twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యమున చెప్పిన పూర్తి విశేషాలు: వ్యభిచారం కేసు, ఫ్యామిలీ, చిరు, పవన్, ఇంకా చాలా...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మౌనరాగం, పుట్టింటికి పట్టుచీర లాంటి హిట్ సినిమాలతో థియేటర్ ప్రేక్షకులకు, టెలిసీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయిన యమున 2011లో బెంగుళూరులో వ్యభిచారం కేసులో అరెస్టవ్వడం అప్పట్లో అందరినీ షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే.

    ఆ కేసులో బుక్ అయిన తర్వాత యమున మీడియా ముందుకు రాలేదు. దీంతో మీడియాలో ఆమె గురించి రకరకాల ప్రచారం జరిగింది. సినీ రంగానికి చెందిన ఎవరైనా వ్యభిచారం కేసులో పట్టుబడ్డప్పుడల్లా యమన పేరు తెరపైకి వచ్చేది.

    వాస్తవం ఏమిటంటే... యమున ఏ తప్పూ చేయకున్నా ఈ కేసులో ఇరుకున్నారు... కాదు కాదు కావాలనే ఇరికించారు. తనపై పడ్డ మచ్చను తొలగించుకోవడానికి దాదాపు ఐదేళ్లు పోరాడారు. ఆమె తప్పు చేసినట్లు ఎలాంటి ప్రూప్స్ లేవు. సుధీర్ఘ పోరాటం అనంతంర జూన్ 30, 2015లో కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది.

    ఈ ఐదేళ్ల కాలంలో యమున దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లి పోయారనే చెప్పాలి. ఈ గ్యాపులో ఆమె పడ్డ మనోవేదన, ఎదుర్కొన్న అవమానాలు వర్ణనాతీతం. ఒకానొక సందర్భంలో తీవ్రమైన డిప్రెషన్ కుగురైన ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అయితే పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి ఆ ప్రయత్నం మానుకున్నారు. ఆమె ఏ తప్పూ చేయక పోవడంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఆమెకు సపోర్టుగా ఉన్నారు.

    కేసు నుండి బయట పడ్డ తర్వాత ....కుటుంబం, పిల్లలు, కెరీర్ మీదనే దృష్టి సారించారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె తొలిసారి మీడియా ముందు తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్ ఇంటర్వ్యూలో అన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో వ్యభిచారం కేసుతో పాటు తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

    సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు

    సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు

    తాను సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని, చిన్నతనంలో డ్రామాలు, డాన్సు ప్రోగ్రామ్స్ లాంటివి కూడా ఎప్పుడూ చేయలేదని, పదిమందిలోకి వెళ్లి ఇలాంటివి చేయాలంటే చిన్నతనం నుండి భయంగా ఉండేదని యమున చెప్పుకొచ్చారు.

    సిస్టర్ చైల్డ్ ఆర్టిస్ట్

    సిస్టర్ చైల్డ్ ఆర్టిస్ట్

    మా సిస్టర్ చైల్డ్ ఆర్టిస్ట్, కన్నడ మూవీలో చేసింది. ఆ సమయంలో ఆమె వెంట షూటింగులకు వెళ్లేదాన్ని అని యమున చెప్పుకొచ్చారు.

    అనుకోకుండా అలా..

    అనుకోకుండా అలా..

    అనుకోకుండా ఓసారి నా ఫోటోస్ బాలచందర్ గారు చూసారు. ఆయనకు నచ్చి నన్ను పిలిపించారు అని యమున తెలిపారు.

    సుహాసిని సిస్టర్

    సుహాసిని సిస్టర్

    బాలచందర్ గారు కోరిక మేరకు తొలిసారి ఓ తమిళ సినిమాలో సుహాసిని సిస్టర్ గా చేసానని యమున తెలిపారు.

    అసలు పేరు కాదు

    అసలు పేరు కాదు

    యమున నా అసలు పేరు కాదని, బాలచందర్ గారు నన్ను చూడగానే నచ్చేసి యమన అని పిలించారు. అదే పేరు నాకు ఫిక్స్ అయిపోయిందని తెలిపారు.

