twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తారామణుల సేవానిరతి

    By Staff
    |

    ప్రజలు అభిమానించి, ఆరాధించి పల్లకీలు మోసి తమ గుండెల్లో పదిలపర్చుకుంటారు. అటువంటి ప్రజలకు తిరిగి తమ చేతనైనంత సాయం చేయాలన్న సంకల్పం గల కళాకారులు చాలా కొద్దిమందే ఉంటారు. వారిలో ప్రముఖులు తమిళ చిత్రసీమలో రజనీకాంత్‌ అయితే, తెలుగులో చిరంజీవి. మిగతా కళాకారులు సైతం తమకు చేతనైనంత చేయూత అందిస్తునే ఉన్నా సమాజ సేవను కూడా ఒక బృహత్‌ కార్యక్రమంగా అమలు చేస్తున్నది మాత్రం వీరిద్దరే. అదే కోవలోకి ఇప్పుడు మరో ఇద్దరు దక్షిణాది భామలు వచ్చి చేరుతున్నారు.

    స్నేహ! తమిళంలో అగ్రశ్రేణి కథానాయికగా పేరు తెచ్చుకుని అటుపై తెలుగులోనూ బాపూ బొమ్మగా అవతరించి, ప్రేక్షకుల మది దోచిన అందాల స్నేహ.. రజనీ సర్‌ అడుగుజాడల్లో సేవా కార్యక్రమం ఒకటి మొదలుపెట్టింది. ఇటీవల ఆమె తన సంపాదను పెట్టుబడిగా పెట్టి తను పుట్టి పెరిగిన ప్రాంతం బన్‌రుట్టిలో ఒక పెద్ద కల్యాణ మండపాన్ని కొనుగోలు చేసింది. ఆ కల్యాణ మండపాన్ని కొత్తగా తీర్చిదిద్దడమే కాకుండా స్నేహ మహల్‌ అని పేరు పెట్టుకుంది. నిరుపేదలైన జంటలకు అక్కడ ఉచితంగా పెళ్లి చేసుకునే అవకాశాన్ని కూడా స్నేహ కల్పిస్తోంది. కల్యాణ మంటపంలో పెట్టుబడి పెట్టడం మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయం అయితే, దానికి ఛారిటీ కూడా జత చేయడం మరో మంచి విషయం.

    ఇక త్రిష! చెన్నైలోని తన అభిమాన సంఘం ఆహ్వానం మేరకు త్రిష ఇంత బిజీ షెడ్యూల్‌లో సైతం కొంత సమయం కేటాయించి కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ని సందర్శించింది. అక్కడ పిడియాట్రిక్‌ వార్డ్‌లో ఆమెకు 43 మంది చిన్నారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. ఆ సందర్భంగా అక్కడి పిల్లలకు తను కొని తెచ్చిన ఆట బొమ్మలను అందించింది త్రిష. తర్వాత వారందరితో కలిసి భోజనం కూడా చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన ఫ్యాన్‌ క్లబ్‌ చేస్తున్న చారిటీ కార్యకలాపాలు నచ్చి ఆ క్లబ్‌ ఆహ్వానాన్ని మన్నించానంది. తన తదుపరి చిత్రం భీమా విడుదల సందర్భంగా రక్త దాన శిబిరాలు నిర్వహించ తలపెట్టినట్టు చెప్పింది. ఇంకా పేదలకు ఉచితంగా విద్య అందించడం, భవిష్యత్తులో పేదల కోసం హాస్పటల్‌ కట్టించడం వంటి ప్రణాళికలు ఉన్నాయని చెప్పింది. అలాగే తను నేత్రదానం కూడా చేయదలచినట్టు త్రిష ప్రకటించడం విశేషం.

    స్నేహ, త్రిషల మంచి మనసులు మెచ్చుకోవలసిందే!

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X