చిన్న వయసులోనే గర్భం దాల్చిన హీరోయిన్లు (ఫోటో ఫీచర్)
ముంబై: ఈ కాలం హీరోయిన్ల విషయానికొస్తే.....పెళ్లికి అసలు విలువే ఇవ్వడం లేదు. చేసుకున్నా లేటుగా చేసుకుంటున్నారు. కనీసం 30 ఏళ్లు దాటనిదే పెళ్లి ఊసెత్తడం లేదు. కొందరైతే 35 దాటినా పెళ్లి జోలికి మాత్రం వెళ్లడం లేదు. మరికొందరు పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు. తమలో గ్లామర్ ఉన్నంత సేపూ వెండితెరపై వెలిగిపోవడానికే మొగ్గు చూపుతున్నారు తప్ప....కెరీర్ త్యాగం చేసి పిల్లలు కనడానికి మాత్రం అస్సలు ఇష్ట పడటం లేదు.
అయితే ఇలాంటి హీరోయిన్లకు భిన్నంగా మరికొందరు పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. కెరీర్‌ను పెద్దగా లెక్క చేయకుండా సంసార జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముందు కుటుంబం, పిల్లలు కనడం అనే అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అలా తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
సినిమా రంగంలో చిన్న వయసులోనే(సామాన్య జనం దృష్టిలో అది సరైన వయసే)గర్భం దాల్చిన వారి వివరాలను ఈ సారి స్లైడ్ షోలో ఓ లుక్కేద్దాం....

సారిక
బాలీవుడ్ నటి సారిక , సౌతిండియా యాక్టర్ కమల్ హాసన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు కూతుర్లు. తన 26వ ఏటనే సారిక శృతి హాసన్‌కు జన్మనిచ్చింది. ప్రస్తుతం కమల్-సారిక విడిపోయారు. ఇపుడు ఆమె కూతుర్లు ఇద్దరూ కూడా సినిమా రంగంలోనే కొనసాగుతున్నారు.

నీతూ సింగ్
బాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన నీతూ సింగ్ తన 14 ఏట నుండే నటుడు రిషీ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. నీతూకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అదే సంవత్సరం వీరికి కూతురు రిద్దిమ జన్మించింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఈ దంపతులు రణబీర్ కపూర్‌కు జన్మనిచ్చారు.

హనీ ఇరానీ
స్క్రిప్టు రైటర్ హనీ ఇరానీ, ప్రముఖ లిరిసిస్ట్ అండ్ స్ర్కిప్టు రైటర్ జావేద్ అక్తర్‌ను తన 22వ ఏట 1972లో పెళ్లాడింది. అదే సంవత్సరం ఈ దంపతులకు కూరురు జోయా జన్మించింది.

డింపుల్ కపాడియా
బాలీవుడ్ ప్రముఖుడు రాజేష్ కన్నాను నటి డింపుల్ కపాడియా 16 ఏటనే పెళ్లాడింది. 17వ ఏటనే ఆమె ట్వింకిల్ ఖన్నాకు జన్మనిచ్చింది.

బబితా
కరీనా కపూర్ తల్లి బబితా కపూర్ చిన్న వయసులోనే నటుడు రణధీర్ కపూర్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత ఆమె తన 26వ ఏట గర్భం దాల్చింది.

షర్మిలా ఠాగూర్
బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. 25వ ఏటనే బబితా తొలి బిడ్డకు జన్మనిచ్చింది.


Click it and Unblock the Notifications