    ముందు నుండి

    ముందు నుండి

    మౌనరాగం హిట్టయిన తర్వాత అన్నీ అలాంటి సినిమాలే వచ్చాయి. వాటిలో బిజీగా ఉండటం వల్ల కమర్షియల్ సినిమాలు చేయలేక పోయాను అని యమున తెలిపారు.

    చిరంజీవి సినిమాకు ట్రై చేసారట

    చిరంజీవి సినిమాకు ట్రై చేసారట

    కొదమ సింహం సినిమాకు చిరంజీవి సరసన నన్ను తీసుకోవాలని ట్రైసారట. అప్పట్లో వారికి నా కాంటాక్టు దొరకక పోవడంతో వేరే వారిని తీసుకున్నారని తర్వాత తెలిసింది. అప్పుడు వేరే షూటింగులో ఉండటం, సెల్ ఫోన్లు లేక పోవడం, అప్పటికి నాకు పిఆర్ కూడా లేక పోవడంతో ఆ అవకాశం మిస్సయ్యాను అని యమున తెలిపారు.

    ఎన్టీఆర్ గారు బాలయ్య సినిమాకు

    ఎన్టీఆర్ గారు బాలయ్య సినిమాకు

    ఎన్టీఆర్ గారు కూడా బాలకృష్ణ గారి సినిమాకు తీసుకోవాలని ట్రై చేసారని, అప్పుడు కూడా నా కాంటాక్టు దొరకక వేరే వారిని తీసుకున్నారని యమున తెలిపారు.

    కృష్ణతో రుద్ర

    కృష్ణతో రుద్ర

    తర్వాత క్రిష్ణ గారితో రుద్ర సినిమా చేసాను. ఆ సమయంలో కైకాల సత్యనారాయణ గారు చెబితే నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి అని యమున తెలిపారు.

    పవన్ కళ్యాణ్ గురించి

    పవన్ కళ్యాణ్ గురించి

    పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది క్లైమాక్స్ బాగా నచ్చింది. ఆయన హీరో అవ్వక ముందు చిరంజీవి ఇంటికి న్యూ ఇయర్ సందర్బంగా వెళ్లాను. ఆ సమయంలో చిరంజీవిగారు ఆయన భార్యతో గుడికి వెళ్లారు. సమయంలో ఇంట్లోనే ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎదురు పడ్డారు. చాలా హంబుల్ గా మాట్లాడారు, ఎంతో మంచి వ్యక్తి అని యమున తెలిపారు.

    జూ ఎన్టీఆర్

    జూ ఎన్టీఆర్

    జూ ఎన్టీఆర్ లో నాకు బాగా నచ్చే అంశం ఆయన డాన్స్ బాగా చేస్తారు అని యమున చెప్పుకొచ్చారు.

    మహేష్ బాబు

    మహేష్ బాబు

    మహేష్ బాబు బిజినెస్ మేన్ డైలాగులు నచ్చాయి, మనుషుల మాట నమ్మొద్దు, నీకంటే తోపు ఎవరూ లేరు అనే డైలాగులు నాకు చాలా నచ్చయి అని యమున తెలిపారు.

    బాపుగారి సినిమా చేయలేదనే అసంతృఫ్తి

    బాపుగారి సినిమా చేయలేదనే అసంతృఫ్తి

    బాపు గారి సినిమా చేయలేదని చాలా సార్లు ఫీలయ్యే దాన్ని అని యమున తెలిపారు.

    పూరి, రాజమౌళి, వివి వినాయక్, త్రివిక్

    పూరి, రాజమౌళి, వివి వినాయక్, త్రివిక్

    ఈ తరం తర్శకుల్లో పూరిగారు, రాజమౌళి గారు, వినాయక్ గారు, త్రివిక్రమ్ గారు ఇలా అందరూ డైరెక్టర్లు నాకు ఇష్టమైన డైరెక్టర్లే అని యమున తెలిపారు.

