డూప్ కూడా లేకుండా త్రిష రిస్క్?: లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటుందట

గర్జనై షూటింగ్ లో త్రిష డేరింగ్ చూసి మెస్మరైజ్ అయిపోతున్నారట అంతా. బాడీ డబుల్ ఉపయోగించుకోకుండా తనే రిస్కీ స్టంట్స్ చేయడం చూసి నోరు వెళ్లబెట్టేస్తున్నారట.

Recommended Video

Trisha Daring Stunts For Garjanai త్రిష రిస్క్? కొత్త యాంగిల్ చూపిస్తూ !

ఓ పదేళ్ల కిందట కోలీవుడ్ తెర మీద తళుక్కున మెరిసిన త్రిష అదే పదేళ్ల పాటు అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ అగ్రహీరోయిన్ స్థాయిలో మంచి ఊపునే కొనసాగించింది. మొదటినుంచీ త్రిష పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చింది కమర్శియల్ గా కలిసివచ్చే గ్లామర్ పాత్రలకే. నెమ్మదిగా కొత్త హీరోయిన్ల రాకమొదలై, త్రిష ఏజ్ కూడా పెరిగిపోతుండటంతో ఆఫర్లలో వెనుకబడింది...

సంపాదించేదేం లేదు

సంపాదించేదేం లేదు

ఇక ఇప్పుడు ఎటూ కెరీర్లో పెద్దగా సంపాదించేదేం లేదు కాబట్టి గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ కే ప్రాధాన్యం ఇస్తోంది. నాయకి అనే సినిమా కాస్త అటూ ఇటూ అయినా... నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన "కోడి" ఆమెకి మంచిపేరే తెచ్చింది...

 ఆఫర్స్ రూట్ మారిపోయింది

ఆఫర్స్ రూట్ మారిపోయింది

ఇక అక్కడి నుంచి ఈ చెన్నై భామకు వచ్చే ఆఫర్స్ రూట్ మారిపోయింది. విభిన్నమైన కాన్సెప్టులు.. త్రిష ఇప్పటివరకూ టచ్ చేయని సబ్జెక్టులతో ఛాన్సులు వస్తున్నాయి. తాజాగా తనలోని కొత్త యాంగిల్ ను చూపించాలని త్రిష ఫిక్స్ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ 'గర్జనై' అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.

 బోలెడన్ని యాక్షన్ సీక్వెన్స్ లు

బోలెడన్ని యాక్షన్ సీక్వెన్స్ లు

తమిళనాడులోని యార్కాడ్ సమీపంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇక్కడ బోలెడన్ని యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరించేస్తున్నారు. త్రిష మొదటిసారిగా యాక్షన్ జోనర్ ను తానే చూపిస్తుండగా.. ఇంత లేటు వయసులో ఇలాంటి ఫీట్స్ ఎందుకో అనే మాటలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.

నోరు వెళ్లబెట్టేస్తున్నారట

నోరు వెళ్లబెట్టేస్తున్నారట

లేడీ సూపర్ స్టార్ అనిపించుకోవాలనే కోరికను.. కొన్ని నెలల క్రితం ఈ భామ బయట పెట్టిన సంగతి తెలిసిందే. అందుకే.. అన్ని రకాల సినిమాలను చేసేస్తోందట త్రిష. గర్జనై మేకర్స్ అయితే.. త్రిష డేరింగ్ చూసి మెస్మరైజ్ అయిపోతున్నారట. బాడీ డబుల్ అందుబాటులో ఉన్నా కూడా ఉపయోగించుకోకుండా.. తనే రిస్కీ స్టంట్స్ చేయడం చూసి నోరు వెళ్లబెట్టేస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X