu

ప్రముఖ తెలుగు నటి సురేఖావాణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త సురేష్ తేజ్ సోమవారం అనారోగ్యంతో మరణించారు. టీవీ షోల దర్శకుడైన సురేష్ కొంతకాలంగా అనాగ్యంతో బాధ పడుతున్నారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం కన్నుమూశారు.

సురేష్ తేజ్‌కు తెలుగు టీవీ, సినిమా రంగంలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన మరణవార్త తెలుసుకుని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొందరు తోటి నటులు సురేఖవాణి ఇంటికి చేరుకుని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

 కార్డియాక్ అరెస్ట్ కారణంగా

కార్డియాక్ అరెస్ట్ కారణంగా

సురేష్ తేజ్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నట్లు సమాచారం. కొంతకాలంగా ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం చివరి వరకు బయటకు తెలియకుండా గోప్యంగా ఉండటం గమనార్హం.

సురేఖ, సురేష్ ప్రేమ వివాహం

సురేఖ, సురేష్ ప్రేమ వివాహం

సురేఖావాణి, సురేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ గతంలో టీవీ రంగంలో తమ కెరీర్ మొదలు పెట్టిన వారే. సురేఖ టీవీ యాంకర్ అయ్యాక ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వీరి మధ్య స్నేహం పెరిగిందని, ఆపై ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.

సూపర్ హిట్ షోలకు దర్శకత్వం

సూపర్ హిట్ షోలకు దర్శకత్వం

సురేఖ వాణి గతంలో మాటీవీలో ప్రసారమైన ‘మాటాకీస్', ‘హార్ట్ బీట్', ‘మొగుడ్స్ పెళ్లామ్స్' లాంటి షోలు చేశారు. ఈ షోలు దర్శకత్వం వహించింది సురేష్ తేజ్ కావడం గమనార్హం. వీటితో పాటు పలు టీవీ షోలను తెరవెనుక ఉండి నడిపించారు.

 సినిమా రంగంలో ప్రయత్నించి

సినిమా రంగంలో ప్రయత్నించి

సురేష్ తేజ్ సినిమా రంగంలో తన అదృష్టం పరిచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అవేవీ విజయవంతం కాలేదు. ఆయనకు భార్య సురేఖ వాణితో పాటు ఒక కూతురు ఉన్నారు. సురేష్ మరణంతో కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X