సిని సెలబ్రెటీలతో... వై.వి విజయ కుమార్తె వివాహ రిసెప్షన్ (ఫోటో ఫీచర్)
చెన్నై: ప్రముఖ సిని నటి వైవి విజయ కుమార్తె వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. వివాహ రిసెప్షన్ కి సినిమాజనం చాలా మంది హాజరై శుభాకాంక్షలు తెలియచేసారు. ముఖ్యంగా రాధిక, బాలచందర్, సుహాసిని వంటివారు వెళ్ళి ఆశ్వీరదించటంతో ఈ వేడుక ప్రముఖంగా మీడియాలో నిలిచింది.
ఎనిగండ్ల విజయ అలియాస్ వై.విజయ తెలుగు సినిమా నటి. ఈమె మొదటి చిత్రం 1970లో విడుదలైన తల్లితండ్రులు. శోభన్ బాబు సరసన కథానాయికగా నటించింది. ఇప్పటి వరకు వెయ్యికి పైగా చిత్రాలలో నటించింది. ముఖ్యాగా మా పల్లెలో గోపాలడు చిత్రంలో ఆమె పాత్ర తెలుగులో నిలిచిపోయింది.
డాన్స్ నేర్చుకోవటానికి చెన్నై వెళ్లిన ఆమె రామ విజేత ఫిల్మ్స్ వారి చిత్రంలో నటించి సినీ కెరీర్ ప్రారంభించింది. తమిళంలో 270 సినిమాలు దాకా వైవివిజయ చేసింది. కామెడీ రోల్స్, వ్యాంప్ రోల్స్ రావటంతో ఆమె మెల్లిగా వేషాలు తగ్గించుకుని చిన్ని తెరవైపు ప్రయాణం పెట్టుకుంది.

వైవి విజయ కుమార్తె రిసెప్షన్ కి పెద్ద స్టార్స్ రాకపోయినా ఆమె సమకాలీనులు ముఖ్యంగా మాజి హీరోయిన్స్ హాజరయ్యారు.

సినిమా తారలతో నిండిపోయిన రిసెప్షన్ వేదిక ఓ సినిమా షూటింగ్ లా కోలాహలంగా ఉందని చాలా మంది సంతోషంతో వ్యాఖ్యానించారు.

రాధిక.. పెళ్లి కుమార్తెకు విలువైన బహుమతి ఇచ్చి ఆశ్వరదించారు.

కె.బాలచందర్ రూపొందించన మన్మధలీలైలో మిస్ రాంగర్ గా వైవిజయ పాపులర్.. ఈ పంక్షన్ కి ఆయన వచ్చి శుభాకాంక్షలు తెలియచేసారు.

చాలా కాలం తర్వాత శారద మళ్లీ ఇలా ఓ రిసెప్షన్ వేదికపై కనపడటంతో ఆమె ప్రెండ్స్ మాటలకు కొదవేలేదు.

శ్రీ ప్రియ రావటం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందంటోంది వైవి విజయ.

మొన్నీ మధ్యనే మిధునంలో మెరిసిన లక్ష్మి ఇలా తన చిరునవ్వులతో ఫంక్షన్ ని మెరిపించారు.

నళిని కూడా ఈ పంక్షన్ కి హాజరై తన స్నేహితురాళ్లందరినీ కలుసుకుని ముచ్చటించుకున్నారు.

నిజ జీవితంలో రాధిక,లక్ష్మి మంచి ప్రెండ్స్ ..వాళ్లిద్దరూ ఈ ఫంక్షన్ లో ఇలా

పెళ్లి కుమార్తెకు షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ శుభాకాంక్షలు తెలుపుతోంది వైవివిజయ.

మరి ఈ రిసెప్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ ఎవరూ అంటే..ఖచ్చితంగా సుహాసిని మణిరత్నమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











