Just In
- 5 min ago
దర్శకుడితో కాజల్ రొమాన్స్.. పెళ్లి తరువాత కూడా అలాంటివి తగ్గించట్లేదుగా..
- 17 min ago
‘కార్తీక దీపం’ హీరోయిన్ అరుదైన రికార్డు: తెలుగులో ఈ ఘనత సాధించిన ఏకైక నటిగా వంటలక్క
- 1 hr ago
Box office: మొత్తానికి హాఫ్ సెంచరీ కొట్టేసిన మాస్ రాజా.. క్రాక్ తెచ్చిన లాభాలు ఎంతంటే?
- 1 hr ago
పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం: ఆకట్టుకుంటోన్న ‘లక్ష్య’ టీజర్
Don't Miss!
- News
నీతి, న్యాయం, సిగ్గు, లజ్జలను గాలికొదిలిన వ్యక్తి; కొడుకు అప్రయోజకుడు : చంద్రబాబుపై సాయిరెడ్డి ధ్వజం
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Sports
IPL 2021: ఉతప్పని జట్టులోకి తీసుకున్న చెన్నై.. అందుకోసమేనా?
- Finance
Gold prices today: గుడ్‌న్యూస్, రూ.49,000 దిశగా బంగారం ధరలు
- Automobiles
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వ్యభిచారంలో ఇరికించారు, చనిపోవాలనుకున్నా: నటి యమున అంతరంగం, కన్నీళ్లు....
హైదరాబాద్: సినిమాలు, టెలి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన నటి యమున. 'మౌన పోరాటం' మూవీ తర్వాత అప్పట్లో యమున స్టార్ హీరోయిన్ గా వెలింది. నటనతో పాటు అప్పట్లో బాగా అందంగా ఉండే హీరోయిన్ అనే పేరు తెచ్చుకున్నారు.
సినిమా హీరోయిన్ గా, టీవీ నటిగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఫ్యామిలీ హీరోయిన్‌గా ఫేరు తెచ్చుకుంది. అయితే 2011లో బెంగుళూరులోని ఓ స్టార్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడటం అందరినీ షాక్‌కు గురి చేసింది.
బెంగళూర్‌లోని ఐటిసి రాయల్ గార్డెనియా హోటల్లో వ్యభిచారం చేస్తూ యమున పోలీసులకు పట్టుబడిందని, ఈ కేసులో విటుడుగా సాఫ్ట్‌వేర్ కంపెనీ సిఇవోను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మీడియాలో ఈ విషయం బాగా ప్రచారం జరుగడంతో ఆమె కెరీర్ మీద దెబ్బ పడింది.
తాను ఉన్న పరిస్థితుల్లో మీడియా ముందుకొస్తే వారు సూటిపోటి మాటలతో తనను మరింత ఇబ్బంది పెడతారనే ఉద్దేశ్యంతో మీడియాకు దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే మౌనంగా ఉండటం వల్ల జనం ఎప్పటికీ తమను తప్పుడు మనిషిగానే చూస్తారని భావించిన ఆమె...తాజాగా టిఎన్ఆర్ ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, కావాలనే తనను ఇరికించారని యమున ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతం అయ్యారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

సంబంధం లేదు
ఆ రోజు తనకు సంబంధం లేక పోయినా లేని పోని అబాంఢాలు వేసారని యమున ఆవేదన వ్యక్తం చేసారు.

ఆ హోటల్ కి వెళ్లలేదు
నేను ఐటీసీ హోటల్ లో పట్టుబడ్డట్లు ప్రచారం చేసారు, కానీ నేను ఆ రోజు ఆ హోటల్ కి వెళ్లలేదు. సీసీపీ ఆఫీసుకు వెళ్లాను ఆని యమున తెలిపారు.

చనిపోవాలనుకున్నాను
తనపై వ్యభిచారం చేసినట్లు రూమర్స్ రావడంతో చాలా బాధేసింది. ఆ మచ్చతో బ్రతకాలనిపించలేదు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని తెలిపారు.

ఆ నిర్ణయం వెనక
నేను చనిపోతే పిల్లలకు చెడ్డపేరు రాకుండా ఉంటుందని భావించాను, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు.

కానీ...
అయితే నేను చనిపోతే పిల్లల పరిస్థితి ఏమిటి? అని స్నేహితులు సూచించారు. వారికోసం బత్రికేందుకు మనోధైర్యాన్ని నింపుకున్నాను అని యమున తెలిపారు.

నిజం ఎప్పటికైనా
నిజం ఎప్పటికైనా ప్రజలకు తెలియజేయాలి, నేను ఏ తప్పూ చేయలేదు అని ప్రజలు నమ్ముతారని నమ్మకం నాకు ఉందని తెలిపారు.