అది చూపించమని టార్చర్.. .. తెలుగు డైరెక్టర్‌పై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం మాలీవుడ్ షేక్ అవుతోంది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వెలువడిన నాటి నుంచి రోజుకో సంచలన విషయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ షాకింగ్ రిపోర్టు వెలువడిన తరువాత చాలా మంది కథానాయికలు తమకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకోవడంతో పాటు పలువురు పెద్ద దర్శకులు,నటీనటులు కూడా దాని ప్రభావంలోకి కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురిపై లైంగిక ఆరోపణల కేసులు నమోదయ్యాయి. తాజాగా టాలీవుడ్ యువనటి విహారిక చౌదరి ఓ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
యువనటి విహారిక చౌదరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ప్రతి డైరెక్టర్ వర్కస్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎంతమంది అవసరం ఉన్న అవసరం లేకున్నా రొమాంటిక్ గా కనిపించాలి. రొమాంటిక్ గా చూపించాలి. అవసరం లేని సమయంలో కూడా బోల్డ్ లూక్స్ లో ఉండాలి. ప్రస్తుతం ఆ పేరు చెప్పాలనుకోవడం లేదు. ఆ డైరెక్టర్ ఎలాంటి వాడంటే.. డల్ సీన్, చాలా మూడీ సీన్, భర్తకు ఆరోగ్యం బాగోలేకపడుకుంటే.. అలాంటి సీన్ లో బ్యాక్ నుంచి కెమోరా పెట్టి.. నడుం చూపించాలి. నడుం చూపించాలి అని డిమాండ్ చేసేవాడు. అలాంటి విషాద సన్నివేశంలో ఎమోషనల్ గా ఉండాలని గానీ, నడుం ఎవరూ చూస్తారు. అని షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'కొంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేస్తే.. ప్రశాంతంగా ఎలాంటి గొడవ లేకుండా సాగిపోతుంది. మనం అవసరం లేని సమయంలో ఎక్స్ పోజ్ చేసే పని ఉండదు. అవసరం ఉంటే.. ఆ సీన్ డిమాండ్ చేస్తే మాత్రం కచ్చితంగా చేయాలి. అలా చేస్తేనే.. ఆ పాత్రకు న్యాయం చేసినట్టు. కొంత మంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనకు కన్వినేట్ గా ఉంటారు'అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది నటి విహరిక చౌదరి.
గతంలో ఈ యువనటి చాలా బోల్డ్ కామెంట్స్ చేసింది. అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వడం లేదనీ, ఇటు వెళ్లవద్దు అటు వెళ్లవద్దు అంటు షరతులు పెడుతుంటారని బాధపడింది. తానే అబ్బాయిని అంతా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాననీ, చాలా ఎంజాయ్ చేస్తాననీ, అవసరమైతే.. బట్టలు విప్పి తిరుగుతా అని షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇదిలా ఉంటే.. మాలయళ ఇండస్ట్రీలో జరుగుతున్న దారుణాలపై జస్టిస్ హేమ కమిటీ దాపు ఏడేళ్ల పాటు దర్యాప్తు చేసి సంచలన నివేదికను సిద్ధం చేసింది. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్, వివక్ష, ఇతర సమస్యలు, ఇబ్బందులపై అధ్యయనం చేసిన తన నివేదికను కేరళ సీఎం విజయ్ కు అందజేసింది. ఈ రిపోర్టు వెలువడిన నాటి నుంచి ఇండస్ట్రీలో పలు సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