    క్లోజ్ గా ఉంటే ఏదో ఒకటి అంటగడతారు

    క్లోజ్ గా ఉంటే ఏదో ఒకటి అంటగడతారు

    హీరోయిన్లు రెగ్యులర్ గా ఓ హీరోకో, డైరెక్టర్ కో, నిర్మాతకో చేస్తుంటే ఏదో అంటగడతారనే మాట వాస్తవమ. ఇండస్ట్రీ అని కాదు, బయట కూడా అంతే, ఒకరితో క్లోజ్ గా మాట్లాడితే ఏదో ఒకటి రూమర్ అంటగడతారు అని యమున ఓ ప్రశ్నపకు సమాధానం ఇచ్చారు.

    అంతా అలా కాదు

    అంతా అలా కాదు

    అలా అని అందరూ అలానే చేస్తారని కాదు...కొంత మంది, వాళ్ల ద్రుష్టి కోణం అలా ఉంటుంది, నా జీవితంలో అలాంటిది ఏమీ జరుగలేదు అని యమున తెలిపారు.

    యాక్సిడెంట్స్

    యాక్సిడెంట్స్

    తమిళ సీరియల్ చేస్తుండగా తిరిగి వస్తుండగా యాక్సిడెంట్, కార్ మొత్తం బ్లాస్ట్, సెంట్రల్ లాక్ ఓపెన్ కావడంతో బ్రతికి బయట పడ్డాను. పుట్టింటికి పట్టుచీర సమయంలో ఫైర్ యాక్సిడెంట్, వెంట్రుకలు కాలిపోయాయి. నేను అరుస్టుంటే అంతా యాక్టింగ్ అనుకున్నారు. కెమెరామెన్ కి హీట్ తాకి అసలు విషయం గమనించారు. మంటలు ఆర్పారు అలా రెండో సారి ప్రమాదం తప్పంది.

    ట్రైన్ యాక్సిడెంట్

    ట్రైన్ యాక్సిడెంట్

    అమ్మ కడుపు చల్లన సమయంలో ట్రైన్ యాక్సిడెంట్ తప్పింది. నేను ట్రైన్ కి అడ్డంగా వెలుతుంటే హీరో నన్ను పక్కకి లాగాలి. నేను యాక్టింగ్ మీదనే దృష్టి పెట్టి దాన్ని పట్టించుకోలేదు. చివరి నిమిషయంలో బయటకు లాగారు. కొద్దిలో ప్రమాదం తప్పింది. అపుడు మా అమ్మ చాలా గొడవ చేసింది అని యుమున తెలిపారు.

    లైఫ్ సీరియస్ గా తీసుకునేదాన్ని కాదు..

    లైఫ్ సీరియస్ గా తీసుకునేదాన్ని కాదు..

    ఆ రోజుల్లో అప్పుడు లైఫ్ సీరియస్ గా తీసుకునే దాన్ని కాదు అని యమున తెలిపారు.

    ఆ సంఘటనతో చనిపోతే బావుండు అని..

    ఆ సంఘటనతో చనిపోతే బావుండు అని..

    కానీ తర్వాత నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు...ఆ యాక్సిడెంట్స్ లో నేను చనిపోతే బావుండు అనిపించేలా చేసాయి అని యమున తెలిపారు.

    ఆ షాక్ నుండి ఇప్పుడిప్పుడే బయటకు

    ఆ షాక్ నుండి ఇప్పుడిప్పుడే బయటకు

    ఆ షాక్(వ్యభిచారం కేసు) నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను. అలాంటిది ఎవరి జీవితంలో జరుగకూడదు అని యమున తెలిపారు.

    కావాలనే ఇరికించారు

    కావాలనే ఇరికించారు

    ఎవరో కావాలనే చేసారు. అందరికీ తెలుసు. సీసీబీ ఆఫీసు నుండి కొందరు నన్ను ట్రాప్ చేసి ఇరికించారు అని యమున తెలిపారు.

    ఎంక్వయిరీ అంటూ పిలిపించారు

    ఎంక్వయిరీ అంటూ పిలిపించారు

    సీసీబీ ఆఫీసు నుండి ఎంక్వయిరీ అని పిలించారు. అక్కడికి వెళ్లాక నన్ను సస్పెక్ట్ అంటే కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఆ సమయంలో ఎవరో మీడియాకు ఈ సమాచారం నా జీవితాన్ని అల్లరి చేసారు. నా జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు అది అని యమున తెలిపారు.

