క్యాబ్ రేప్ ఎఫెక్ట్: భయ పడ్డానంటున్న తాప్సి

By Bojja Kumar

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో క్యాబ్ ఎక్కిన మగువలపై అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటుండటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆ మధ్య హైదరాబాద్ లో...తాజాగా ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ రేప్ ఘటనలకు పాల్పడటం మహిళల్లో క్యాబ్ ఎక్కాలంటేనే భయాందోళన కలిగిస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

 Actress Tapsee Pannu feeling fear about Cabs

ఈ భయం కేవలం సాధారణ మహిళలకే పరిమితం కాలేదు. తాప్సీ లాంటి హీరోయిన్లను కూడా భయాందోళనకు గురి చేస్తోంది. ఈ విషయమై ఆమె స్పందించింది. దాని గురించి ఆమె చెబుతూ- ''భయం అనేది ఆడవాళ్ల జీవితంలో ఓ భాగం అయిపోయింది. ఇటీవల జరిగిన సంఘటనల కారణంగానో ఏమో.. కాబ్ ఎక్కినప్పట్నుంచీ భయం వెంటాడింది. గమ్యం చేరుకునేవరకూ భయపడుతూనే ఉన్నా'' అని పేర్కొంది.

రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'వయ్ రాజా వయ్' ఆడియో వేడుకలో పాల్గొనడానికి ముంబయ్ నుంచి చెన్నయ్ చేరుకున్న తాప్సీ చెన్నయ్ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత తాను బస చేసే హోటల్ కి చేరుకోవడానికి ఓ క్యాబ్ ఎక్కిన సందర్భంగా ఈ అనుభవానికి లోనైదట.

తాప్సీ ఇతర సినిమాల విషయానికొస్తే....ప్రస్తుతం ఆమె తమిళ చిత్రం 'వయ్ రాజా వయ్' తో పాటు హిందీలో రన్నింగ్ షాదీ డాట్ కామ్, బేబీ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో లారెన్స్ కు జోడీగా ‘ముని3: గంగా' చిత్రం ఆ మధ్య ప్రారంభం అయినప్పటికీ ఈ చిత్రం ప్రస్తుతానికి ఆగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X