‘దంగల్’ నటిని లైంగిక వేధింపులు: ఆ నీచుడికి 3 నుండి 5 ఏళ్ల జైలు?
Recommended Video

'దంగల్', 'సీక్రెట్ సూపర్ స్టార్' చిత్రాల్లో నటించిన 17 సంవత్సరాల జైరా వాసిమ్ ఇటీవల విస్తారా విమానంలో ఢిల్లీ నుండి ముంబై వస్తూ లైంగిక వేధింపులకు గురైన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేట్ కంపెనీలో సినియర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న వికాస్ సచ్‌దేవా అనే వ్యక్తి ఈ నీచానికి పాల్పడ్డాడు.

సోషల్ మీడియా ద్వారా వైరల్
తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి జైరా వాసిమ్ విమాన సిబ్బందికి చెప్పినా పట్టించుకోక పోవడం, తోటీ ప్రయాణీకులు కూడా స్పందించక పోవడంతో సోషల్ మీడియాలో అతడి వెకిలి చేష్టల గురించి గురించి ఆమె పోస్టు చేశారు. ఈ విషయం కొన్ని గంటల్లోనే వైరల్ అయి మహిళా కమీషన్ స్పందించే వరకు వెళ్లింది.

సీరియస్‌గా తీసుకున్న విస్తారా
‘జైరా వాసిమ్' ఘటనతో విస్తారా ఎయిలైన్స్‌ను ఇబ్బందుల్లో పడేసింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే అతడిని అరెస్టు చేసి రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచారు. అతడిని కోర్టులో ప్రవేశ పెట్టగా డిసెంబర్ 22 వరకు జుడీషియల్ కస్టడీ విధించారు.

సెక్సువల్ హెరాస్మెంట్ కింద కేసు నమోదు
పోలీసులు వికాస్ సచ్‌దేవా మీద ఐపిసీ సెక్షన్ 354, పోస్కో యాక్ట్ కింద్ సెక్సువల్ హెరాస్మెంట్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతడిపై నేరం రుజువైతే దాదాపు 3 ఏళ్ల నుండి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

నరకం అనుభవించిన జైరా వాసిమ్
ఈ నెల 9వ తేదీన జైరా వాసిమ్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ నుండి ముంబైకి తన తల్లితో కలిసి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఆమెను ఫ్లైట్లో లైట్లు డిమ్ చేయగానే వికాస్ సచ్ దేవా....తన వెకిలి చేష్టలతో లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఆమె వీపుపై చేతితో రుద్దడం, ఆమె సీటుపై కాళ్లు పెట్టడం లాంటివి చేసి ఇబ్బంది పెట్టాడు.


Click it and Unblock the Notifications