    5 సంవత్సరాలు అజ్ఞాతంలో..

    5 సంవత్సరాలు అజ్ఞాతంలో..

    ఆ సంఘటన తర్వాత ఐదు సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాను. 2015 జూన్ 30న కేసు కొట్టేసారు. ఇది ఫాల్స్ కేసు అని కొట్టేసారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అని యమున తెలిపారు.

    నమ్మేవాళ్లు నమ్మనీ, నమ్మక పోతే వాళ్ల ఇష్టం..

    నమ్మేవాళ్లు నమ్మనీ, నమ్మక పోతే వాళ్ల ఇష్టం..

    నా గురించి నమ్మే వాళ్లు నమ్మనివ్వండి, నమ్మని వాళ్లు..కోపం ఉన్నవాళ్లు నెగెటివ్ గానే ఉండనివ్వండి. నేను 100% ఎలాంటి తప్పు చేయలేదు అని యమున తెలిపారు.

    మీడియా ముందుకు రావడానికి భయం

    మీడియా ముందుకు రావడానికి భయం

    ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, ఆ సంఘటనతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను. మీడియా అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చెప్పే ధైర్యం అప్పుడు లేదు, అందుకే ఆ కేసు బుక్కయిన రోజు మీడియా ముందుకు రాలేక పోయాను అని యమున తెలిపారు.

    చాలా వరస్టుగా రాసారు,

    చాలా వరస్టుగా రాసారు,

    సెలబ్రిటీలను హైప్ చేయాలన్నా, డౌన్ చేయాలన్నా మీడియానే. ఉన్నది ఉన్నట్లు చూపించండి,... ఉన్నవి లేనివి రాయొద్దు, నన్ను వచ్చి ఎవరూ అడగలేదు, నా వల్ల మంచే జరిగింది వాళ్లకి రేటింగ్ పెరిగింది అనుకుంటాను. పాజిటివ్ గా తీసుకుంటాను, శత్రువులను కూడా క్షమించే మనస్తత్వం నాది అని యమున తెలిపారు.

    ఫ్యామిలీ

    ఫ్యామిలీ

    నా వెనక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లల మనస్తత్వం ఏమైపోతుంది, ఇలాంటివి జరిగినపుడు నా పరస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అంటూ యమున కన్నీటి పర్యంతం అయ్యారు.

    ఆ ఛానల్

    ఆ ఛానల్

    నా గురించి ఓ చానల్ చాలా చెత్తగా వార్తలు వేసింది. పైకి నా ఫోటో చూపిస్తూ బ్యాగ్రౌండ్లో బూతు బొమ్మలు వేస్తూ వార్తలు వేసారు. అది చూసినప్పుడు చాలా బాదేసింది అని యమున తెలిపారు.

    తెలుగు చానల్ కాదు

    తెలుగు చానల్ కాదు

    ఆ కేసు సమయంలో తెలుగు ఛానల్స్ నెగెటివిటీ ఏమీ ఎక్కువగా చూపించలేదు అని యమున అన్నారు.

    ఫ్యామిలీ సపోర్టు ఉంది

    ఫ్యామిలీ సపోర్టు ఉంది

    నేను తప్పు చేయలేదు. ప్యామిలీ సపోర్టు ఉంది. లేకుంటే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని అని యమున తెలిపారు.

    భయ పడేవారు

    భయ పడేవారు

    ఆకేసు తర్వాత మా ఇంట్లో వారు నేను ఏదైనా చేసుకుంటానని చాలా భయ పడేవారు. డోర్ లాక్ వేసుకోనిచ్చే వారు కాదు. ఏదైనా చేసుకుంటుందనే భయం, అపుడు చాలా సెన్సిటివ్ నేను అని యమున తెలిపారు.

    సంవత్సరం తర్వాత

    సంవత్సరం తర్వాత

    సంవత్సరం తర్వాత డిప్రెషన్ ఎక్కువ అయిపోయి వారం పాటు నిద్ర పట్టక పోయేది. జీవితం మీద విరక్తి, ఫేస్ కూడా అద్దంలో చూసుకునే దాన్ని కాదు. డిప్రెషన్లో ఉన్నానని ఆసుపత్రిలో అడ్మిట్ చేసారు అని యమున తెలిపారు.

