యాదాద్రి నిర్మాణం ఎవరికి దక్కని వరం.. కేసీఆర్ చేతులెత్తి మొక్కి.. తొలి ప్రేమ నటి వాసుకి (ఇంటర్వ్యూ)
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దైవ కార్యాల్లో అద్బుతమైన ప్రాజెక్ట్ యాదాద్రి. యాదగిరి గుట్ట నర్సింహాస్వామి ఆలయాన్ని పునర్ నిర్మాణం చేపట్టి ఆద్బుతమైన ఆలయంగా తీర్చిదిద్దారు. అలాంటి బృహత్తరమైన కార్యాన్ని నెరవేర్చే బాధ్యతను ఆర్ట్ డైరెక్టర్, అర్కిటెక్ట్ ఆనంద్ సాయికి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు. ఈ అద్బుతమైన, చారిత్రాత్మకమైన ప్రాజెక్టులో తన భర్త ఆనంద్ సాయితో కలిసి నటి వాసుకి ఓ బాధ్యతను తాను కూడా భుజానికి ఎత్తుకొన్నారు. యాదాద్రి పునర్ నిర్మాణం గురించి వాసుకీ వెల్లడిస్తూ..
యాదాద్రి ఆలయ నిర్మాణం సమయంలో :
నేను ఏదైనా కొత్త వాతావరణంలో ఉండాల్సి వస్తే.. భయపడను. ఆందోళన చెందను. ఆనంద్ సాయితో ఏదైనా మీటింగ్‌కు వెళ్లితే.. నేను చాలా విషయాలు లీడ్ తీసుకొంటాను. యాదాద్రి నిర్మాణం సమయంలో ప్రతీ మీటింగ్ విషయాలను, మినట్స్‌ను రాసుకొంటాను. ఆనంద్ సాయితో మీటింగ్‌లకు వెళ్లి చాలా విషయాలు సమన్వయం చేశాను. యాదాద్రి ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతీ స్టేజ్‌లో నేను ఉన్నాను. చిన్న పేపర్‌లో ఆలయం డిజైన్ గీసినప్పటి నుంచి ప్రాజెక్టు ఎండ్ అయ్యే వరకు నేను ఆయనతో ట్రావెల్ చేశాను.

అధికారులతో మీటింగ్.. ఆనంద్ సాయి అలా చేసేవారు:
యాదాద్రి ఆలయ నిర్మాణం సమయంలో ప్రతీ మీటింగ్‌కు నేను వెళ్లాను. అధికారులు, నిపుణులు ఆలయం గురించి, దాని ప్లాన్ గురించి చెబుతుంటే.. ఆనంద్ సాయి వింటూ పేపర్‌పై వెంటనే డిజైన్ గీస్తూ ఉండేవాడు. ఆయన ఎక్కువగా వినరు. అధికారులు చెప్పిన ప్రతీ విషయాన్ని నోట్ చేసుకొనే దానిని. మీటింగ్ పూర్తయ్యే సమయానికి ఆనంద్ సాయి ఆలయ డిజైన్ గీసి ఇచ్చేవారు. నేను నోట్ చేసుకొని మీటింగ్ మినట్స్‌ను అధికారులకు ఇచ్చే దానిని అని వాసుకి చెప్పారు.

సీఎం కేసీఆర్ సన్మానం చేసే.. :
యాదాద్రి ప్రాజెక్టు విషయంలో ప్రతీ అంశం నాకు తెలుసు. ఆ దైవ కార్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆనంద్ నాకు చెప్పేవారు. ఆయన చెప్పిన విషయాలన్నీ నేను నోట్ చేసుకొంటూ ఉండేదానిని. ప్రత్యేకమైన, ముఖ్యమైన విషయాలను పదే పదే చెప్పినా నేను విసుగు చెందకుండా రాసుకొంటూ ఉండేదానిని. సీఎం కేసీఆర్ చేతులెత్తి ఆనంద్ సాయికి మొక్కి సన్మానం చేసే వరకు నేను ఉన్నాను. అప్పటి వరకు నాకు యాదాద్రి ప్రాజెక్టులో జరిగే ప్రతీ విషయం నాకు తెలుసు అని వాసుకీ తెలిపారు.
అచీవ్ మెంట్ చిన్న పదం.. మాకు దక్కిన ప్రాప్తం:
యాదాద్రి లాంటి గొప్ప ప్రాజెక్టు చేయడానికి అవకాశం రావడం జీవితం ధన్యమైనట్టే. అది ఒక అచీవ్‌మెంట్ అనేది చిన్న పదం. అలాంటి ప్రాప్తం మాకు లభించడం గొప్ప వరం. ఆనంద్ సాయికే కాదు.. మా పిల్లలకు గొప్ప పేరు తెచ్చే విషయం. 100 సంవత్సరాలైనా మా పిల్లలకు కూడా పేరు ప్రతిష్టలు తెచ్చే గొప్ప దైవకార్యం యాదాద్రి అని వాసుకీ చెప్పారు.

మా అబ్బాయి కూడా ఆర్కిటెక్చర్:
మా అబ్బాయిని ఆర్కిటెక్చర్ చదివించడానికి వేరే సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. వాడికి కూడా వాళ్ల నాన్నకు తెలిసినట్టే అర్కిటెక్చర్ గురించి మాత్రమే తెలుసు. నా కొడుకుకు నా ముందు మంచి యాక్టింగ్ చేస్తుంటాడు. కానీ కెమెరా ముందు పనికి వస్తాడో లేదో తెలియదు. కానీ మంచి ఆర్కిటెక్ట్ అవుతారని మాత్రం చెప్పగలను. మా అబ్బాయితోపాటు మా పాప ప్లస్ టు యూకేలో చదువుతున్నది అని వాసుకీ తెలిపారు.

అన్ని మంచి శకునములే అంటూ :
నటి వాసుకి విషయానికి వస్తే.. తొలి ప్రేమ సినిమా అనంతరం 23 ఏళ్త తర్వాత అన్ని మంచి శకునములే సినిమాతో తిరిగి సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్ బ్యానర్లపై స్వప్నదత్, ప్రియాంక దత్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, వీకే నరేష్, గౌతమి తదితరులు నటించారు. ఈ చిత్రం మే 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











