ఇంట్లోనే ఉరి పెట్టుకున్న నటుడు.. ఆత్మహత్య.. ఆస్తి వాళ్ళకే అంటూ నోట్
బుల్లితెర నటుడు కుశాల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం అర్ధరాత్రి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. హిందీ సీరియల్స్ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇలా ఆత్మహత్య చేసుకోవడం తెలిసి షాక్ అయ్యారు జనం.
అయితే కుశాల్ మృతదేహం వద్ద సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నిర్థారించారు. సూసైడ్ నోట్ లో తన చావుకు ఎవరూ బాధ్యులు కారు అని పేర్కొంటూ తన ఆస్తిని తల్లిదండ్రులు, కుమారుడికి సమానంగా పంచండి అని తెలిపాడు. అయితే ఆయన బలవన్మరణానికి కారణం వ్యక్తిగత, వృతిపరమైన సమస్యలేవైనా అయి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు.

కుశాల్ పంజాబీ హఠాన్మరణం చెందినట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ, కుశాల్ స్నేహితుడు, నటుడు కరణ్‌వీర్ బోహ్రా ఆయన ఆత్మహత్య విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు విషయం తెలిసింది. కుశాల్ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు.
కుశాల్ మృతిపై గాయకుడు బాబా సెహగల్ విచారం వ్యక్తం చేశాడు. 'కుశాల్ లేడంటే నమ్మలేకపోతున్నాను. సవాళ్లను ఎదుర్కునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తను ఓ మంచి తండ్రి. నా తమ్ముడి వంటి నీ ఆత్మకు శాంతి చేకూరాలి కుశాల్' అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











