తల్లి పాత్రలకు నేను రెడీ.. ఆ డైరెక్టర్‌కే ఆ క్రెడిట్.. తొలిప్రేమ వాసుకీ (ఇంటర్వ్యూ)

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్నీ మంచి శకునములే. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. తొలి ప్రేమ చిత్రంలో పవన్ కల్యాణ్ సోదరిగా నటించిన వాసుకీ ఈ చిత్రంలో క్యూట్ పాత్రను పోషించింది. ఈ చిత్రం మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వాసుకీ తన అనుభూతులను పంచుకొన్నది. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..

అన్ని మంచి శకునములే సినిమాలో నాది మంచి క్యూట్ క్యారెక్టర్. జీవితంలో తమ్ముడు ఎన్ని తప్పులు చేసినా సమర్ధించే అక్క ఉంటుంది. నా కూతురు కూడా అలాంటి మనస్తత్వం ఉంటుంది. అలాంటి అక్క క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. రుషి అనే క్యారెక్టర్‌కు అక్కగా నటిస్తున్నాను. నా పాత్రకు స్కోప్ ఉందా అంటే నేను పట్టించుకోను. ఒక సీన్‌లో నటించినా సినిమా గొప్పగా ఉంటుంది. సినిమా మొత్తం కనిపించినా పేరు, గుర్తింపు రాని సినిమాలు కూడా ఉంటాయి. అందుకే స్కోప్ అనే విషయాన్ని పట్టించుకోను అని వాసుకీ చెప్పారు.

Actress Vasuki about her acting career in Telugu film Industry

నేను తెర మీద కనిపించకుండా 23 ఏళ్లు అవుతుంది. తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు నాకు ఏమీ తెలియదు. అంతా కరుణాకరన్ వల్లే నేను నటించగలిగాను. ప్రతీ విషయంలోను నేను ఆయన చెప్పినట్టే చేశాను. భాష తెలియదు. ఇంగ్లీష్‌లో డైలాగ్స్ రాసుకొంటే.. తమిళంలో దాని అర్ధం చెప్పేవాడు. ఆ సినిమాలో నాకు నంది అవార్డు వచ్చినప్పుడు.. అది కరుణాకరన్ వల్లే అని చెప్పాను. ప్రస్తుతం నాకు కొంత నాలెడ్జీ ఉంది. ఇప్పుడు ఉన్న అంచనాలకు తగినట్టుగా న్యాయం చేయాలని నిర్ణయం తీసుకొన్నాను అని వాసుకీ చెప్పారు.

తొలి ప్రేమ తర్వాత 23 అనంతరం కూడా మళ్లీ చెల్లెలు పాత్ర చేయాల్సి వచ్చిందా అనే ఫీలింగ్ కలుగలేదు. ఎందుకంటే వాళ్లు నాకు తల్లి పాత్ర చేయమని చెప్పలేదు కదా అని జోక్ చేసింది. ఇప్పుడు అమ్మగా కనిపించని వారు అమ్మమ్మగా నటిస్తున్నారు. నాకు అలాంటి అవకాశం రాలేదు. కానీ మంచి పాత్ర ఉండే తల్లి పాత్రలో కూడా నటించడానికి రెడీ. నేను నటిగా కొనసాగుతాను. కానీ నాకు నచ్చే క్యారెక్టర్లు వస్తే చేస్తాను.

Actress Vasuki about her acting career in Telugu film Industry

సంతోష్ శోభన్ క్యారెక్టర్ చాలా స్వీట్. సినిమాలో క్యారెక్టర్, నిజ జీవితంలో క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. సెట్లో నన్ను ఎప్పుడు అక్క అంటూ ప్రేమగా ఉండేవాడు. సంతోష్ రియల్ క్యారెక్టర్‌ను సినిమాల్లో చేసినట్టు ఉంటుంది. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బాగా ఉంటుంది. సంతోష్‌కు తన కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది. సంతోష్ శోభన్ నిజ జీవితంలో ఎలా ఉంటాడో.. అన్ని మంచి శకునములే సినిమాలో అలానే కనిపిస్తాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X