    అదే ఛానల్

    అదే ఛానల్

    సంవత్సరం తర్వాత మళ్లీ అదే ఛానల్ కావాలని నాపై దుష్పచారం మొదలు పెట్టింది. ఏవో ఫోటోలు చూపించి... రెడ్ హ్యాండెడ్ గా దొరికింది అంటూ ప్రచారం చేసారు. మీడియాపై కోపం కాదు, ఉన్నది చూపించండి... నేను చేయని తప్పుకు మీరు క్రియేటివిటీ చేసి చూపించొద్దు అని యమున అన్నారు.

    న్యాయం జరిగింది

    న్యాయం జరిగింది

    కోర్టులో నాకు న్యాయం జరిగింది కాబట్టి ఇపుడు ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఫ్యామిలీ సపోర్టు లేకుంటే ఏమైపోయేదాన్ని, నేను డిప్రెషన్లో ఉన్నపుడు ఇంట్లో వాళ్లు అన్నం కలిపి తినిపిస్తుంటే విషంలా అనిపించేది అని యమున తెలిపారు.

    చనిపోవాలనుకున్నాను

    చనిపోవాలనుకున్నాను

    పిల్లలకు వీలు నామా రాసేసి సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నేను చనిపోతే అయినా వారు ఎలాంటి అవమానాలు ఎదుర్కోకుండా ఉంటానని భావించాను. కానీ స్నేహితుల సలహాతో ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

    పిల్లల కోసం

    పిల్లల కోసం

    కుక్క లా పిల్లల కోసం ఆలోచించు. కుక్క తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రాణాలను పణంగా పెడుతుంది. నువ్వు చనిపోతే నీ పిల్లల పరిస్థితి ఏమిటి అని నా ఫ్రెండ్ చెప్పింది. సూసైడ్ చేసుకునే వాళ్లకి ఒకే ఒక్క మాటతో మార్చవచ్చు. నేను అలానే మారిపోయాను అని యమున తెలిపారు.

    భర్త సహకారం

    భర్త సహకారం

    భర్త సహకారం ఉంది కాబట్టే ఇపుడు నేను మీ ముందు ఉన్నాను. ఆ సంఘటన తర్వాత ఆయన సహనం, సహకారం చూసి నాకు దేవుడిలా అనిపించారు అని యమున తెలిపారు.

    ఫైర్ బ్రాండ్ నేను

    ఫైర్ బ్రాండ్ నేను

    ఎలా బ్రతికాను, నిజాయితీగా బ్రతికాను, ఫైర్ బ్రాండ్. కొందరు కావాలని చేసారు, ఇలాంటి వాళ్ల మధ్య నేను బ్రతకాలా అనిపించింది అని యమున తెలిపారు.

    అలా డిప్రెషన్ నుండి బయట పడ్డాను

    అలా డిప్రెషన్ నుండి బయట పడ్డాను

    బుక్స్ చదవడం మొదలు పెట్టాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్పీచ్ లు విన్నాను అలా డిప్రెషన్ నుండి బయట పడ్డాను అని యమున తెలిపారు.

    తెర వెనక పెద్దవాళ్లు ఉన్నారు

    తెర వెనక పెద్దవాళ్లు ఉన్నారు

    నన్ను కేసులో ఇరికించడం వెనక కొందరు పెద్దవాళ్ల హస్తం ఉందని తెలిసిందే. ఇపుడు నేను నా కుటుంబమే లోకంగా బ్రతుకుతున్నాను. వాళ్లపై ఫైట్ చేసే శక్తి నాకు లేదు అని యమున తెలిపారు.

    వ్యభిచారం కేసులో లీగల్ గా జరిగింది...

    వ్యభిచారం కేసులో లీగల్ గా జరిగింది...

    ఎంక్వయిరీ ఉందని సీసీబీ ఆఫీసుకు పిలిపించారు. సస్పెక్ట్ గా కేసు పెట్టారు. లీగల్ గా అరెస్టయినట్లు, బెయిల్ తో బయటకు వచ్చాము. నేను చదివిందే పదో తరగతి. ఏమీ తెలియక వాళ్లు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాను. అసలు నేను ఐటీసీ హోటల్ కు వెళ్లలేదు. నన్ను ఈ కేసులో ఇరికించడంతో స్టేషన్లోనే ఏడవటం మొదలు పెట్టాను అని యమున తెలిపారు.

