»   » పొట్టి డ్రెస్సులో...నిషా ఎక్కించిన త్రిష (ఫోటోలు)

పొట్టి డ్రెస్సులో...నిషా ఎక్కించిన త్రిష (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: స్టార్ హీరోయిన్‌గా దశాబ్దకాలం పాటు తెలుగు, తమిళ చిత్ర సీమల్లో తన హవా కొనసాగించిన త్రిష దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించింది. అయితే వయసు పైబడుతుండటం, కొత్త హీరోయిన్ల పోటీ పెరగడంతో త్రిషకు అవకాశాలు బాగా తగ్గాయనే చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీని తట్టుకునేందుకు కేవలం నటన మాత్రమే కాదు, గ్లామర్ డోసు పెంచడం కూడా అవసరమే అని త్రిష గ్రహించినట్లుంది.

ఇటీవల త్రిష నటించిన తమిళ చిత్రం 'Endrendrum Punnagai' ఆడియో వేడుక చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నటుడు కమల్ హాసన్, దర్శకుడు బాల తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో చిట్టిపొట్టి డ్రెస్సులో తన గ్లామర్ విశ్వరూపం ప్రదర్శించింది త్రిష.

అఫ్ కోర్స్....సినీ పరిశ్రమలో ఇవన్నీ సర్వసాధారణమే అనుకోండి. తన అభిమానులకు కనువిందు చేయడానికే త్రిష ఇలా హాట్ అండ్ సెక్సీ డ్రెస్సులో దర్శనం ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు త్రిష అభిమానులైతే ఓ లుక్కేయండి మరి. స్లైడ్ షోలో త్రిష హాట్ ఫోటోలతో పాటు, మరిన్ని వివరాలు...

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి


మోడలింగ్ రంగంలో సక్సెస్ అయిన తర్వాత సినిమాల వైపు తన దృష్టి సారించిన హీరోయిన్ త్రిష..... జోడి చిత్రంతో తన సినీ కెరీర్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సిమ్రన్ ఫ్రెండ్‌గా ఓ చిన్న క్యారెక్టర్ చేసింది.

హీరోయిన్‌గా

హీరోయిన్‌గా


వెంటనే అమీర్ సుల్తాన్ దర్శకత్వంలో వచ్చిన ‘మౌనం పేసియాదె' చిత్రంలో సూర్య సరసన హీరోయిన్‌గా చేసే అవకాశం దక్కించుకుంది. డిసెంబర్ 13, 2012లో విడుదలైన ఆచిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సూర్య, త్రిష పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి.

టాప్ రేంజికి...

టాప్ రేంజికి...


అలా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన త్రిష అనతి కాలంలోనే సౌతిండియా టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సౌతిండియాలో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన స్టార్లలో త్రిష ఒకరు. ఆమె దాదాపు సౌతిండియా టాప్ స్టార్లందరితో నటించింది.

తెలుగులో...

తెలుగులో...


తెలుగులో త్రిష దాదాపు 20 చిత్రాల్లో నటించించింది. స్టాలిన్ చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవితో, కింగ్ చిత్రంలో నాగార్జునతో, నమోవెంకటేశ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాలతో విక్టరీ వెకంటేష్, అతడు, సైనికుడు చిత్రాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు, తీన్ మార్ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో, జూ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో, వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు చిత్రాల్లో ప్రభాస్ సరసన, కృష్ణ చిత్రంలో రవితేజ సరసన ఇలా దాదాపు టాప్ హీరోలందరితో నటించింది. ఆమె తెలుగులో నటించిన చిత్రాల్లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కృష్ణ తదితర చిత్రాలు మంచి విజయం సాధించాయి.

వరుస ప్లాపులు

వరుస ప్లాపులు


అయితే త్రిష ఈ మధ్య తెలుగులో నటించిన తీన్ మార్, దమ్ము చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడటం, తమిళంలోనూ పలు చిత్రాలు నిరాశ పరచడంతో త్రిష హవా కాస్త తగ్గింది. తెలుగులో ఆమె ఒక్క చిత్రం కూడా చేయడం లేదు. అయితే తమిళంలో ఆమె నటించిన చిత్రాలు ఇటీవల విజయం సాధించడంతో అక్కడ తన హవా కొనసాగిస్తోంది.

అగ్రహీరోలతో..

అగ్రహీరోలతో..


తెలుగులో ఆమె చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, ప్రభాస్ తదితర టాప్ స్టార్లతో నటించింది. తన నటనతో పాటు.... గ్లామర్ విషయంలోనూ ఏమాత్రం తగ్గకుండా తోటి హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చింది.

బాలీవుడ్లో...

బాలీవుడ్లో...


సౌతిండియా చిత్రాలతో పాటు.... కట్టా మీటా చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో త్రిషకు అచ్చి రాక పోవడంతో మళ్లీ సౌత్ సినిమాల బాట పట్టింది.

English summary

 Actress Trisha Krishnan at Endrendrum Punnagai audio launch. Tamil movie Endrendrum Punnagai audio launch held at Sathyam Theatres, Chennai on October 24th, 2013. The Audio was released by Padmashree Dr. Kamal Haasan and received by Director Bala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu