ప్రధాని మోదీకి ఆహ్వానం.. వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ అంటే?
దాదాపు అన్ని సినీ ఇండస్ట్రీ లలో కూడా సీనియర్ స్టార్ నటీనటులు నుంచి వచ్చిన వారసులు అంతా దాదాపు కూడా హీరోలు గానో హీరోయిన్స్ గానో సెట్ అయ్యిన వారే చాలా మందే ఉన్నారు. దాదాపు సౌత్ నుంచి నార్త్ నుంచి ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఓ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసుల్లో హీరోయిన్ గా కాకుండా లేదా హీరోగా లాంటివి చేయకుండా చాలా తక్కువమంది ఉంటారు.
మరి అలాంటి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే ఎక్కువ సినిమాలు చేసిన నటి ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా వరలక్ష్మి శరత్ కుమార్ అని చెప్పవచ్చు. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ అవ్వడానికి తమిళ నటి అయినప్పటికీ తెలుగులో కూడా అద్భుతంగా రాణించింది. సీనియర్ నటీనటులు శరత్ కుమార్, రాధికాల కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కానీ ఆమె హీరోయిన్ మాత్రం రాలేదు.

ఎక్కువ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనే ఆమె కెరీర్ ని ఆరంభించగా కెరీర్ స్టార్టింగ్ లోనే కొన్ని విమర్శలు కూడా ఆమెని చుట్టు ముట్టాయి. కానీ వాటి అన్నిటికి కూడా ఆమె తన నటనతోనే సమాధానం చెప్పింది. హీరోలకి టఫ్ ఫైట్ ఇచ్చే విధంగా సాలిడ్ పెర్ఫామెన్స్ లతో తెలుగు తమిళ సినిమాల్లో నటిస్తూ వెర్సటైల్ నటిగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా తర్వాత ఆమె తన బరువుని కూడా తగ్గించుకొని స్లిమ్ గా మారింది మారి మరిన్ని సినిమాలు చేసింది.

ఇంకా మన తెలుగులో అయితే ఆమె నటించిన ప్రతి సినిమా కూడా హిట్ అయ్యింది. రవితేజ క్రాక్ లో జయమ్మ రోల్ అయితే తన కెరీర్ లోనే ఒక గుర్తుండిపోయే పాత్రగా నిలిచిపోయింది. అక్కడ నుంచి మొన్న బ్లాక్ బస్టర్ హిట్ "హను మాన్" వరకు అదరగొట్టిన జయమ్మ కొన్నాళ్ల కితమే నికోలస్ అనే అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలిపింది. దీనితో వారి ఇంట ఆనందకర వాతావరణం మొదలైంది.
కానీ ఇప్పుడు ఒక షాకింగ్ ట్విస్ట్ తన నుంచి వచ్చింది అని చెప్పవచ్చు. కొంచెం ఓపెన్ గా చెప్పుకున్నట్టు అయితే వరలక్ష్మి శరత్ కుమార్ టాప్ నటి అయ్యి ఉండొచ్చు కానీ భారీ ఫేమ్ ఉన్న స్టార్ హీరోయిన్ కాదు నేషనల్ లెవెల్లో ఎక్కువ సినిమాలు కూడా చేసింది లేదు. పైగా శరత్ కుమార్ రాధికా లు కూడా ఫేమ్ సౌత్ వరకు మాత్రమే బాగా తెలుసు కానీ అలాంటిది వీరు ఫ్యామిలీ అంతా కూడా కలిసి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి పెళ్ళికి ఆహ్వానించడం అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఏంటి జయమ్మకి ఇంత రేంజ్ ఉందా అని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పటి వరకు సౌత్ నుంచి ఏ స్టార్స్ కూడా ఇలా పెళ్ళికి ఏకంగా మోడీని కలిసింది చాలా తక్కువ అలాంటిది వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్ళికి ఇండియా లోనే పవర్ఫుల్ వ్యక్తిని ఆహ్వానించడం అనేది ఒకింత సర్ప్రైజింగ్ గానే ఉందని చెప్పాలి. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి అయితే థాయిలాండ్ లో గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ జూలై 2న తన బాయ్ ఫ్రెండ్ నికోలస్ తో వరలక్ష్మి తన వివాహ బంధంతో ఒకటి కానుంది. కాగా రీసెంట్ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన పాన్ ఇండియా చిత్రం "శబరి" థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది.


Click it and Unblock the Notifications











