తాగు బోతు హీరోయిన్ త్రిష అంటూ మళ్లీ వార్తలు!
హైదరాబాద్: హీరోయిన్ త్రిష గతంలో తప్ప తాగి రచ్చ రచ్చ చేసినట్లు వార్తలు విన్నాం. తాజాగా మరోసారి ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని టీవీ ఛానల్స్‌లో వస్తున్న వార్తల ప్రకారం ఇటీవల త్రిష తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్‌కు వెళ్లి మందు కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల మే 4వ తేదీన త్రిష బర్త్ డే సందర్భంగా తన స్నేహితులైన నయనతార, అమలా పాల్, రమ్య కృష్ణ, శింబుతో పాటు పలువురిని పిలిచి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్రిషకు ముందు నుండి పార్టీ కల్చర్‌కు అలవాటు పడిన భామగా పేరుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి విషయాలు బాగా హైలెట్ అవుతున్నాయి.

అయితే ఇక్కడ తాగడం తప్పు కాదు కానీ.....త్రిష విషయంలో మీడియా ఈ విషయాన్ని బూతద్దంలో పెట్టి చూడానికి కారణం గతంలో ఆమె తాగి వివాదాల్లో ఇరుక్కోవడమేణం. త్రిష కెరీర్లో ఇదొక మాయని మచ్చగా మిగలిపోయంది. సెలబ్రిటీల విషయంలో ఇలాంటి వివాదాలు వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి.
సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన త్రిష కెరీర్ ఇపుడు గతంలోలా స్పీడుగా లేక పోయినా ఫర్వాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళంలో రెండు సినిమాలతో పాటు కన్నడలో ఒకటి, తెలుగులో 'రంభ ఊర్వశి మేనక' అనే చిత్రాల్లో చేస్తోంది.


Click it and Unblock the Notifications











