ఇదేం పాడు బుద్ది: దొంగతనం చేస్తూ దొరికిపోయిన హీరోయిన్

By Srikanya

హైదరాబాద్: సెలబ్రెటీ స్ధాయిలో ఉన్నవాళ్ళకు ఉండే గౌరవ మర్యాదలు వేరు..వాళ్ళూ దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తూంటారు. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా మీడియా మూడో కన్ను తెరిచి, కెరీర్ ని మార్చి బూడిద చేసేందుకు ప్రయత్నిస్తూంటుంది. అయితే ఒక్కోసారి ఇతర దేశాల్లో మనని ఎవరు పట్టించుకుంటారులే అని చేసే పనులే వారిని పట్టిస్తూంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి సింగపూర్ లో చోటు చేసుకుంది. షాప్ లో దొంగతనం చేస్తూ దొరికిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

బెంగాళి హీరోయిన్ స్వస్దిక్ ముఖర్జీ.. ఓ ఫిల్మ్ ఫెస్టవల్ కి సింగపూర్ కి వెళ్లింది. తన బోయ్ ప్రెండ్,ఫిల్మ్ మేకర్ అయిన సుమన్ ముఖర్జీతో కలిసి షాపింగ్ కు వెళ్లింది. అయితే అక్కడ ఓ షాప్ లో దొంగతనం చేసిందట. ఈ విషయం షాపు నిర్వాకులు కనిపెట్టి పట్టుకున్నారని ఆరోపణ. US$225 విలువైన సామాను లేపేసిందని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఆ షాప్ ఓనర్ అప్సర ఓస్వల్...ఫిల్మ్ ఫెస్టివల్ అధారిటీలకు సిసిటీవి ఫుటేజ్ తో సహా పంపి తెలియచేసారట.

ఇక ఈ విషయాన్ని అరిందమ్ సిల్..కహానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఖరారు చేసారు. ఫెస్టివల్ అధారిటీ లో భాగమైన తాను ఈ ఫుటేజిని చూసానని చెప్పారు. అంతేకాక ఆ షాప్ ఓనర్ తన ప్రెండ్ అని తెలియచేసారు. అయితే ఈ విషయమై పోలీస్ కంప్లైట్ ఇవ్వలేదుట. తన బోయ్ ప్రెండ్ తో కలిసి సోమవారమే హోటల్ రూమ్ ని వెకేట్ చేసిందిట. మరి ఈ విషయమై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటున్నారు బాలీవుడ్ వాసులు.

 Actress Swastika Mukherjee Caught Shoplifting

ఈ విషయమై ఫెస్టివల్ ఫౌండర్,ఛైర్ పర్శన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ... ఆమె అమాయకురాలని, అయితే మిస్సయిన వాటిని తాము పై చేస్తామని, ఆమెను ఇలాంటి వివాదాల్లో లాగటం ఇష్టం లేదని అన్నారు. అంతేకాకుండా ఈ విషయమై తాను ఈ విషయమై ఏమీ మాట్లాడేదీలేదని, మీడియా వాళ్లును తనకు ఈ విషయమై సంప్రదించవద్దని కోరుకుంటున్నానని అన్నారు. ఈ విషయమై స్వస్దిక మాత్రం మీడియాతో మాట్లాడటానికి ఆసక్తిచూపించలేదు.

ఇక స్వస్దికకు వివాదాలు కొత్తేమీ కాదు.. ఇంతుముందు మే నెలలో తన బోయ్ ప్రెండ్ తో గొడవపడి ఓ సారి సూసైడ్ ప్రయత్నం చేసి మీడియాకు ఎక్కింది. ఇప్పుడిలా ఈ దొంగతనం వివాదంతో మీడియాలో మారు మ్రోగుతోంది. నేషనల్ ఛానెల్స్ సైతం ఈ వార్తను ప్రసారం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె Detective Byomkesh Bakshy అనే బాలీవుడ్ చిత్రంలో కీ రోల్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X