అలలతాకిడికి కొట్టుకుపోయిన హీరోయిన్!
చెన్నయ్ లోని నీలాంకరి కోస్టల్ ఏరియాలో ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్ లో హీరోయిన్ శృతిరాజ్ పై కొన్ని సన్నివేశాలను చిత్రించే పనిలో పడ్డారు ఇయక్కమ్ చిత్ర యూనిట్. తుపాను హెచ్చరికలతో సముద్రమేమో హోరుమంటోంది. చిత్ర దర్శకుడు సంజయ్ రామ్ సహజంగా షూటింగ్ చేద్దామనుకున్నాడు. దర్శకుడి ఆలోచనకు హీరోయిన్ శృతిరాజ్ కూడా సై అంది. అంతే ఆమె దర్శకుడు చెప్పినట్టుగా నీటిలోకి దిగి అలలకు అడ్డంగా వెళ్లింది. ఇంతలో పెద్ద అల రానే వచ్చింది. వెళ్లింది కూడా. ఆ తరువాత అక్కడ చూస్తే హీరోయిన్ శృతిరాజ్ కనిపించడంలేదు. అలతోపాటు శృతిరాజ్ కూడా సముద్రంలోకి వెళ్లింది. ఒక్కసారిగా యూనిట్ సభ్యుల వెన్నులు జలదరించాయి. అదృష్టమేమంటే ఈ చిత్ర షూటింగ్ చూడడానికి ఆ ప్రాంతానికి చాలామంది జాలరులే వచ్చారు. వారు వెంటనే అప్రమత్తయి సముద్రంలోకి వెళ్లి శృతిరాజ్ ను రక్షించారు. ఈ అనుకోని సంఘటనకు బెదిరిన చిత్రం యూనిట్ షూటింగ్ ను రద్దు చేశారు. శృతిరాజ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఎలాంటి హానీ లేదని డాక్టర్లు చెప్పడంతో యూనిట్ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











