టబు: ప్రౌఢ వయస్సులో ఈ ఫొటో షూట్ లేంటి?(ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్: నాగార్జున కాంబినేషన్ లో నిన్నే పెళ్లాడతా,ఆవిడా మా ఆవిడా వంటి చిత్రాలతో అలరించిన నటి టబు. ఆమె ఈ 43 సంవత్సరాల వయస్సులోనూ హాట్ గా ఫొటోషూట్ లలో పాల్గొంటూ అందరినీ అశ్చర్యపరిచింది.

ఈ మధ్య కాలంలో సినిమాల జోరును తగ్గించిన ఆమె మీడియాకు కూడా దూరంగానే ఉంటోంది. టీవీ షోలు వంటి ఆఫర్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరించింది. అయితే హఠాత్తుగా ఈ ఫొటో షూట్ తో మళ్లీ మీడియాలో వార్తల్లో నిలిచింది.

తెలుగులోనూ ఆమె ఇదీ సంగతి చిత్రం తర్వాత ఏ చిత్రమూ ఒప్పుకోలేదు. తనకు తగిన పాత్ర వచ్చినప్పుడే సినిమాలు చేస్తానని స్టేట్ మెంట్ సైలెంట్ గా ఉండిపోయింది. తనకు ఇప్పుడు పనిగట్టుకుని ఏ సినిమా పడితే ఆ చిత్రం చేయాల్సిన పనిలేదని తెగేసి మరీ చెప్తోంది. ప్రస్తుతం హైదర్ అనే బాలీవుడ్ చిత్రం చేస్తోంది.

గ్రీకువీరుడు, నా రాకుమారుడు..అంటూ నాగార్జునకి దగ్గరైన టబు ఆయనతో తర్వాత పలు హిట్ చిత్రాలు చేసింది. స్క్రీన్ పై వీరి రొమాన్స్ బాగా పండాయి. నిజ జీవితంలో కూడా ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. టబు నా క్లోజ్ ఫ్రెండ్ అని నాగార్జున కూడా పలు సందర్భాల్లో చెప్పడంతో..... ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే గుసగుసలు చాలా వినిపించాయి.

టబు లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోలు స్లైడ్ షోలో...

ఉనికి కోసం...

ఉనికి కోసం...

ఒకప్పుడు తన హాట్ అండ్ సెక్సీ గ్లామర్‌తో సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపిన హీరోయిన్ టబు. 42 సంవత్సరాల టబు ప్రస్తుతం హీరోయిన్ పాత్రలు చేసే అవకాశం లేక పోవడంతో ఇతర పాత్రలు చేస్తూ నటిగా తన ఉనికిని కొనసాగిస్తూనే ఉంది.

తల్లి పాత్రలుకు నో...

తల్లి పాత్రలుకు నో...

నాలుగు పదుల వయసు దాటిన టబు పర్సనాలిటీ తల్లిపాత్రలకు బాగా సూటవుతుందనే ఉద్దేశ్యంలో పలువురు దర్శకులు ఆమెను సంప్రదిస్తున్నారు. అయితే అలాంటి పాత్రలు చేసేందుకు తాను సిద్ధంగా లేనని తేల్చి చెబుతోంది ఈ ప్రౌడ సుందరి.

నేను ముసలిదాన్ని కాదు...

నేను ముసలిదాన్ని కాదు...

బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ త్వరలో తెరకెక్కించబోయే సినిమాలో....హీరోయిన్ ప్రియాంక చోప్రాకు తల్లిగా నటించాలనే ప్రతిపాదన టబు ముందుకు తెచ్చింది. అయితే తాను అప్పుడే ముసలి పాత్రల్లో నటించడానికి సిద్దంగా లేనని ఆ ఆఫర్‍ను తిరస్కరించింది టబు.

మొత్తం 60 దాకా..హాలీవుడ్ చిత్రంలోనూ...

మొత్తం 60 దాకా..హాలీవుడ్ చిత్రంలోనూ...

గతంలో టబు ఎంపిక చేసి మరీ నటించిన చీనికం, చాందినీ బార్ చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇప్పటి వరకు టబు వివిధ భాషల్లో దాదాపు 60 చిత్రాల్లో నటించింది. లైఫ్ ఆఫ్ పై అన హాలీవుడ్ చిత్రంలో కూడా ఆమె నటించారు. ఆ చిత్రం ఆస్కార్ కి వెళ్లి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

హైదరాబాద్ రాను..

హైదరాబాద్ రాను..

ఆ మధ్య ఆమె హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుందని వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఖండించింది. ఆమె ముంబైలో మీడియాతో మాట్లాడుతూ తాను హైదరాబాద్ షిప్ట్ అవుతాననే వార్తల్లో నిజం లేదని, ముంబైలోనే ఉంటానని తేల్చి చెప్పింది.

పాత పాటే...

పాత పాటే...

నాగార్జున భార్య అమలతో పాటు, అక్కినేని కుటుంబం టబుతో చాలా సన్నిహితంగా ఉండటం, టబు హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే ఉంటుందని నాగార్జున గతంలో చెప్పడంతో.....నాగ్-టబు మధ్య బంధం చాలా దూరం వెళ్లిందనే అంతా అనుకున్నారు. అయితే నాగార్జున తనకు మంచి స్నేహితుడని, అంతకుమించి మరేమీ లేదని టబు స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X