»   »  బాయ్ ఫ్రెండుతో హీరోయిన్ రహస్యంగా కమిటైంది... ఇక మూడు ముళ్లే!

బాయ్ ఫ్రెండుతో హీరోయిన్ రహస్యంగా కమిటైంది... ఇక మూడు ముళ్లే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సుష్మా రాజ్.... ఈ పేరు చాలా మంది ప్రేక్షకులకు తెలియక పోవచ్చుకానీ, మొహం చూస్తే మాత్రం ఓహో! ఈ అమ్మాయా? అని అనేస్తారు. 2014లో వచ్చిన తెలుగు మూవీ 'మాయ', తర్వాత 'జోరు' చిత్రంలో నటించింది.

కన్నడ రొమాంటిక్ ఫిల్మ్ మదరంగి చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన సుష్మా రాజ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. సైడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైన సుష్మా ఇటీవల వచ్చిన త్రిష 'నాయకి' మూవీలో కూడా నటించింది.

ఆమె సినిమా కెరీర్ సంగతి పక్కన పెడితే... త్వరలో సుష్మారాజ్ పెళ్లి చేసుకోబోతోంది. కొంత కాలంగా బాయ్ ఫ్రెండుతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న ఆమె అతన్నే పెళ్లి చేసుకోబోతంది. ఇటీవలే రహస్యంగా ఇద్దరూ కమిట్ అయ్యారని, ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని తెలుస్తోంది.

అయితే తన పెళ్లి విషయం, ఎంగేజ్మెంట్ విషయంతో పాటు చివరకు బాయ్ ఫ్రెండు ఎవరు? అనే విషయాలు కూడా చాలా రహస్యంగా ఉంచుతున్నారు. పెళ్లి ఫిక్సయిన తర్వాతే అన్ని విషయాలు అఫీషియల్ గా బయట పెడుతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

ప్రస్తుతం చేస్తున్నమూవీస్

ప్రస్తుతం చేస్తున్నమూవీస్


ప్రస్తుతం సుష్మా రాజ్ ‘ఈడు గోల్డ్ ఎహె' అనే సినిమాలో నటిస్తోంది. వీరు పోట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్ హీరో.

అందుకే సీక్రెట్

అందుకే సీక్రెట్


ప్రస్తుతం సుష్మారాజ్ పలు సినిమాల్లో నటిస్తోంది. పెళ్లి విషయం ఇప్పుడే బయట పెడితే అనవసర ఇబ్బందులు తలెత్తుతాయని అలా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

సహజీనవం..

సహజీనవం..


సుష్మా రాజ్ కొంతకాలంగా బాయ్ ఫ్రెండుతో సహజీవనం చేస్తోందని, ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఎంగేజ్మెంటుకు, మ్యారేజికి కమిట్ అయ్యారని టాక్.

పెళ్లి తర్వాత..

పెళ్లి తర్వాత..


ప్రస్తుతం సుష్మా రాజ్ కమిటైన ప్రాజెక్టుల్లోనే నటిస్తోంది. కొత్త ప్రాజెక్టులకు ఒప్పుకోవడం లేదు. నటిగా పెద్దగా గ్రోత్ కూడా లేక పోవడంతో పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

సుష్మా రాజ్

సుష్మా రాజ్


సుష్మా ఇటీవల వచ్చిన త్రిష ‘నాయకి' మూవీలో కూడా నటించింది.

English summary
Actress Sushma Raj who has delighted the audiences with romantic entertainer movies like ‘Maaya’ and “Joru’ has found her soul mate. She is planning to get married her long time boy friend very soon. According to the sources, Sushma Raj secretly engaged with him in a secret ceremony in May month, in Banglore. Now she is busy in wrapping the shoot of upcoming movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X