వ్యభిచారం కేసులో తెలుగు సినీనటి అరెస్టు
వ్యభిచారం కేసులో మరో సినీనటి అరెస్ట్ అయ్యింది. టీవీ ఛానెల్ సహాయంతో పోలీసులు ఈ రాకెట్ ని ఛేదించారు. తారాచౌదరి అ లియాస్ మంజుల (35) ఆమె భర్త ప్రసాద్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మంజుల తనను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపిందంటూ వైజాగ్‌కు చెందిన లక్ష్మి అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.సుదర్శన్, బాధితురాలు లక్ష్మి కథనం ప్రకారం... శ్రీనగర్‌కాలనీ సమీపంలోని నవోదయాకాలనీలో తారాచౌదరి గది అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం నడుపుతోంది. ఏడాది క్రితం ఈమె విశాఖపట్నం గాజువాక లోని ఓ జ్యువెలరీ షాప్‌కు వెళ్లింది. అక్కడ సేల్స్‌గర్ల్‌గా పని చేస్తున్న లక్ష్మితో హైదరాబాద్ వస్తే మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికింది.
దీంతో ఫిబ్రవరి 29న లక్ష్మి నగరానికి వచ్చి ఆమెను సంప్రదించగా ఇంటికి రమ్మంది. యువతి వెళ్లగా ఇద్దరు యువకులు నిన్ను కొనుక్కున్నాం...15 రోజులు మాతో గడపాలని నిర్బంధించారు. వ్యభిచారం చేయమని హింసించారు. బాధితురాలు శనివారం ఓ ఛానల్ సహాయంతో వ్యభిచార కూపం నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలోనే తారాచౌదరి బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు వచ్చి.. తనపై ఓ ఛానల్ అసభ్యకరంగా స్క్రోలింగ్స్ ఇస్తోందని, చర్యలు తీసుకోవాలని పోలీసులపై చిందులేసింది. బాధితురాలు లక్ష్మి ఫిర్యాదు మేరకు తారాచౌదరిని, ఆమె భర్త ప్రసాద్‌ను అరెస్ట్ చేసి ఐపీసీ 353, 3 అండ్ 4 ఆఫ్ పీటా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అంతేగాక తమపై చిందులేసినందుకూ కేసు పెట్టారు. ఈమెపై గతంలో పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో వ్యభిచారం కేసు, బంజారాహిల్స్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











