For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రగ్స్‌తో ఛార్మీకి సంబంధం లేదు.. వార్తలతో నా భార్య గుండె పగిలింది.. తండ్రి ఆవేదన

By Rajababu
|

డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నది. ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కోవడం టాలీవుడ్‌కు మాయని మచ్చగా మారింది. ఈ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, సినీ నటులు రవితేజ, ఛార్మీ, సుబ్బరాజు, తనీష్, తరుణ్ తదితరులు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ కోసం పూరీ జగన్నాథ్ బుధవారం అధికారుల ముందుకు వచ్చారు. రేపటి నుంచి మిగితా నటులను కూడా విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఛార్మీ తండ్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఛార్మీకి డ్రగ్స్ వాడే అలవాటు లేదు..

ఛార్మీ కౌర్ తండ్రి దీప్‌ సింగ్‌ ఉప్పల్‌ మాట్లాడుతూ.. నా కూతురుకు డ్రగ్స్‌ వాడే అలవాటు లేదు. మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోంది. వాస్తవానికి దూరంగా ఆమెపై ఆరోపణలు చేయడం బాధాకరం అని అన్నారు. తన కూతురుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, ఛార్మీ గురించి తనకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు అని ఆయన అన్నారు.

Puri Jagannadh Irritated With Enquiry Questions
నా కూతురికి కష్టం తప్ప మరోకటి తెలియదు

నా కూతురికి కష్టం తప్ప మరోకటి తెలియదు

13 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది. తన ప్రతిభతో టాలీవుడ్‌లో ఉన్నత స్థాయికి చేరుకొన్నది. ‘నా కూతురు కష్టం తప్ప మరోకటి తెలియదు. ఆమె ఎంతో హార్డ్‌ వర్కర్‌. నా కూతురు గురించి నాకు బాగా తెలుసు అని దీప్‌సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ సప్లయర్‌తో సంబంధాలు అవాస్తవం

చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం ఉంటే ఛార్మీ ఈ స్థాయికి వచ్చుండేది కాదు. నా కూతురు డ్రగ్స్‌ వాడుతున్నట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. ఛార్మీ గురించి ఏదైనా రాసేముందు వాస్తవాలను తెలుసుకోవాలి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కంటున్న వ్యక్తులకు కుటుంబాలు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ వార్తల నా కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు. తన కూతురిపై వచ్చిన ఆరోపణలతో నా భార్య గుండె బద్దలైపోయింది అని దీప్ సింగ్ అన్నారు.

గురువారం విచారణకు ఛార్మీ

డ్రగ్ సప్లయర్ కెల్విన్‌తో సంబంధాలు, ఫోన్ డేటా ఆధారంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 20న హీరోయిన్‌ ఛార్మీ విచారణకు హాజరుకానున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థుతుల నేపథ్యంలో చార్మీ ఉద్వేగానికి లోనయ్యారు.

ఛార్మి, ముమైత్‌ఖాన్‌, రవితేజకు సంబంధముందా?

బుధవారం జరిగిన విచారణ సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తున్నది. డ్రగ్స్ వ్యవహారంలో ఛార్మీ, ముమైత్ ఖాన్, రవితేజ, సుబ్బరాజు, ఇతర నటీనటుల పాత్ర ఏమిటనే కోణంలో ప్రశ్నలు అడిగినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఛార్మి కూడా తీవ్రమైన విచారణ ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నది.

English summary
Investigation of Drug links with Tollywood is moving with fast manner. Officials are interogating the Drug supplier Kelvin in their custody. Reports suggest that Kelvin has told many interesting and shocking things to officials. Puri Jagannadh, Raviteja, Charmi, Mumaith Khan, Navadeep are going to attend before SIT from 19th July. In this connection, Charmi Kaur father Deep Singh gets emotional about her daughter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more