    అదే సంతోషం

    అదే సంతోషం

    నన్ను ఇరికించడం వెనక ఎవరు అనేది తెలుసుకోవాలని లేదు, బయట పడ్డాను అదే సంతోషం. ఇండస్ట్రీ వాళ్లు కాదు.. బయట వారే చేసారు అని యమున తెలిపారు.

    నాన్న చనిపోయారు

    నాన్న చనిపోయారు

    ఈ కేసు తర్వాతే 2011 సెప్టెంబర్లో నాన్న చనిపోయారు. ఈ ఇష్యూ వల్ల కాదు... హార్ట్ ఎటాక్ వచ్చింది అని యమున తెలిపారు.

    భర్త గురించి

    భర్త గురించి

    హస్బండ్ సాఫ్ట్ వేర్..ఇంజనీరింగ్, ఎంబీఏ చేసి ఇపుడు సాప్ మీద జాబ్ చేస్తున్నారు, మాది అరేంజ్డ్ మ్యారేజ్ అని యమున తెలిపారు.

    పెయిన్ ఉంటుంది

    పెయిన్ ఉంటుంది

    తప్పు చేయనప్పుడే ఎక్కువ పెయిన్ ఉంటుంది. తప్పు చేసే దాన్ని అయితే ఇన్ ఫ్లూయెన్స్ తో బయటకు వచ్చేదాన్ని అని యమున తెలిపారు.

    డబ్బు కోసమా

    డబ్బు కోసమా

    ఫైనాన్సియల్ ఇంట్రెస్టు లేదు, డబ్బు కోసం చేయాల్సిన అవసరం లేదు. తప్పు చేసుంటే ప్రూవ్ అయ్యేది, తప్పు చేయలేదు కాబట్టే ప్రూవ్ కాలేదు. సీసీబీ ఆఫీసుకే వెళ్లాను, ఏ హోటల్ కి వెళ్లలేదు, ఇది క్లియర్ అని యమున తేల్చి చెప్పారు.

    ఇండస్ట్రీపై రెస్పెక్ట్

    ఇండస్ట్రీపై రెస్పెక్ట్


    అవకాశాలు వస్తే చేస్తా, ఎవరినీ అడగను. నేను ముందు నుండీ అంతే అని యమున తెలిపారు.

    అమ్మాయిలను మానిప్యులేట్ చేయడం

    అమ్మాయిలను మానిప్యులేట్ చేయడం

    ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలను మానిప్యూలేట్ చేయడం ఎక్కడైనా ఉంది. అవకాశం ఇస్తే ఎక్కడైనా అలాంటి వాటి గురించి మాట్లాడతారు అని యమున తెలిపారు.

    ఇపుడు స్టాంగ్ అయ్యాను

    ఇపుడు స్టాంగ్ అయ్యాను

    ఇపుడు స్టాంగ్ అయ్యాను. ఎక్కడికి వెళ్లినా ధైర్యంగా వెళాను, పులిలా వెళతాను, ఒంటరిగా కూడా బ్రతికే ధైర్యం వచ్చింది అని యమున తెలిపారు.

    స్టార్ హోటల్ లో చిరంజీవి ఇచ్చిన పార్టీకి కేటీఆర్, మహేష్ బాబు, రవితేజ ఇంకా స్టార్స్ హాజరయ్యారు.

    స్టార్ హోటల్ లో చిరంజీవి ఇచ్చిన పార్టీకి కేటీఆర్, మహేష్ బాబు, రవితేజ ఇంకా స్టార్స్ హాజరయ్యారు.

    చిరంజీవి లగ్జరీ బర్త్ డే పార్టీ ఫోటోల కోసం క్లిక్ చేయండి

    English summary
    Actress Yamuna full interview. Actress Yamuna about prostitution case. Actress Yamuna is an Indian film actress known for her works in South Indian Cinema and Tele Serials.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X