నైట్ పార్టీలో హీరోయిన్ ఆత్మహత్యాయత్నం?
కోల్‌కతా: బెంగాలీ హీరోయిన్ స్వస్తికా ముఖర్జీ ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల ఆమె ఓ లేట్ నైట్ పార్టీలో పాల్గొని గాయాల పాలైంది. పార్టీ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మణికట్టుకు గాజు పెంకులు గుచ్చుకుపోయాయి. వెంటనే ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు.
అపోలో ఆసుపత్రి డాక్టర్లు ఆమెకు సర్జరీ నిర్వహించి ఆమె చేతిలో గుచ్చుకుపోయిన గాజుపెంకులను తొలగించారు. ఆమె చేతిలోకి గాజు పెంకులు ఎలా గుచ్చుకున్నాయో అర్థం కావడం లేదని, ప్రస్తుతానికి ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలోనే స్వస్తికా ముఖర్జీని డిశ్చార్జ్ చేస్తామని' ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ కౌషిక్ వెల్లడించారు.

స్వస్తికా ముఖర్జీ సోదరి అజోపా ముఖర్జీ మాట్లాడుతూ...పార్టీ జరుగుతుండగా కింద పడిపోయిందని, ఈ ఘటనలో ఆమె తల, చేతులకు గాయాలైనట్లు తెలిపింది. చేతిలో గాజు గ్లాసు పట్టుకుని ఉండటం వల్ల కింద పడిపోయిన సమయంలో అవి గుచ్చుకుని ఉంటాయని ఆమె తెలిపారు.
అయితే స్వస్తికా ముఖర్జీ గురించి బెంగాళీ సినిమా సర్కిల్లో రకరకాల పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది, పార్టీలో బాయ్ ఫ్రెండుతో గొడవే ఇందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది. తన భర్త నుండి విడిపోయిన 33 ఏళ్ల స్వస్తికా ముఖర్జీ పలు బెంగాళీ చిత్రాలతో పాటు, హిందీలో 'ముంబై కట్టింగ్' అనే చిత్రంలో నటించింది.


Click it and Unblock the Notifications











