Surekha Vani: ఆ డైరెక్టర్‌తో సురేఖ వాణి నైట్ పార్టీ.. మందు గ్లాసు, టైట్ హగ్‌తో అరాచకంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మంచి గుర్తింపును సొంతం చేసుకుని హైలైట్ అవుతోన్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో సీనియర్ నటి సురేఖ వాణి ఒకరు.
చాలా కాలంగా టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ భామ.. తన వ్యక్తిగత వ్యవహారశైలితో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సురేఖ వాణి.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దాన్ని మీరే చూడండి!

అలా వచ్చిన సురేఖ: నటిగా మారడానికి ముందే సురేఖ వాణి యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ సమయంలోనే ఆమె ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను పెళ్లాడింది. ఆ తర్వాత భర్త సహాయంతో పలు కార్యక్రమాల్లో భాగం అయింది. ఈ క్రమంలోనే 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలకు హోస్ట్ చేసి అప్పట్లోనే విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను తెచ్చుకుంది.
నటిగా ఎంట్రీ ఇచ్చి: యాంకరింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే సురేఖ వాణికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె 2005లో వచ్చిన 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' అనే సినిమాతో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టేసింది. అప్పటి నుంచి వరుసగా ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే రోల్స్‌లో నటించింది. తద్వారా సురేఖ నటిగానూ సత్తా చాటి టాలీవుడ్‌లో ఒక మార్కును సెట్ చేసింది.

భర్త మృతితో గ్యాప్: వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న సమయంలోనే నటి సురేఖ వాణి భర్త సురేష్ తేజ అకస్మాత్తుగా కన్నుమూశారు. దీంతో ఆమెకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ దుర్ఘటన తర్వాత ఈ సీనియర్ నటి చాలా రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లి.. సినిమాలకు దూరమైంది. ఆ సమయంలో కూతురు సుప్రీత ధైర్యంగా ఉండడంతో సురేఖ వాణి తిరిగి కోలుకుంది.
కూతురితో సందడి: కెరీర్ పరంగా సురేఖ వాణి ఎంత సక్సెస్ అయిందో.. వ్యవహార శైలితో కూడా అంతే పాపులర్ అయింది. ముఖ్యంగా చాలా కాలంగా తన కూతురితో కలిసి ఈ సీనియర్ నటి ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో రెచ్చిపోవడం వంటివి చేస్తోంది. దీనికితోడు సురేఖ రెండో పెళ్లి, బాయ్‌ఫ్రెండ్ వార్తలు హైలైట్ అయ్యాయి. ఇలా ఈమె సంచలనంగా మారిపోయింది.

వరుస ఆఫర్లతో బిజీ: వయసుకు తగ్గట్లుగానే సురేఖ వాణికి ఇప్పుడు తెలుగులో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె తనదైన పాత్రలను చేయడానికి రెడీ అయిపోతోంది. ఇలా ఇప్పుడు దాదాపు ఆరేడు సినిమాల్లో సురేఖ వాణి నటిస్తోంది. అలాగే, కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ భాగం అయింది. ఇలా ఇప్పటికీ ఈ సీనియర్ నటి టాలీవుడ్‌లో తనదైన రీతిలో హవాను చూపిస్తూనే ఉంటోంది.
అందులో హడావిడి: ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో తనదైన రీతిలో సందడి చేస్తోన్న సీనియర్ నటి సురేఖ వాణి.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తనకు, తన ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. వీటిలో హాట్ షో చేసేవి కూడా ఉంటున్నాయి.

ఆర్జీవీతో నైట్ పార్టీ: ప్రముఖ నటి సురేఖ వాణి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి కనిపించింది. అంతేకాదు, వీళ్లిద్దరూ ఓ నైట్ పార్టీలో పాల్గొన్నట్లు ఈ పిక్ చూస్తే అర్థం అవుతోంది. ఇక, ఈ ఫొటోలో వర్మ చేతిలో మందు గ్లాసు ఉండగా.. అతడికి సురేఖ టైట్ హగ్ ఇచ్చింది. దీంతో ఈ పిక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











