హీరోయిన్ త్రిష తండ్రి మృతి
హైదరాబాద్ : హీరోయిన్ త్రిష తండ్రి కృష్ణన్ (66) హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందారు. ఆయన హైదరాబాద్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జనరల్ మేనజర్ గా పనిచేస్తున్నారు. ఆయన నిన్న (గురువారం, Oct 18, 2012)రాత్రి గుండెల్లో నెప్పిగా ఉందని చెప్పటంతో హాస్టటల్ స్టాఫ్ వెంటనే ఆయన్ను అంబులెన్స్‌లో సమీపంలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారని డాక్టర్లు ధృవీకరించారు. విషయం తెలిసిన వెంటనే త్రిష, ఆమె తల్లి ఉమ హుటాహుటిన చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోనే కృష్ణన్ అంత్యక్రియలు ఉంటాయని ఉమ వెల్లడించారు. కృష్ణన్‌కు త్రిష ఒక్కర్తే కుమార్తె. ఇక ప్రస్తుతం త్రిష తెలుగులో ఏ సినిమాలూ చేయటం లేదు.


Click it and Unblock the Notifications












