For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సెక్స్ టేపుల వివాదం మళ్ళీ తెరమీదకి: మా ఆనందమయి..రంజిత..శ్రీవల్లి వెనుక ఉన్న కథేమిటి?

  |
  సెక్స్ టేపుల వివాదం మళ్ళీ తెరమీదకి

  సినీ నటి రంజిత "మా ఆనందమయి"గా పేరు మార్చుకున్న విషయం విదితమే. సెక్సానందగా వివాదాస్పద రీతిలో వార్తల్లోకెక్కిన నిత్యానందతో కలిసి రంజిత తిరుమలలో దర్శనమివ్వడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. రంజితతో కలిసి నిత్యానంద రాసలీలలు.. అంటూ ఓ వీడియో తెరపైకి రావడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా రంజిత, నిత్యానంద వార్తల్లో వ్యక్తులుగా మారారు.

   అసలు నేను మగాడ్నే కాదు

  అసలు నేను మగాడ్నే కాదు

  ఆ తర్వాత అనేకానేక వివాదాలు నిత్యానంద చుట్టూ ముసురుకున్నాయి. "అసలు నేను మగాడ్నే కాదు.." అంటూ నిత్యానంద పోలీసుల విచారణలో చెప్పడం అప్పట్లో మరో సంచలనం. వివాదాల కారణంగా నిత్యానంద ఆశ్రమాల్లో పోలీసులు సోదాలు నిర్వహించడం, ఆయనపై పలువురు గృహిణులు "వేధింపు" ఆరోపణలు చేయడం జరిగాయి.

  స్వామి నిత్యానంద

  స్వామి నిత్యానంద

  వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో కలకలం రేగింది. ఒకప్పటి హీరోయిన్‌ రంజిత, ఆయన ఏకాంతంగా కలిసి ఉన్న దృశ్యాలు దక్షిణాదిలోని టీవీ చానెళ్లు పదేపదే ప్రచారం చేశాయి.

  వీడియో టేపులు

  వీడియో టేపులు

  అయితే ఈ వీడియోలో ఉన్నది తాము కాదని, మార్ఫింగ్‌ జరిగిందని వీరిద్దరూ వాదించారు. ఈ టేపుల్లో ఉన్నది ఎవరో తేల్చాలని కోర్టు కెక్కారు కూడా. వీడియో టేపులు ట్యాంపరింగ్‌ జరగలేదని బెంగళూరు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ గతంలో స్పష్టం చేసింది. ఈ నివేదికను నిత్యానంద సవాల్‌ చేశారు. ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కూడా వీడియో ఉన్నది వీరిద్దరేనని తాజాగా నిర్ధారించడంతో నిత్యానంద, రంజిత వాదన అబ్ధమని తేలిపోయింది.

  అసలు పేరు శ్రీవల్లి

  అసలు పేరు శ్రీవల్లి

  తమిళనాడుకు చెందిన రంజిత 1975, జూన్ 4న జన్మించింది. ఆమె అసలు పేరు శ్రీవల్లి. ప్రముఖ దర్శకుడు పి. భారతిరాజా ఆమెను చిత్రసీమకు పరిచయం చేస్తూ పేరు మార్చారు. 1992లో ‘నాదోడి థెండ్రల్‌' తమిళ సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత ఆమె అగ్ర కథానాయకిగా ఎదిగింది.

   మావిచిగురు

  మావిచిగురు

  తమిళం పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో అగ్ర కథానాయకులతో నటించింది. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మావిచిగురు' సినిమాకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకుంది. ఆమె వాలీబాల్‌ క్రీడాకారిణి కూడా.

   ఆర్మీ మేజర్‌ రాకేశ్‌ మీనన్‌

  ఆర్మీ మేజర్‌ రాకేశ్‌ మీనన్‌

  సినిమాల్లో నటిస్తుండగానే 2000 సంవత్సరంలో ఆర్మీ మేజర్‌ రాకేశ్‌ మీనన్‌తో ఆమె వివాహమైంది. కాలేజీ రోజుల నుంచి వీరిద్దరికీ పరిచయం ఉంది. పెళ్లైన తర్వాత ఏడాది పాటు చిత్రసీమకు దూరంగా ఉన్న రంజిత 2001లో మళ్లీ పునఃప్రవేశం చేసింది. సహాయ పాత్రల్లో నటిస్తూ, టీవీ షోలు కూడా చేసింది.

  విడాకులు

  విడాకులు

  2007లో భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుంది. చివరిసారిగా 2010లో మణిరత్నం ‘రావణన్‌' సినిమాలో కనిపించింది. స్వామి నిత్యానందతో ఏకాంతంగా గడిపిన వీడియో బహిర్గతం కావడంతో రంజిత పేరు మళ్లీ వెలుగులోకి వచ్చింది. సన్‌ టీవీ ఈ వీడియోను పదేపదే ప్రసారం చేయడంతో తీవ్ర కలకలం రేగింది.

  రంజిత వాదించింది

  రంజిత వాదించింది

  అయితే ఈ వీడియోలో ఉన్నది తాను కాదని రంజిత వాదించింది. తర్వాత కూడా ఆమె నిత్యానంద ఆశ్రమంలోనే ఉండిపోయింది. 2013, డిసెంబర్‌ 27న సన్యాసం స్వీకరించి ఆనందమయిగా పేరు మార్చుకుంది. బెంగళూరు శివారులోని నిత్యానంద ఆశ్రమంలో సన్యాసినిగా జీవితం గడుపుతోంది.

  English summary
  The Actress Who Caught In The Sex Scandal With Swami Nithyananda. The nation got shocked in 2010 when a video circulated, featuring controversial godman Swami Nityananda with a woman. That woman is none other than Tamil actress Ranjitha
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more