»   » అప్పుడు న్యూడ్, ఇపుడు బాహుబలి...టాలీవుడ్ పాప పాట్లు!

అప్పుడు న్యూడ్, ఇపుడు బాహుబలి...టాలీవుడ్ పాప పాట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీం' చిత్రంతో పాపులర్ అయిన తెలుగు నటి తేజస్వి మదివాడ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. అంతకు ముందే ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయినా గుర్తింపు వచ్చింది మాత్రం రామ్ గోపాల్ వర్మ సినిమాతోనే.

ఆమెకు ఇంత పాపులారిటీ ‘ఐస్ క్రీం' సినిమా సక్సెస్ అవడం వచ్చింది అనుకుంటే పొరపాటే. ఈ సినిమా విడుదలకు ముందు ఆమె హాట్ ఫోటోలు విడుదల చేసారు. అందులో ఆమె న్యూడ్ గా ఉన్న కొన్ని పోటోలు ఉన్నాయి. నగ్నంగా కనిపించబోతోందనే ప్రచారంతో తేజస్వికి బాగానే పబ్లిసిటీ లభించింది. ఎలాంటి గుర్తింపు దక్కాలో అలాంటి గుర్తింపే దక్కింది.

Actress Uses Baahubali Craze To Get Attention

ఏవో చిన్న సినిమాలకు తప్ప స్టార్ హీరోయిన్ అయ్యే రేంజిలో ఆమె అందం, ఆటిట్యూడ్, అభినయం లేదనేది వాస్తవం. అయితే ఉన్నంతలో వీలైనంత పబ్లిసిటీ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న ఆమె తాజాగా ‘బాహుబలి' సినిమా విడుదల ముందు ‘ఐ హేట్ బాహుబలి' అంటూ ఓ వీడియో రిలీజ్ చేసి పబ్లిసిటీ సంపాదించుకునే ప్రయత్నం చేసింది.

‘ఐ హేట్ బాహుబలి' ఆమె ఎందుకు అందో అనుకుని ఆ వీడియో ఓపెన్ చేసిన చూసిన వారికి ఇదంతా పబ్లిసిటీ స్టంటే అని అర్థమైంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
Actress Tejeswi Madivada shot to fame through Ram Gopal Varma's Ice cream, which was shot in a single house with only two members, though she was introduced with Seetamma Vakitlo Srimalle Chettu.
Please Wait while comments are loading...